
వివాహం ఆగిపోవడంతో నిరాశలోపెళ్లికూతురు పెద్దలు
జయపురం: బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అవగా హన కార్యక్రమాలు చేపట్టినా బాల్య వివాహా లు తరచూ జరుగుతుండడం శోచనీయం. ప్రధానంగా ఆదివాసీల్లో ఉండే ఈ బాల్యవివా హాల సంప్రదాయం ఇప్పటికీ జరుగుతుండ డం విశేషం. అవిభక్త కొరాపుట్‌లోని ఆదివాసీ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వివాహాలు ఎక్కువగా జరుగుతుండడం అనాది కాలం నుంచి వస్తుండగా, ఈ క్రమంలో అదే ప్రాంతంలో ఆదివారం జరిగిన ఓ బాల్యవివాహాన్ని చైల్డ్‌లైన్ అధికారులు అడ్డుకున్నారు. వివరాలి లా ఉన్నాయి..
జయపురం సబ్‌డివిజన్ పరిధిలోని కుంద్రా సమితిలో ఉన్న లిమ్మా గ్రామంలో బుడి హరిజన్ కొడుకు వివాహం, బొయిపరిగుడ సమితిలోని మఝిగుడ గ్రామస్తురాలితో జరుగుతుందన్న విషయం చైల్డ్‌లైన్ అధికారులు తెలుసుకున్నారు. అనంతరం వారు పోలీసుల సహాయంతో సంఘటన స్థలానికి చేరుకుని, అక్కడ జరుగుతున్న బాల్య వివాహాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మైనర్లకు వివాహం చేసేందుకు సిద్ధపడిన ఇరు కుటుంబాల సభ్యులకు చైల్డ్‌లైన్ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment