వైద్యానికి రిక్తహస్తం
బెంగళూరు: రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖతో పాటు వైద్య విద్యశాఖకు సంబంధించి ఈ బడ్జెట్‌లో నూతన సంక్షేమ పథకాలు ఏవీ ప్రకటించలేదు. మౌలిక సదుపాయాల కల్పన, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సిద్ధు ఎక్కువ దృష్టిని సారించారు. మొత్తంగా 2015-16 ఆర్థిక ఏడాదిలో ఈ రెండు శాఖలకు కలిపి రూ.6,107 కోట్ల నిధులను కేటాయించారు. కాగా, ఈ రెండు శాఖల్లో చేపట్టనున్న నూతన కార్యక్రమాలు ఇలా...
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ఈ-హస్పెటల్’ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి రోగుల వివరాలను (హెల్త్ హిస్టరీ)ను డిజిటల్ రూపంలో భద్రపరచడం.రాష్ట్రంలో ఎంపిక చేసిన తాలూకా ఆసుపత్రుల్లో ఇంటెన్సీవ్ కేర్ యూనిట్లతోపాటు వెంటిలేటర్ల ఏర్పాటు.{పభుత్వ ఆసుపత్రుల్లో పేదలందరికీ ఉచిత మందుల వితరణకు వీలుగా నిధుల కేటాయింపు. స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి అంటువ్యాధుల పరీక్షల కోసం బళ్లారి, హుబ్లీ, బాగల్‌కోటే, మైసూరు, మంగళూరు ప్రాంతాల్లో నూతన ల్యాబొరేటరీల ఏర్పాటు.{భూణ హత్యల నివారణలో భాగంగా ప్రైవేటు స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచేందుకు వీలుగా ఇంటర్‌నెట్ ఆధారిత రియల్ టైమ్ డాటా సాఫ్ట్‌వేర్ ద్వారా గర్భిణుల స్కానింగ్ విషయాల కచ్చిత రికార్డు.
తాలూకా, జిల్లా ఆసుపత్రిల్లో అత్యాధునిక ఎక్స్-రే యంత్రాలను నెలకొల్పడం. అంతేకాక నిపుణుల అభిప్రాయలను తీసుకుని ఈ ఎక్స్-రేలను ఉన్నత స్థాయి అధికారులకు టెలీ-రేడియోలజీ ద్వారా పంపనున్నారు.తాలూకా, జిల్లా స్థాయి ఆసుపత్రులను టెలీ-మెడిసిన్ ద్వారా వైద్య విద్యాకళాశాలకు అనుసంధానం చేస్తారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్యం అందించే ఏర్పాటు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంటల్ ల్యాబొరేటరీల ఏర్పాటు
మంగళూరు, గదగ్‌లలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల ఏర్పాటు.రూ.15 కోట్లతో కల్బుర్గీలో నూతన కార్డియాక్ ట్రీట్‌మెంట్ యూనిట్ ఏర్పాటు.మూత్ర పిండ మార్పిడి కోసం రూ.2 కోట్లతో నెఫ్రాలజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరులో నూతన యూనిట్ ఏర్పాటు.