ఎం.ఎస్.విశ్వనాథన్‌కు తీవ్ర అస్వస్థత
చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్(88) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా శ్వాస సంబంధ వ్యాధి, వృద్ధాప్యం వల్ల ఆరోగ్యం క్షీణించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 750 సినిమాలకు సంగీతం అందించిన ఎం.ఎస్. దక్షిణాది సినీరంగంలో గొప్ప సంగీత దర్శకుడుగా ఓ వెలుగు వెలిగారు. ‘ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఎం.ఎస్. త్వరగానే కోలుకున్నారు. ఇంటికి తిరిగి వెళతారని అనుకున్నాం. కానీ మంగళవారం ఆరోగ్యం క్షీణించింది.
వెంటనే ఐసీయూకి తరలించి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు’ అని ఎం.ఎస్. బంధువులు బుధవారం మీడియాకు తెలిపారు. 1952లో సినీ రంగంలోకి ప్రవేశించిన ఎం.ఎస్. విశ్వనాథన్ తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనేక హిట్ చిత్రాలకు సంగీతం అందించారు.