న్యూఢిల్లీ: గురుగోవింద్‌సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం (జీజీఎస్‌ఐపీయూ) తూర్పు ఢిల్లీ ప్రాంగణ నిర్మాణ పనులకు కేంద్ర మానవ వ నరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆదివారం శంకుస్థాపన చేశారు. సూరజ్‌మహల్ ప్రాంతంలో నిర్మించతలపెట్టినఈ ప్రాంగణంలో అత్యాధునిక వసతులను కల్పించనున్నారు. ఇందుకోసం రూ. 285 కోట్లమేర నిధులను కేటాయించారు. అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ ఈ ప్రాంగణం డిజైన్‌ను రూపొందించింది. ఈ ప్రాంగ ణంలో విద్యార్థినులు, విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లను నిర్మించనున్నారు. మొత్తం 600 మంది విద్యార్థులకు హాస్టల్ వసతి లభించనుంది.
గురుగోవింద్‌సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం (జీజీఎస్‌ఐపీయూ) నగరంలో నిర్మిస్తున్న తొలి ప్రాంగణమిదే. తూర్పుఢిల్లీ ఇప్పటికే అనేక విద్యాసంస్థలకు ఆలవాలంగా మారిపోయింది. ఈ సందర్భంగా కేంద్ర మానవ వ నరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ గురుగోవింద్‌సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం (జీజీఎస్‌ఐపీయూ), తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎంసీ)కి మధ్య ఓ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఈ ప్రాంగణంలో చదువుకునే విద్యార్థులు మూడో సంవత్సరంలో ఈడీఎంసీతో కలిసి తమకు అప్పగించిన ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు.
ప్రాంగణ నిర్మాణానికి ఇరానీ శంకుస్థాపన
Published Sun, Dec 14 2014 10:07 PM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM
Advertisement
Advertisement