Psycho arrest
-
వాడొక సైకోపాత్.. వాడిదంతా రక్త చరిత్రే!
రక్తపు మడుగులో పడి ఉన్న బాలిక సాయం కోసం చేతులు చాచడం.. ఆ చేతులను రక్తపు మరకలు.. సాయం అందించకపోగా వీడియో తీస్తూ కనిపించిన జనం.. వెరసి యూపీ కన్నౌజ్ ఘటన మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. అయితే ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి.. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నౌజ్‌లోని గుర్సాహైగంజ్ దగ్గర ప్రభుత్వ గెస్ట్ హౌజ్ సమీపంలో ఓ బాలిక నిస్సహాయ స్థితిలో పడి ఉంది. సీసీ ఫుటేజీ ద్వారా ఆమెపై దాడికి పాల్పడింది 22 ఏళ్ల వయసున్న రామ్‌జీ వర్మ గా గుర్తించారు పోలీసులు. అయితే అతనికి గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఫర్రూఖాబాద్ జిల్లా ఖుదాగంజ్కు చెందిన రామ్‌జీ వర్మ.. ఓ సైకోపాత్. మైనర్లు కనిపిస్తే చాలూ.. ఊగిపోతాడు. గతంలో చాలాసార్లు పసిపిల్లలపై దాడులకు యత్నించాడు. అతని మీద అధికారికంగా మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. అందులో ఇద్దరు మైనర్ బాలుర్లను లైంగికంగా వేధించి చంపిన కేసులు ఉన్నాయి. 2018లో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడబోయి దొరికి అరెస్ట్ అయ్యాడు కూడా. కేవలం పదిహేడు రోజుల్లోనే ఈ మూడు ఘాతుకాలకు పాల్పడ్డాడు. ఏడాది తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక తాజా దాడిలో గాయపడ్డ బాలిక.. కాన్పూర్ రెజెన్సీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో సైకో కిల్లర్ అరెస్టు
హైదరాబాద్: ఇద్దరిని హత్యచేసి తప్పించుకుని తిరుగుతున్న సైకో కిల్లర్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. నిందితుడు ఇటీవల.. హబీబ్‌నగర్, నాంపల్లిలో రెండు హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆయా ప్రాంతాలలోని సీసీ ఫుటేజీని జల్లెడ పట్టారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. -
పట్టుబడ్డ సైకో రంగా
మహిళలను వేధిస్తున్న వైనం చితకబాదిన జనం దొడ్డబళ్లాపురం : మహిళలను నిత్యం వేధిస్తున్న సైకోను స్థానికులు పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే... శిరాకు చెందిన రంగా(25),మద్యం, సెల్యూషన్, వైట్నర్ లాంటి మ త్తు పదార్థాలకు అలవాటు పడి జులాయిగా తిరిగేవాడు. ఇటీవల మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యంగా ప్రవర్తిం చేవాడు. మహిళలు కనిపిస్తే వారి ముం దుకెళ్లి దుస్తులు విప్పి నిల్చోవడం, నిర్జన ప్రదేశాల్లో వెళుతున్న మహిళలను వెం బడించడం లాంటివి చేస్తూ భయభ్రాం తులకు గురి చేసేవాడు. ఇతడి చర్యల తో శాంతినగర్‌లో మహిళలు బయటకు కూడా రాలేకపోయారు. మంగళవారం కూడా రంగా మహిళను వేధిస్తూ స్థానికులకు పట్టుబడ్డాడు. అతని చర్యలతో స హనం కోల్పోయి ఉన్న ప్రజలు రంగాను చితకబాది పోలీసులకు అప్పగించారు. -
సైకోకి సంకెళ్లు
విజయవాడ సిటీ : గుంటూరు జిల్లాకు చెందిన పాతికేళ్ల యువకుడు బెంజసర్కిల్, పాతబస్తీ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, ప్రముఖ వస్త్ర దుకాణాలకు వెళుతుంటాడు. అక్కడ ఖరీదైన కుటుంబాలకు చెందిన మహిళలు, యువతుల వద్దకు వెళ్లి తాను పర్సు మరిచిపోయానని, ఒకసారి ఫోన్ ఇస్తే తన సోదరునికి ఫోన్ చేసుకుంటానంటూ చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. కొనుగోళ్ల హడావుడిలో ఉన్న వారు ఇతను అడిగినట్టుగానే మొబైల్ ఇస్తారు. ఆ తర్వాత తన మొబైల్‌కు వారి మొబైల్ నుంచి మిస్డ్‌కాల్ ఇచ్చుకొని తిరిగిచ్చేస్తాడు. ఆ మరుసటి రోజు నుంచి తన సైకో చర్యలు ప్రారంభిస్తాడు. సమయ పాలనతో నిమిత్తం లేకుండా అసభ్యకర పదజాలంతో వారిని వేధింపులకు గురి చేస్తుంటాడు. ఇప్పటి వరకు 15 నుంచి 20 మంది వరకు ఈ తరహా వేధింపులు చేసినట్టు తెలిసింది. వీరిలో ఒక బాధిత కుటుంబం ధైర్యం చేసి విషయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వ్యూహాత్మకంగా ఇతణ్ణి అదుపులోకి తీసుకున్నారు. గతంలో పట్టుకునేందుకు వెళ్లిన వారి నుంచి వివరాలు సేకరించిన టాస్క్‌ఫోర్స్ అధికారులు శనివారం ఉదయం సైకో చెప్పిన ప్రాంతానికి ముందుగానే 20 మంది సిబ్బందిని సాధారణ దుస్తుల్లో పంపారు. అక్కడ వారు ఏదో పనులు చేస్తున్నట్టు నటిస్తూ ఫోన్లు మాట్లాడే వారిని నిశితంగా గమనించసాగారు. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు సైకో నంబరుకు కాల్ చేశారు. ఫోన్ రింగైన వెంటనే చూసుకున్న సైకో ఆన్సర్ చేయకుండా అధికారుల చర్యలను గమనించసాగాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన సిబ్బంది ఫోన్ రింగైన యువకుని వద్దకు వెళ్లి గమనించారు. అధికారులు పదే పదే చేస్తున్నా ఇతను చూసుకోవడం మినహా ఆన్సర్ చేయడం లేదు. సైకో ఇతనేనని నిర్థారించుకొని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా చేసిన నేరాలు అంగీకరించాడు. అరెస్టు చేసి జైలుకు పంపారు. బాధిత కుటుంబాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. -
భక్తులపై దాడి చేసిన సైకో అరెస్ట్
తిరుమల : తిరుమల నడక దారిలో వెళ్తున్న భక్తులపై దాడి చేసిన ఉన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని తిరుపతి క్రైం బ్రాంచ్‌కు విచారణ నిమిత్తం తరలించారు. ఈనెల 19న తమిళనాడుకు చెందిన గోవింద త్యాగరాజన్ దంపతులపై సైకో దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. నిందితుడు దక్షిణామూర్తి తమిళనాడు నాగపట్నం వాసిగా పోలీసులు గుర్తించారు. అతడు మరోసారి అలిపిరి కాలిబాటలో సంచరిస్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తంజావూర్‌కు చెందిన గోవిందరాజస్వామి దంపతులు కాలినడక కొండపైకి బయలుదేరారు. ఆ దంపతులు అక్కగార్ల గుడి సమీపంలోకి రాగానే 25 ఏళ్ల యువకుడు వారిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. గోవిందరాజస్వామి భార్యపై కత్తితో దూసుకువచ్చాడు. ఆ క్రమంలో ఉన్మాదిని ఆమె భర్త గోవిందరాజస్వామి అడ్డుకోబోయాడు. దాంతో ఆగ్రహించిన ఉన్మాది గోవిందరాజస్వామి గొంతు కోశాడు. ఆ తర్వాత అతడి భార్యపై దాడి చేశాడు.ఆ ఘటనలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. -
విద్యార్థిని హత్య చేసిన ప్రేమోన్మాది అరెస్ట్
