
'చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదు'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ నుంచి మన్నవరంలోని భెల్ ప్రాజెక్ట్ మరో రాష్ట్రానికి తరలిపోతున్న చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈ ప్రాజెక్టు శ్రీకాళహస్తిలోనే నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ... ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి చేపట్టిన దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది.
తిరుపతిలో శ్రీనివాసులు రెడ్డి చేపట్టిన దీక్ష స్థలి వద్దకు రోజా, పార్టీ నాయకుడు బియ్యపు మధుసూదన్రెడ్డి చేరుకుని... సంఘీభావం ప్రకటించారు. శ్రీకాళహస్తిలోనే మన్నవరం ప్రాజెక్టు చేపట్టాలని బియ్యపు మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు.