ఆ ఖుషీలో ఆంతర్యం అదేనా! | Nayanthara Secret Marriage? | Sakshi
Sakshi News home page

ఆ ఖుషీలో ఆంతర్యం అదేనా!

Published Thu, Apr 23 2015 2:13 AM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

ఆ ఖుషీలో ఆంతర్యం అదేనా! - Sakshi

ఆ ఖుషీలో ఆంతర్యం అదేనా!

 నయనతార గురించి మరోసారి కోలీవుడ్‌లో సంచలనం మొదలైంది. ఈ మలయాళ కుట్టికి ఆత్మస్థైర్యం అధికమేనని చెప్పక తప్పదు. రెండు సార్లు ప్రేమలో ఓడిపోయిన ఆమె నటిగా మాత్రం ఇప్పటి వరకు తన స్థానాన్ని పేరును కోల్పోలేదు. నేటి కీ సూర్య, కార్తీల నుంచి విజయసేతుపతి వరకు ప్రముఖ యువ నటులు అన్న బేధం లేకుండా అందరితోను నటిస్తున్నారు. కార్తీ సరసన త్వరలో కాష్మోరా చిత్రంలో నటించనున్నారు. ఇప్పటికే సూర్యతో మాస్ చిత్రంలో నటిస్తున్నారు.  
 
  షూటింగ్ పూర్తి అవ్వగానే ఎవరితోను మాట్లాడకుండా హోటల్‌కు చెక్కేసే నయనతార ఇప్పుడు చిత్ర సభ్యులతో సరదాగా మాట్లాడుతున్నారట. తన చిత్రాలు సక్సెస్ అయితే అందులో నటించిన ఇతర నటీనటులతో ఎంతో ఖుషీగా గడుపుతున్నారట. ఈ మార్పుకు కారణం ఏమిటి, నయనతార ఆంతర్యం ఏమిటి అన్న ఆరాతీస్తే ఆమె సన్నిహిత వర్గాలు తెలిపిన విషయం అమ్మడు నటి కుష్భు మాదిరిగానే త్వరలో తమిళ నటి కోడలు కానున్నారన్నది. అయితే ఆమెను పెళ్లాడే వ్యక్తి ఎవరన్న ప్రశ్నకు మాత్రం సమాధానం రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement