Trough
-
విస్తారంగా వర్షాలు
► ఆహ్లాదకరంగా వాతావరణం ► మరో ద్రోణి ► బలపడే అవకాశం ► పది మంది జాలర్ల రక్షింపు ► ఎగసి పడుతున్న అలలు సాక్షి, చెన్నై : రాష్ట్రంలో విస్తారంగా వ ర్షాలు తెరపించి తెరపించి కురుస్తున్నారుు. కొన్ని చోట్ల మోస్తరు గా, మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడుతోంది. సుమత్ర దీవుల్లో దక్షిణ అండమాన్ తీరంలో ఉపరితల ఆవర్తనం చోటు చేసుకు న్న పరిణామాలతో మరో ద్రోణి బలపడే అవకాశాలు ఉన్నట్టు వా తావరణ కేంద్రం ప్రకటించింది. ఇక, అనేక చోట్ల ఈశాన్య రుతు పవనాలు, అల్పపీడనాల ప్రభా వం వెరసి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేశారుు. ఈశాన్య రుతు పవనాలు ఆలస్యంగా తన ప్రభావాన్ని రాష్ట్రం మీద చూ పించేనా అన్న ఎదురు చూపులు పెరిగారుు. నవంబర్‌లో ఆ పవనాల ప్రభావం రాష్ట్రం మీద శూన్యం. ఇక, రెండు రోజుల క్రితం బయలు దేరిన నాడా రూపంలో భారీ వర్షాన్ని ఎదురు చూసినా, చివరకు నిరాశ తప్పలేదు. అరుుతే, నాడా తీరం దాటినా ఆ ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగానే వర్షాలు రెండు రోజులు పడుతున్నారుు. కొన్ని చోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీ వర్షం పలకరించి వెళ్తున్నది. కడలూరు, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, నామక్కల్, దిండుగల్, మధురై, విరుదునగర్, వేలూరు, కాంచీపురం, తిరువళ్లురు, చెన్నై జిల్లాలో శుక్రవారం రాత్రి అక్కడక్కడ భారీ వర్షం పడింది. శనివారం ఉదయం కూడా చిరు జల్లులు కాసేపు, మరి కాసేపు మోస్తరు వర్షం పడడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అలాగే, కాసేపు భానుడి ప్రత్యక్షం, మరి కాసేపట్లో కమ్ముకున్న మేఘాలు, వర్షం పలకరింపుతో జనం పులకింతకు గురయ్యారు. ఈ ప్రభావం మరో రోజు ఇలాగే ఉండే అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో సుమత్రా దీవుల్లో దక్షిణ అండమాన్ తీరంలో ఉపరితల ఆవర్తనంలో చోటు చేసుకున్న మార్పులతో మరో ద్రోణి బయలు దేరనుంది. దీనిని నిశితంగానే వాతావరణ కేంద్రం వర్గాలు పరిశీలిస్తున్నారుు. ఇది బలపడ్డ పక్షంలో ప్రస్తుతం వర్షాలు పడుతున్న జిల్లాల్లోనే కాకుండా కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల మీద కూడా వర్షం ప్రభావం ఉండేందుకు అవకాశాలు ఉన్నారుు. ఈ విషయంగా వాతావరణ కేంద్రం డెరైక్టర్ స్టెల్లా మీడియాతో మాట్లాడుతూ మరో ద్రోణి బయలు దేరనున్నదని, ఆదివారం దాని స్వ రూపం తేలుతుందని, ఇది బల పడ్డ పక్షంలో మరింతగా వర్షాలు ఆశాజనకంగానే ఉంటాయని వివరించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా విరుదునగర్‌లో ఎనిమిది సెంమీ వర్షం పడింది. చెన్నై మీనంబాక్కం, మధురై, శివకాశి, కాంచీపురంలలో ఏడు సెంమీ, సెంబరంబాక్కం, పూండిలలో ఆరు సెంమీ, కాట్టుపాక్కం, పరమకుడి, వేలూరులలో ఐదు సెంమీ వర్షం పడ్డట్టు ప్రకటించారు. చెన్నైలో ఈదురు గాలులతో: శుక్రవారం అర్ధరాత్రి, శనివారం వే కువ జామున చెన్నైలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పది చోట్ల చెట్ల కొమ్మలు నేల కొరిగారుు. ఆవడి, అంబత్తూరు, అన్నానగర్, తిరుముల్లైవారుుల్, పుళల్, రెడ్ హిల్స్, మాధవరం, వ్యాసార్పాడి, కీల్పాకం, గిండి, అడయార్, పల్లావరం, తాంబరంలలో భారీగానే వర్షం పడింది. నీటి రాక...: వర్షాలతో చెన్నైకు తాగు నీరు అందిస్తున్న పుళల్, పూండి, చోళవరం, సెంబరంబాక్కంలకు నీటి రాక పెరిగింది. వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో ఆ పరిసర రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింతగా వర్షాలు పడాలని ఎదురు చూపుల్లో పడ్డారు. ఇక, సముద్ర తీరాల్లో అన్ని చోట్ల కెరటాలు ఎగసి పడుతుంటే, పాంబన్‌లో వెనక్కి తగడం గమనార్హం. ఇక్కడ సముద్రం కాస్త వెనక్కి వెళ్లడంతో ఆందోళన బయలు దేరింది. నీటి రాక...వర్షాలతో చెన్నైకు తాగు నీరు అందిస్తున్న పుళల్, పూండి, చోళవరం, సెంబరంబాక్కంలకు నీటి రాక పెరిగింది. వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో ఆ పరిసర రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింతగా వర్షాలు పడాలని ఎదురు చూపుల్లో పడ్డారు. ఇక, సముద్ర తీరాల్లో అన్ని చోట్ల కెరటాలు ఎగసి పడుతుంటే, పాంబన్‌లో వెనక్కి తగడం గమనార్హం. ఇక్కడ సముద్రం కాస్త వెనక్కి వెళ్లడంతో ఆందోళన బయలు దేరింది. -
తప్పిన గండం
► తీరం దాటిన నాడా ► బలహీనపడ్డ తుపాన్ ► కడలూరులో ఆనందం ► పలు చోట్ల వర్షాలు ► సాగరంలో మరో ద్రోణి నాడా గండం తప్పింది. బలహీనపడ్డ ఈ తుపాన్ శుక్రవారం కారైక్కాల్ వద్ద తీరం దాటింది. ఈ ప్రభావంతో పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు పడుతున్నారుు. నాడా తీరం దాటడంతో కడలూరు జిల్లాలోని సముద్ర తీరవాసులు ఆనందంలో మునిగారు. ఈ ఏడాది ఓ గండం నుంచి తాము బయట పడ్డామంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఇక, సాగరంలో మరో అల్పపీడనం బయలు దేరే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర వాతావరణ కేంద్రం ప్రకటించింది. -సాక్షి, చెన్నై సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బల పడి తుపాన్‌గా మారడం, అది తమిళనాడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్న సమాచారం ప్రజల్లో ఆందోళనకు దారి తీసింది. గత ఏడాది వలే ఈ ఏడాది ఎక్కడ మరో గండాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనని కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు, కడలూరు వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. నాడా పేరుతో తరుముకొచ్చిన ఈ తుపాన్ హఠాత్తుగా బలహీన పడింది. అరుునా, తీరం దాటే సమయంలో పెను ప్రళయం ఈదురు గాలుల రూపంలో తప్పదన్న సంకేతాలతో అధికార వర్గాలు అప్రమత్తంగానే వ్యవహరించారు. కడలూరు -నాగపట్నం మధ్యలో తీరం