- హెచ్.డీ కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్-2011 పోస్టుల రద్దుపై బహిరంగ చర్చకు సిద్ధరామయ్య వెనుకడుగు వేస్తుండడం పలు అనుమానాలకు దారితీస్తోందని హెచ్.డి.కుమారస్వామి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఫ్రీడం పార్క్‌లో చేపట్టిన నిరశన దీక్ష ఆదివారం కూడా కొనసాగింది. ఆందోళనకు ఆది నుంచి మద్దతు తెలుపుతున్న కుమారస్వామి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ... ఈ విషయంపై తొలుత బహిరంగ చర్చకు సిద్ధమని పేర్కొన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం మాట మారుస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా కేపీఎస్‌సీ-11 నియామకాల రద్దుపై పది ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను సీఎం సిద్ధరామయ్యకు ఆయన రాశారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రులు దినేష్ గుండూరావు, హెచ్.ఆంజనేయులు సమర్థించారు. అక్రమాలను అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు.