
అంతా ‘సక్రమం’
బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ)తోపాటు రాష్ట్రంలోని అన్ని మహానగర పాలికె, పురసభ, పట్టణ
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు శ్రీకారం
23 నుంచి ‘అక్రమ-సక్రమ’ దరఖాస్తుల స్వీకారం
రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్‌కుమార్ సూరకె
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ)తోపాటు రాష్ట్రంలోని అన్ని మహానగర పాలికె, పురసభ, పట్టణ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్‌కుమార్ సూరకె తెలిపారు. ఇందుకు ఉద్దేశించిన అక్రమ-సక్రమ పథకం కోసం అక్రమ కట్టడాలను నిర్మించిన వారు ఈ నెల 23 నుంచి ప్రభుత్వానికి దరఖాస్తులను అందజేయవచ్చని మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి వినయ్‌కుమార్ సూరకె వెల్లడించారు. ఈ దరఖాస్తుల స్వీకరణ వచ్చే ఏడాది మార్చి 22 వరకు కొనసాగుతుందని తెలిపారు. అక్రమ-సక్రమలో గృహా లు, వ్యాపార సముదాయాలను చేర్చినట్లు తెలిపారు. ఇక 2013 అక్టోబర్ 19 కంటే ముందు నిర్మించిన కట్టడాలకు, కేవలం 50 శాతం మేర నియమాల ఉల్లంఘన జరిగిన సందర్భంలో మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఇక వాణిజ్య కట్టడాల విషయంలో కేవలం 25 శాతం మేర నియమాల ఉల్లంఘన జరిగి ఉంటేనే క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. పార్క్‌లు, ఆట మైదానాలు, ప్రజా ఉపయోగాల కోసం కేటాయించిన స్థలాలను ఆక్రమించి ఉంటే మాత్రం క్రమబద్ధీకరించబోమని వినయ్‌కుమార్ సూరకె స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఎం తమేర ఆక్రమణకు పాల్పడ్డారనే విషయాన్ని దరఖాస్తులో వెల్లడించాల్సి ఉం టుందని చెప్పారు. 2013 కంటే ముందు ఉన్న నియమ నిబంధనల ప్రకారమే ఆక్రమణదారులకు జరిమానా విధిస్తామని అన్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా జరిమానాల రూపం లో ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో చేరుతాయని భావిస్తున్నట్లు మంత్రి వినయ్‌కుమార్ సూరకె వెల్లడించారు.