దాటనుండడంతో జాతీయ విపత్తుల నివారణ బృందాలు సైతం రంగంలోకి దిగారుు. నాడా తీరం దాటే వరకు ఉత్కంఠ తప్పలేదు. అరుుతే, కడలూరు-నాగపట్నం వైపుగా పయనిస్తూ వచ్చిన నాడా, గురువారం అర్ధరాత్రి సమయంలో మరింతగా బలహీన పడింది. అల్పపీడనంగా మారి తన పయన మార్గాన్ని మార్చుకుంది. దీంతో రాత్రంతా పలుచోట్ల సముద్ర తీరాల్లో మోస్తరుగా వర్షం పడింది. క్రమంగా తీరం సమీపించే కొద్ది నాడా ప్రభావం తగ్గుతూ రావడంతో ఉత్కంఠ వీడింది. కారైక్కాల్‌కు పదిహేను కిమీ దూరంలో ఉదయం నాలుగున్నర గంటల సమయంలో ఎలాంటి ప్రభావం అన్నది చూపకుండా తీరం దాటింది. తుపాన్ గండం తప్పినట్టు వాతావరణ కేంద్రం ప్రకటనతో కడలూరు తీర వాసుల్లో ఆనందం రెట్టింపు అరుుంది. కడలూరులో ఆనందం: ఏటా కడలూరు తుపాన్ రూపంలో గండాల్ని చవిచూస్తూనే వస్తున్న విషయం తెలిసిందే. అటు పుదుచ్చేరిలో ప్రకంపనలు బయలు దేరినా, ఇటు తమిళనాడులో వాన గండాలు నెలకొన్నా, తొలుత విలవిలలాడే ప్రదేశం కడలూరే. కరువుతో తల్లడిల్లినా, గండాలతో ఇక్కడి ప్రజలు కొట్టుమిట్టాడక తప్పదు. ఏటా ఏదో ఒక ముప్పు తమకు తప్పదన్నట్టుగా ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. తాజాగా నాడా సైతం కడలూరు - నాగపట్నం మధ్యలో తీరం దాటనున్న సమాచారం ప్రజల్లో కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఇక, అధికార వర్గాల్ని పరుగులు తీరుుంచింది. అరుుతే, గండం తప్పిందన్న సమాచారం అక్కడి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు వికసించడం గమనార్హం. మరో ద్రోణి: నాడా తీరం దాటినా, అల్పపీడనంగా మారిన ఆ ప్రభావంతో సముద్ర తీరాల్లో తెరపించి తెరపించి మోస్తరుగా వర్షం పడుతోంది. చెన్నైలో కాసేపు వర్షం, మరి కాసేపు భానుడు ప్రత్యక్షం, ఇంకాసేపటికి ఆకాశం మేఘావృతం అన్నట్టుగా శుక్రవారం వాతావరణం నెలకొంది. గురువారం అర్ధరాత్రి మహాబలిపురంలో 11సెంమీ, చోళవరంలో ఆరు సెంమీ వర్షం అత్యధికంగా నమోదైంది. కాగా, అండమాన్ సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బయలు దేరనుంది. ఈ ద్రోణి ప్రభావం ఏమిటో, పయన మార్గం ఎలా ఉంటుందోనన్నది ఆదివారం నాటికి తేలనుంది. ఈ సమాచారాన్ని కేంద్ర వాతావరణ అధికారులు ఢిల్లీలో ప్రకటించారు. ఈ అల్పపీనడం బల పడ్డ పక్షంలో తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ వైపుగా కదిలేందుకు ఆస్కారం ఎక్కువే. ఇందుకు కారణం అండమాన్ సమీపంలోని నెలకొనే అల్పపీడనాలు అత్యధికంగా ఎంచుకున్న మార్గాలు ఈ రెండే. ఇక, నాడా ప్రభావం తగ్గినా, సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతూనే ఉన్నందున, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం వర్గాలు సూచిస్తున్నారుు. శనివారం సాయంత్రం తర్వాత వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లొచ్చని సూచించే పనిలో పడ్డారు. -
కోస్తాంద్రకు మరో అల్పపీడన ద్రోణి
-
పడగొట్టిన ఈసీబీ ప్యాకేజీ..
