ఆర్య కోసం గెస్ట్‌గా నయన | Nayanthara guest roll in aryas cinema | Sakshi
Sakshi News home page

ఆర్య కోసం గెస్ట్‌గా నయన

Published Sat, Jun 27 2015 8:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

ఆర్య కోసం గెస్ట్‌గా నయన

ఆర్య కోసం గెస్ట్‌గా నయన

చెన్నై : నటి నయనతార నటుడు ఆర్య కు మంచి స్నేహితురాలన్న విషయం తెలిసిందే. నయనతార ఏంటి హీరోయిన్లు అందరూ ఆర్యకు స్నేహితురాళ్లే అంటారా’ మీరెలాగైనా అనుకోండి. ఇక్కడ విషయం ఏమిటంటే ఆర్య కో సం నయనతార అతిథి పాత్ర పోషించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అదీ ఆయన ప్రేయసిగా. వివరాల్లోకెళితే అంజూమీనన్ దర్శకత్వం లో మలయాళంలో రూపొందిన చి త్రం బెంగళూర్ డేస్. అక్కడ మంచి విజయాన్ని సాధించిన ఆ చిత్రా న్ని పీవీపీ సినిమా సంస్థ తమిళంలో పునర్‌నిర్మాణం చేస్తోంది. టాలీవుడ్ బొమ్మరిల్లు చిత్రం ఫేమ్ భాస్కర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

మలయాళంలో దుల్కర్‌సల్మాన్, పహత్‌పాజిల్, నివిన్‌బాలీ నటించిన పాత్రల్ని ఆర్య, రాణా, బాబిసింహా, శ్రీదివ్య పోషిస్తున్నారు. పార్వతీమీనన్ పాత్రను ఆమే చేస్తున్నారు. కాగా నిత్యామీనన్ కూడా తన పాత్రను తమిళంలోనూ తనే పోషిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడాపాత్రల్లో ఆర్య కోరిక మేరకు నయనతార పోషించడానికి సిద్ధం అవుతున్నారన్నది కోలీవుడ్ సమాచారం.

విశేషం ఏవిటంటే ఈ చిత్రంలో నయనతార ఆర్యకు లవర్‌గా అతిథి పాత్రలో నటించనున్నారట. ఈ చిత్రానికి మొదట సింగపూర్ డేస్ అనే పేరు ప్రచారంలో ఉంది. ఆ తరువాత ఇదువుం కడందుపోగుం అన్నారు. తాజాగా చిత్రంలోని ప్రధాన పాత్రల పేర్లు అర్జున్, దివ్య, మట్రుం కార్తీక్‌లలోని మొదటి అక్షరాలు తీసుకుని ఏడీఎంకే అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement