ఠాణే: విదేశీ బ్యాంక్‌ల్లో దాచి ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్న పార్టీలకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఓటేయ్యాలని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ పిలుపునిచ్చారు. నగరంలో 21వ రాష్ట్రీయ్ కవి సమ్మేళనాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్విస్ బ్యాంక్‌ల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకరావాలని రాజకీ య పార్టీలను డిమాండ్ చేశారన్నారు. దీన్ని ఆయా పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరచుకోవాలన్నారు. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు దేశంలోని పేదలను దోచుకున్న ఆ డబ్బును విదేశీ బ్యాంక్‌ల్లో దాచుకున్నారని, అందుకే వాటిని వెనక్కి తీసుకొచ్చే విషయంలో కేంద్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్నారు. స్విస్ బ్యాంక్‌ల్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఖాతా ఉన్నట్టు వార్తలు వచ్చినా ఇప్పటివరకు ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీపై ఎన్నో అంచనలు ఉండేవని, ఇప్పుడు వారి తీరు తనను ఎంతో నిరాశను కలిగించిందన్నారు. రాజకీయ నాయకుడిగా, న్యాయవాదిగా కంటే పాఠాలు బోధించేందుకు ఇష్టపడతానని వ్యాఖ్యానించారు. ఈ కవి సమ్మేళనానికి విచ్చేసిన ముఖ్య అతిథులు చింతమన్ వంగ, రాజన్ విచారే, సిడ్కో చైర్మన్ ప్రమోద్ హిందూరావ్ చేతుల మీదుగా రాం జెఠ్మలానీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. 19 ఏళ్ల వయస్సులోనే ఎవరెస్టు ఎక్కిన కృష్ణా పాటిల్‌ను చత్రపతి శివాజీ మహారాజ్ గౌరవ్ పురస్కార్‌తో, ప్రముఖ సాహితీవేత్త సూర్యభాను గుప్తాను డాక్టర్ హరివన్సారి బచ్చాన్ సాహిత్య రత్న పురస్కార్, ఎల్‌టీ అభయ్ పరిఖ్‌ను మహారాణ్ ప్రతాప్ శౌర్య పురస్కార్‌తో సన్మానించారు.
నల్లధనం వెనక్కి తెచ్చేవారికే మద్దతు
Published Mon, Jan 27 2014 11:41 PM | Last Updated on Mon, Aug 20 2018 3:46 PM
Advertisement
Advertisement