విస్తారంగా వర్షాలు | The abundance of rain | Sakshi
Sakshi News home page

విస్తారంగా వర్షాలు

Published Sun, Dec 4 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

The abundance of rain

ఆహ్లాదకరంగా వాతావరణం
మరో ద్రోణి
బలపడే అవకాశం
పది మంది జాలర్ల రక్షింపు
ఎగసి పడుతున్న అలలు

సాక్షి, చెన్నై : రాష్ట్రంలో విస్తారంగా వ ర్షాలు తెరపించి తెరపించి కురుస్తున్నారుు. కొన్ని చోట్ల మోస్తరు గా, మరి కొన్ని చోట్ల భారీ వర్షం పడుతోంది. సుమత్ర దీవుల్లో దక్షిణ అండమాన్ తీరంలో ఉపరితల ఆవర్తనం చోటు చేసుకు న్న పరిణామాలతో మరో ద్రోణి బలపడే అవకాశాలు ఉన్నట్టు వా తావరణ కేంద్రం ప్రకటించింది. ఇక, అనేక చోట్ల  ఈశాన్య రుతు పవనాలు, అల్పపీడనాల ప్రభా వం వెరసి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేశారుు. ఈశాన్య రుతు పవనాలు ఆలస్యంగా తన ప్రభావాన్ని రాష్ట్రం మీద చూ పించేనా అన్న ఎదురు చూపులు పెరిగారుు. నవంబర్‌లో ఆ పవనాల ప్రభావం రాష్ట్రం మీద శూన్యం. ఇక, రెండు రోజుల క్రితం బయలు దేరిన  నాడా రూపంలో భారీ వర్షాన్ని ఎదురు చూసినా, చివరకు నిరాశ తప్పలేదు. అరుుతే, నాడా తీరం దాటినా ఆ ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగానే వర్షాలు రెండు రోజులు పడుతున్నారుు. కొన్ని చోట్ల మోస్తరుగా, మరికొన్ని చోట్ల భారీ వర్షం పలకరించి వెళ్తున్నది.

కడలూరు, నాగపట్నం, తంజావూరు, తిరువారూర్, నామక్కల్, దిండుగల్, మధురై, విరుదునగర్, వేలూరు, కాంచీపురం, తిరువళ్లురు, చెన్నై జిల్లాలో శుక్రవారం రాత్రి అక్కడక్కడ భారీ వర్షం పడింది. శనివారం ఉదయం కూడా చిరు జల్లులు కాసేపు, మరి కాసేపు మోస్తరు వర్షం పడడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అలాగే, కాసేపు భానుడి ప్రత్యక్షం, మరి కాసేపట్లో కమ్ముకున్న మేఘాలు, వర్షం పలకరింపుతో జనం పులకింతకు గురయ్యారు. ఈ ప్రభావం మరో రోజు ఇలాగే ఉండే అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో సుమత్రా దీవుల్లో దక్షిణ అండమాన్ తీరంలో ఉపరితల ఆవర్తనంలో చోటు చేసుకున్న మార్పులతో మరో ద్రోణి బయలు దేరనుంది. దీనిని నిశితంగానే వాతావరణ కేంద్రం వర్గాలు పరిశీలిస్తున్నారుు.

ఇది బలపడ్డ పక్షంలో ప్రస్తుతం వర్షాలు పడుతున్న జిల్లాల్లోనే కాకుండా కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల మీద కూడా వర్షం ప్రభావం ఉండేందుకు అవకాశాలు ఉన్నారుు. ఈ విషయంగా వాతావరణ కేంద్రం డెరైక్టర్ స్టెల్లా మీడియాతో మాట్లాడుతూ మరో ద్రోణి బయలు దేరనున్నదని,  ఆదివారం దాని స్వ రూపం తేలుతుందని, ఇది బల పడ్డ పక్షంలో మరింతగా వర్షాలు ఆశాజనకంగానే ఉంటాయని వివరించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా విరుదునగర్‌లో ఎనిమిది సెంమీ వర్షం పడింది. చెన్నై మీనంబాక్కం, మధురై, శివకాశి, కాంచీపురంలలో ఏడు సెంమీ, సెంబరంబాక్కం, పూండిలలో ఆరు సెంమీ, కాట్టుపాక్కం, పరమకుడి, వేలూరులలో ఐదు సెంమీ వర్షం పడ్డట్టు ప్రకటించారు.

చెన్నైలో ఈదురు గాలులతో: శుక్రవారం అర్ధరాత్రి, శనివారం వే కువ జామున చెన్నైలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. పది చోట్ల చెట్ల కొమ్మలు నేల కొరిగారుు. ఆవడి, అంబత్తూరు, అన్నానగర్, తిరుముల్‌లైవారుుల్, పుళల్, రెడ్ హిల్స్, మాధవరం, వ్యాసార్పాడి, కీల్పాకం, గిండి, అడయార్, పల్లావరం, తాంబరంలలో భారీగానే వర్షం పడింది.

నీటి రాక...: వర్షాలతో చెన్నైకు తాగు నీరు అందిస్తున్న పుళల్, పూండి, చోళవరం, సెంబరంబాక్కంలకు నీటి రాక పెరిగింది. వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో ఆ పరిసర రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింతగా వర్షాలు పడాలని ఎదురు చూపుల్లో పడ్డారు. ఇక, సముద్ర తీరాల్లో అన్ని చోట్ల కెరటాలు ఎగసి పడుతుంటే, పాంబన్‌లో వెనక్కి తగడం గమనార్హం. ఇక్కడ సముద్రం కాస్త వెనక్కి వెళ్లడంతో ఆందోళన బయలు దేరింది. నీటి రాక...వర్షాలతో చెన్నైకు తాగు నీరు అందిస్తున్న పుళల్, పూండి, చోళవరం, సెంబరంబాక్కంలకు నీటి రాక పెరిగింది. వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో ఆ పరిసర రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింతగా వర్షాలు పడాలని ఎదురు చూపుల్లో పడ్డారు. ఇక, సముద్ర తీరాల్లో అన్ని చోట్ల కెరటాలు ఎగసి పడుతుంటే, పాంబన్‌లో వెనక్కి తగడం గమనార్హం. ఇక్కడ సముద్రం కాస్త వెనక్కి వెళ్లడంతో ఆందోళన బయలు దేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement