Bangalore Mahanagara Palike molecule
-
అంతా ‘సక్రమం’
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు శ్రీకారం 23 నుంచి ‘అక్రమ-సక్రమ’ దరఖాస్తుల స్వీకారం రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్‌కుమార్ సూరకె బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ)తోపాటు రాష్ట్రంలోని అన్ని మహానగర పాలికె, పురసభ, పట్టణ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్‌కుమార్ సూరకె తెలిపారు. ఇందుకు ఉద్దేశించిన అక్రమ-సక్రమ పథకం కోసం అక్రమ కట్టడాలను నిర్మించిన వారు ఈ నెల 23 నుంచి ప్రభుత్వానికి దరఖాస్తులను అందజేయవచ్చని మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి వినయ్‌కుమార్ సూరకె వెల్లడించారు. ఈ దరఖాస్తుల స్వీకరణ వచ్చే ఏడాది మార్చి 22 వరకు కొనసాగుతుందని తెలిపారు. అక్రమ-సక్రమలో గృహా లు, వ్యాపార సముదాయాలను చేర్చినట్లు తెలిపారు. ఇక 2013 అక్టోబర్ 19 కంటే ముందు నిర్మించిన కట్టడాలకు, కేవలం 50 శాతం మేర నియమాల ఉల్లంఘన జరిగిన సందర్భంలో మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇక వాణిజ్య కట్టడాల విషయంలో కేవలం 25 శాతం మేర నియమాల ఉల్లంఘన జరిగి ఉంటేనే క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. పార్క్‌లు, ఆట మైదానాలు, ప్రజా ఉపయోగాల కోసం కేటాయించిన స్థలాలను ఆక్రమించి ఉంటే మాత్రం క్రమబద్ధీకరించబోమని వినయ్‌కుమార్ సూరకె స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఎం తమేర ఆక్రమణకు పాల్పడ్డారనే విషయాన్ని దరఖాస్తులో వెల్లడించాల్సి ఉం టుందని చెప్పారు. 2013 కంటే ముందు ఉన్న నియమ నిబంధనల ప్రకారమే ఆక్రమణదారులకు జరిమానా విధిస్తామని అన్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా జరిమానాల రూపం లో ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో చేరుతాయని భావిస్తున్నట్లు మంత్రి వినయ్‌కుమార్ సూరకె వెల్లడించారు. -
బీబీఎంపీకి షాక్ !
బెంగళూరు(బనశంకరి) : సకాలంలో రూ. 14 లక్షల బిల్లు చెల్లించకపోవడంతో బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) కార్యాలయానికి విద్యుత్ సరఫరాను బెస్కాం అధికారులు బుధవారం నిలిపి వేశారు. దీంతో కంగు తిన్న పాలికె అధికారులు హుటాహుటిన రూ. 12 లక్షలు చెక్కు అందించడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచి పోవడంతో కార్యాలయంలో కంప్యూటర్లు మొరాయించాయి. గతంలో కూడా ఇదే తరహాలు ఫోన్ బిల్లు చెల్లించకపోవడంతో బీఎస్ఎన్ఎల్ అధికారులు ఫోన్ కనెక్షన్‌ను కట్ చేసిన వైనం విదితమే. -
ఇవీ పనులేనా?
బీబీఎంపీలో నాణ్యతరహిత పనులపై సీఎం అసంతృప్తి అధికారులను, ఇంజినీర్లపై సిద్ధు మండిపాటు బెంగళూరు(బనశంకరి) : బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ)లో జరుగుతున్న నాణ్యత లేని పనులు మరెక్కడా లేవని రాష్ర్ట ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పనులు పర్యవేక్షిస్తున్న అధికారులను, ఇంజినీర్లపై ఆయన మండిపడ్డారు. నూతనంగా నిర్మించిన కర్ణాటక ఇంజినీర్ అకాడమి భవనాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖతో పాటు వివిధ శాఖల్లో పథకాల అమలుకు సంబంధించి అంచనాకు మించి ఖర్చులు చూపి ప్రభుత్వానికి, పథకాలకు చెడ్డపేరు తీసుకురావద్దంటూ అధికారులకు హితవు పలికారు. వేస్తున్న రహదారులు మూడు నెలలు కూడా ఉండడం లేదని అసహనం వ్యక్తం చేశారు. రూ. కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితం లేకుండా పోతోందని మండిపడ్డారు. వ్యయం కాస్తా ఎక్కువ అయినా పనుల్లో నాణ్యత ఉండాలని అన్నారు. తాగునీటి పథకాల్లో టెండర్లకు మించి ఇంజినీర్లు రెట్టింపు నిధులు విడుదల చేస్తున్నారని దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇకపై ఇలా జరగరాదని హెచ్చరించారు. సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ప్రస్తుత రోజుల్లో మూఢనమ్మకాలు ఇంకా వీడకపోవడంతో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.