జోక్యం చేసుకోం | not interfere in Kaveri River water says Prakash Javadekar | Sakshi
Sakshi News home page

జోక్యం చేసుకోం

Published Wed, May 27 2015 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

not interfere in Kaveri River water says Prakash Javadekar

 కావేరి జలాల విషయంలో, మేఘదాతు డ్యాంల నిర్మాణంలో కర్ణాటక ప్రయత్నాల వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఇది డెల్టా అన్నదాతల్లో ఆగ్రహం రేపుతోంది.
 
 సాక్షి, చెన్నై : తమిళనాడుకు కావేరి జలాల పంపిణీలో ప్రతి ఏటా కర్ణాటక సర్కారు నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్న విషయం తెలి సిందే. తాజాగా  ఆ నీటిని అడ్డుకునే రీతిలో మేఘదాతులో డ్యాంల నిర్మాణానికి కసరత్తు ల్లో పడింది. దీనిపై రాష్ర్టంలో  ఆగ్రహజ్వాల రగిలింది. ఎట్టకేలకు ప్రతి పక్షాలు ఓ వైపు, అధికార పక్షం మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని జోక్యం చేసుకోవాలని విన్నవించారు. డ్యాంల నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరాయి. ఇందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించి భరోసా ఇచ్చి పంపించారు. ఇంత వరకు బాగానే ఉన్నా మంగళవారం కోయంబత్తూరుకు వచ్చిన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్‌జవదేకర్ చేసిన వ్యాఖ్యలు అన్నదాతల్లో , రైతు సంఘాల్లో, ప్రతి పక్ష పార్టీల్లో ఆగ్రహాన్ని రేపుతున్నది. జోక్యం చేసుకోం: కోయంబత్తూరు పీల మేడులో ఈసా సంస్థ నేతృత్వంలో 43 లక్షల మొక్కల నాటడం లక్ష్యంగా కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు.
 
 ఇప్పటికే 33 శాతం మేరకు మొక్కల్ని నాటి ఉన్నారు. ఈఏడాదికిగాను మొక్కల నాటే కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రకాష్ జవదేక ర్ కావేరి జలాల విషయంలో, మేఘదాతులో డ్యాంల నిర్మాణ విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోబోదని వ్యాఖ్యానించారు. ఈ రెండు సమస్యలు రాష్ట్రాలకు సంబంధించిందని, వారి హక్కుల విషయంలో కేంద్రం వేలు పెట్టే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించడం అన్నదాతల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. రెండు నాల్కల ధోరణితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పయనిస్తున్నట్టుందని విమర్శిస్తున్నారు. ఇక, ప్రతి పక్షాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఉన్నాయి. బాధ్యత గల మంత్రి జోక్యం చేసుకోమని వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు కారణంగా మళ్లీ రాష్ట్రంలో ఆందోళనలు బయలు దేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.
 
 కర్ణాటకకు నోటీసు : ఇదిలా ఉండగా, కావేరి నదిలో మురికి నీరు కలుస్తుండడంపై పర్యావరణ ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. న్యాయవాది సుదన్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారణకు స్వీకరించింది. ఆ నదిలో ఏడాదికి 148 కోట్ల లీటర్ల మురికి కలుస్తున్నదని, కర్ణాటకలోని అనేక సంస్థలు ఆ నదిలోకి మురికి నీటిని వదలి పెడుతున్నాయని తన పిటిషన్‌లో ఆయన వివరించారు. దీనిని పరిశీలించిన చెన్నైలో ట్రిబ్యునల్ కర్ణాటక సర్కారుకు నోటీసులు జారీ చేసింది. జూలై 28లోపు వివరణ ఇవ్వాలని, మురికి నీరు కలుపుతున్న సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఆదేశించింది. అలాగే, తమిళనాడు ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నిస్తూ, మురికి నీటి అడ్డుకట్టకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరిస్తూ పైమ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement