
పట్టుబడ్డ సైకో రంగా
మహిళలను వేధిస్తున్న వైనం చితకబాదిన జనం
దొడ్డబళ్లాపురం : మహిళలను నిత్యం వేధిస్తున్న సైకోను స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే... శిరాకు చెందిన రంగా(25),మద్యం, సెల్యూషన్, వైట్‌నర్ లాంటి మ త్తు పదార్థాలకు అలవాటు పడి జులాయిగా తిరిగేవాడు. ఇటీవల మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా ప్రవర్తిం చేవాడు. మహిళలు కనిపిస్తే వారి ముం దుకెళ్లి దుస్తులు విప్పి నిల్చోవడం, నిర్జన ప్రదేశాల్లో వెళుతున్న మహిళలను వెం బడించడం లాంటివి చేస్తూ భయభ్రాం తులకు గురి చేసేవాడు.
ఇతడి చర్యల తో శాంతినగర్‌లో మహిళలు బయటకు కూడా రాలేకపోయారు. మంగళవారం కూడా రంగా మహిళను వేధిస్తూ స్థానికులకు పట్టుబడ్డాడు. అతని చర్యలతో స హనం కోల్పోయి ఉన్న ప్రజలు రంగాను చితకబాది పోలీసులకు అప్పగించారు.