నూజివీడులో కొండచిలువ కలకలం
Published Wed, Nov 2 2016 12:39 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
నూజివీడు: కృష్ణాజిల్లా నూజివీడు పట్టణం పాతపేటలో భారీ కొండచిలువ కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లోకి బుధవారం తెల్లవారుజామున కొండచిలువ ప్రవేశించింది. 12 అడుగుల కొండచిలువను గుర్తించిన కుటుంబ సభ్యులు భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అప్రమత్తమై కొండచిలువను చంపేశారు.
Advertisement
Advertisement