తొమ్మిదో తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించి, ఆపై కత్తితో దారుణంగా హతమార్చిన ప్రేమోన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. జైపూర్ మండలం ముదిగుంట పంచాయతీ పరిధి కాన్కూర్‌కు చెందిన కొండపెల్లి అనూష(14) హత్య కేసులో నిందితులు బోగె రవి, అతడికి సహకరించిన వైశాక నరేశ్‌ను అరెస్ట్ చేసినట్లు శ్రీరాంపూర్ సీఐ వెంకటేశ్వరబాబు తెలిపారు. జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. కాన్కూర్‌కు చెందిన కొండపెల్లి అనూష ముదిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెకు తల్లి తార, సోదరుడు రాజశేఖర్ ఉన్నారు. అదే గ్రామానికి చెందిన బోగె రవి ఇంటర్ మధ్యలో మానేసి మూడేళ్లుగా జులాయిగా తిరుగుతున్నాడు. గత వేసవిలో తునికాకు కొమ్మ కొట్టే పనులకు వెళ్లిన రవికి అనూషతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ముదిగుంటలోని పాఠశాలకు వెళ్లే సమయంలో రహదారిలో అనూషకు తారసపడుతూ తనను ప్రేమించాలని వేధించేవాడు. కొన్ని నెలల తర్వాత విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు తెలిపింది. స్పందించిన కుటుంబ సభ్యులు, బాలిక మేనమామ శంకర్ కలిసి రవిని మందలించారు. అయినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. 15 రోజుల తర్వాత అనూష ఇంటికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులతో రవి ఘర్షణపడ్డాడు. మైనర్ అయిన తన బిడ్డకు ఇప్పట్లో పెళ్లి చేయబోమని అనూష తల్లి తార, సోదరుడు స్పష్టంచేశారు. దీంతో వారిపై రవి కక్ష గట్టాడు. ఫిబ్రవరి 25న అనూష తల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లడాన్ని గమనించాడు. ఆ సమయంలో ఆరుబయట అనూష తన స్నేహితురాలితో చదువుకుంటుండగా ఇంట్లో ఆమె అన్న రాజశేఖర్ ఉన్నాడు. ఇదే అదనుగా భావించిన రవి తన స్నేహితుడు నరేందర్‌తో కలిసి పథకం రచించాడు. కూల్‌డ్రింక్ తాగుదాం రమ్మంటూ రాజశేఖర్‌ను కిరాణ షాప్‌కు తీసుకెళ్లాలని నరేందర్‌కు చెప్పాడు. ఈ మేరకు అతడు రాజశేఖర్‌ను ఇంట్లో నుంచి తీసుకెళ్లగానే రవి కత్తితో అనూష ఇంటికి వెళ్లాడు. అనూషను ఇంట్లోకి తీసుకెళ్లి విచక్షణారహితంగా పొడిచి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపు మడుగులో పడి ఉండడంతో చనిపోయిందనుకుని ఇంటికి గడియపెట్టి పారిపోయాడు. బయట ఉన్న అనూష స్నేహితురాలు కేకలు వేస్తూ విషయం స్థానికులకు చెప్పింది. కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో ఉన్న అనూషను వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి, అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో అదే రోజు రాత్రి చనిపోయింది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గురువారం మండలంలోని రసూల్‌పల్లి వద్ద రవిని, అతడి స్నేహితుడు నరేందర్‌ను అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి బైక్, హత్యకు వినియోగించిన కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు. వేధిస్తున్న విషయం ముందే పోలీసులకు తెలిపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేదికాదని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై శ్రీలత, శ్రీరాంపూర్ మహిళా పోలీస్టేషన్ ఎస్సై రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.