249 పాయింట్ల నష్టంతో 25,638కు సెన్సెక్స్ 82 పాయింట్ల నష్టంతో 7,782కు నిఫ్టీ ముంబై: యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ప్యాకేజీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పతనబాట పట్టాయి. వీటితో పాటే మన స్టాక్ మార్కెట్ కూడా శుక్రవారం నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. స్టాక్ సూచీలు నష్టపోవడం ఇది వరుసగా మూడో రోజు. బీఎస్ఈ సెన్సెక్స్249 పాయింట్లు నష్టపోయి 25,638 పాయింట్లు వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయి 7,782 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు వారాల కనిష్ట స్థాయి. రియల్టీ, ఎఫ్ఎంసీజీ, వాహన, బ్యాంకింగ్, ఐటీ, ఆర్థిక సేవల రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 531పాయింట్లు నష్టపోయింది. రూపాయి పడిపోవడం, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడం ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇక ఈ వారానికి సెన్సెక్స్ 490 పాయింట్లు(1.87 శాతం), నిఫ్టీ 161 పాయింట్లు (2 శాతం) చొప్పున నష్టపోయాయి. 4 సెన్సెక్స్ షేర్లకే లాభాలు సన్ ఫార్మా రూపొందించిన క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే గ్లీవెక్ జనరిక్ వెర్షన్‌కు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం లభించడంతో సన్ ఫార్మా షేర్ 4 శాతం ఎగసింది. సెన్సెక్స్ సూచీలోని సన్ ఫార్మాతో పాటు భారతీ ఎయిర్టెల్, కోల్ ఇండియా, టాటా స్టీల్ షేర్లు పెరిగాయి. హెచ్డీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా చెరో 2.4 శాతం చొప్పున నష్టపోయాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు నష్టపోయాయి. 4 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విలీన వార్తలతో జీ లెర్న్ 3.3 శాతం,, ట్రీ హౌస్ ఎడ్యుకుషన్ అండ్ యాక్సెసరీ 10 శాతం చొప్పున లాభపడ్డాయి. ఎన్టీపీసీ, ఐటీసీ, ఐసీసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు పతనమయ్యాయి. హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ షేర్లన్నీ 2 శాతం వరకూ నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎస్బీఐలు 0.5-3 శాతం వరకూ నష్టపోయాయి. 1,567 షేర్లు నష్టాల్లో, 1,177 షేర్లు లాభాల్లో ముగిశాయి. మదర్సన్ సుమికి అండర్ వెయిట్... అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ, వాహన విడిభాగాల కంపెనీ మదర్సన్ సుమి రేటింగ్‌ను అండర్ వెయిట్‌కు తగ్గించింది. కంపెనీ ఆదాయం 20 శాతం తగ్గే అవకాశాలున్నాయని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తోంది. మదర్సన్ సుమి అంచనా వేస్తున్న మార్జిన్లు ఆచరణ సాధ్యం కావంటూ మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. రూ,238 టార్గెట్ ధరగా ఈ కంపెనీ రేటింగ్‌ను అండర్‌వెయిట్‌కు తగ్గించింది. ఈ నేపథ్యంలో మదర్సన్ సుమి షేర్ ధర 1% క్షీణించి రూ.280 వద్ద ముగిసింది. వచ్చే ఏడాది మదర్సన్ సుమి 18 ప్లాంట్లను అందుబాటులోకి తెస్తోందని, దీంతో వ్యయాలు పెరిగిపోతాయని పేర్కొంది. కర్బన ఉద్గారాల విషయంలో ఇటీవల భారీ మోసానికి పాల్పడిన ఫోక్స్‌వ్యాగన్ నుంచి మదర్సన్ సుమికి వచ్చే రాబడుల వాటా 44%గా ఉండడమూ ప్రతికూలత చూపనున్నదని పేర్కొంది.