తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ఇళ్లలోకి దూసుకెళ్లింది..
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ఇళ్లలోకి దూసుకెళ్లడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. తిరువణ్ణామలై అనే గ్రామం వద్ద ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.
గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో బస్సు కూడా దెబ్బతిన్నది. ఇళ్లు ధ్వంసంమైంది. తమిళనాడులో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.