బళ్లారి (తోరణగల్లు), న్యూస్‌లైన్ : మానవ శరీరంలోని వివిధ భాగాలు, అవిపనిచేసే తీరుతెన్నులను విద్యార్థి బృందం వివరించారు. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడిన ఆహార ధాన్యాలను భుజించడం వల్ల కలిగే అనారోగ్య పరిణామాల మరో విద్యార్థి బృందం వివరిస్తోంది. నాడు దేశస్వాతంత్య్రం కోసం ఆంగ్లేయులతో పోరాడి అశువులు బాసిన దృశ్యాలను కళ్లకు కట్టినట్లుగా మరికొంత మంది చిన్నారులు ప్రదర్శించారు. ఇవి నగరంలోని సత్య ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలోని దృశ్యాలు.
ఇటు విద్యార్థులను తల్లిదండ్రులను ఆకట్టుకొంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా అన్ ఎయిడెడ్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు మర్రిస్వామిరెడ్డి, పాఠశాల అధ్యక్షురాలు బి.కె. రాధ ప్రారంభించారు. ప్రదర్శనలో సుమారు 500 మంది విద్యార్థులు 150 ప్రదర్శనలు చేశారు. విద్యార్థులు సందర్శనకు శుక్రవారం కూడా వీలుకల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బి.కె. శ్రీనివాసరావు, కె.శ్రీనివాస్, మాధవరాజ్, ఐషా, విద్యార్థులు పాల్గొన్నారు.
వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల ప్రతిభ
Published Fri, Jan 31 2014 3:55 AM | Last Updated on Sat, Sep 15 2018 7:34 PM
Advertisement
Advertisement