Serious illness
-
సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత
-
Russia Ukraine War: పుతిన్‌కు క్యాన్సర్?!
రష్యా అధినేత పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని మీడియా ప్రాజెక్ట్ సంస్థ ‘ఇన్వెస్టిగేషన్ ఆన్ వ్లాదిమిర్ పుతిన్ హెల్త్’ పేరిట విడుదల చేసిన ఒక కథనంలో అనుమానం వ్యక్తం చేసింది. రష్యా ప్రజల నుంచి ఆయన తన అనారోగ్యాన్ని దాచిపెడుతున్నారని, ఇందుకోసమే ఉక్రెయిన్‌పై దాడికి దిగారని గతంలో వచ్చిన ఆరోపణలకు తాజా కథనం బలం చేకూరుస్తోంది. ఈ మీడియా ప్రాజెక్ట్ (మీడియా ప్రొకెట్ అంటారు) సంస్థను రష్యాలో నిషేధించారు. దీంతో సంస్థ విదేశాల నుంచి కార్యకలాపాలు నడుపుతోంది. పుతిన్ స్టెరాయిడ్ వాడకంలో ఉన్నారని, అందుకే ఆయన మెడ, ముఖం వాచినట్లున్నాయని కథనంలో పేర్కొంది. పుతిన్‌తో ఎప్పుడూ ఉండే కొందరు డాక్టర్ల గురించి కథనంలో ప్రస్తావించారు. వీరిలో ఒకరు థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టు కాగా మరొకరు న్యూరో సర్జన్. పుతిన్ 2020 జూలైలో నేషనల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఎండోక్రైనాలజీ అధిపతి ఇవాన్ దెదోవ్ను కలిసారని కథనం తెలిపింది. పుతిన్ పెద్ద కూతురు ఇక్కడే పనిచేస్తారు. ఈ సమావేశంలో థైరాయిడ్ క్యాన్సర్, లక్షణాలు, దానికి కనిపెట్టిన టైరోజిన్ అనే ఔషధం తదితర వివరాలను పుతిన్‌కు ఇవాన్ వివరించారని కథనం పేర్కొంది. కొత్త ఔషధం వల్ల రికవరీ ఎంత వరకు ఉండొచ్చని పుతిన్ ప్రశ్నించారని తెలిపింది. అప్పుడే పుతిన్ ఆరోగ్యంపై చర్చలు మొదలయ్యాయని తెలిపింది. కరోనా సమయంలో పుతిన్ చాలా రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నారని, ఆ సమయంలో థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టు ఆయనతో ఎప్పుడూ ఉండేవారని పేర్కొంది. తర్వాత రోజుల్లో ఆయన జనాలతో చాలా దూరం నుంచి మాట్లాడేవారని గుర్తు చేసింది. 2016 నుంచే? పుతిన్ అనారోగ్య సమస్యలు 2016–17 నుంచే సీరియస్‌గా మారాయని కథనం పేర్కొంది. ఆ సమయంలో ఆయనకు డిమిట్రీ వెర్బోవోయ్ అనే డాక్టరు చికిత్స చేశారు. సోచీలోని ఒక రిసార్టులో పుతిన్ ఎక్కువగా గడుపుతుంటారు. ఇక్కడ ఆయన చుట్టూ ఎప్పుడూ కనీసం 5– 17మంది డాక్టర్లుండేవారని తెలిపింది. అనారోగ్య కారణాలతో పుతిన్ సడెన్‌గా మాయమవడం ఐదుసార్లు జరిగిందని గుర్తు చేసింది. ఆయనకు చికిత్సనందించినందుకు కృతజ్ఞతగానే ఓలెగ్ మిస్కిన్ అనే వైద్యుడికి పుతిన్ డాక్టర్ ఆఫ్ రష్యా అవార్డిచ్చారని తెలిపింది. థైరాయిడ్ ప్రాంతంలో వాపు, మాట బొంగురుగా రావడం, మింగడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి, పొడిదగ్గు తదితరాలుంటే థైరాయిడ్ క్యాన్సర్‌గా అనుమానిస్తారు. పుతిన్‌కు ఈ సమస్యలున్నాయని, అందుకే డాక్టర్ అలెక్సీ షెగ్లోవ్ అనే స్పెషలిస్టు పుతిన్‌తో 282 రోజుల పాటు కలిసిఉన్నారని కథనం తెలిపింది. ఆయనతో పాటు ఇగోర్ ఇసకోవ్ అనే స్పెషలిస్టు 152 రోజులు, క్యాన్సర్ సర్జన్ సెలివనోవ్ 166 రోజుల పాటు పుతిన్‌తో గడిపారని తెలిపింది. అయితే వీరు ఏ సమయంలో పుతిన్‌తో కలిసిఉన్న విషయం కథనంలో వెల్లడించలేదు. ఎంతవరకు నిజం? గతంలో కూడా పుతిన్ ఆరోగ్యంపై పలు కథనాలు వచ్చాయి. వచ్చే అక్టోబర్‌కు ఆయనకు 70 సంవత్సరాలు వస్తాయి. కేవలం వయసు కారణంగా వచ్చే సమస్యలు తప్ప ఆయనకు మరీ తీవ్రమైన అనారోగ్యాలు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాశ్చాత్య ప్రభుత్వాలు కావాలని ఇలాంటి కథనాలు వ్యాప్తిచేస్తుంటాయని రష్యా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయనకు మానసిక సమస్యలున్నాయంటూ జపాన్‌కు చెందిన రిస్క్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్ సంస్థ ఒక కథనం వెలిబుచ్చింది. ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ ముదిరిపోయిందన్న కథనం కూడా ఇలాంటి కల్పిత కథేనని కొందరు నిపుణుల భావన. రష్యా లాంటి దేశంలో అధికారికంగా ప్రకటించేవరకు ఏ సంగతి తెలియదని వీరు గుర్తు చేస్తున్నారు. ఐదుసార్లు గాయబ్! గతంలో అనారోగ్య కారణాలతో పుతిన్ అకస్మాత్తుగా కొన్ని రోజులపాటు కనిపించకుండా పోయిన ఘటనలివే.. 1. 2012 నవంబర్: వ్యాపార యాత్రలు, దూర ప్రయాణాలను పుతిన్ రద్దు చేసుకున్నారు. ఆయన యథావిధిగా విధులు నిర్వహిస్తున్నట్లు చూపడానికి పాత వీడియోలను కొన్నాళ్లు క్రెమ్లిన్ ప్రసారం చేసేది. 2. 2015 మార్చి: ప్రజలకు దూరంగా కొన్నాళ్లు కనిపించలేదు. ఆయన పాల్గొనాల్సిన సమావేశాలు రద్దయినా గత వీడియోలను చూపి సదరు సమావేశాలు జరిగినట్లు మేనేజ్ చేశారు. 3. 2017 ఆగస్టు: సోచీ రిసార్టుకు వెళ్లిన పుతిన్ వారం పాటు కనిపించలేదు. 4. 2018 ఫిబ్రవరి: ఎన్నికల ప్రచారం మధ్యలో అకస్మాత్తుగా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొన్నారు. ఆయనకు జలుబు చేసినందున విశ్రాంతికి వెళ్లారని అధికారులు చెప్పారు. 5. 2021 సెప్టెంబర్: సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. అన్ని కార్యక్రమాలకు వీడియో ద్వారా హాజరయ్యారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
బొడ్రాయి తెచ్చిన తంటా
♦ వడదెబ్బతో యువకుడి మృతి ♦ బోనాలయ్యే వరకు మృతదేహాన్ని తేవొద్దన్న గ్రామస్తులు ♦ ఆస్పత్రిలో మృతదేహంతో 14 గంటలు బంధువుల నిరీక్షణ నల్లగొండ టౌన్: బొడ్రాయి పండుగ తెచ్చిన తంటా ఇంతా అంతా కాదు.. అనారోగ్యంతో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బోనాలు పూర్తయ్యే వరకు గ్రామానికి తీసుకురావద్దని స్థానికులు చెప్పడంతో ఓ కుటుంబం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద సుమారు 14 గంటలు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కల్వలపల్లికి చెందిన ఉప్పర శంకరయ్య గురువారం బొడ్రాయి పండుగ పనుల కోసం ఎండలో తిరి గాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చనిపోయాడు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకురావొద్దని గ్రామస్తులు హుకుం జారీ చేశారు. బొడ్రాయి పండుగను నిర్వహిస్తున్నందున ఇతర గ్రామస్తులు గ్రామానికి రారని, తమ గ్రామస్తులు కూడా గ్రామం విడిచి వెళ్లవద్దని సూచించారు. దీంతో మృతుడిని కడసారి చూసేందుకు అతడి తల్లి కూడా బయటకు రాలేని స్థితి ఏర్పడింది. మరోవైపు మృతదేహాన్ని వార్డులో ఉంచే అవకాశం లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది మార్చురీ ఆవరణలో ఉంచారు. మృతుడి కుటుంబ సభ్యులు గురు వారం అర్ధరాత్రి నుంచి మార్చురీ వద్ద రోదిస్తూ గ్రామస్తుల అనుమతి కోసం వేచి చూశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు పండుగ పూర్తయిందని గ్రామస్తులు చెప్పడంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో గ్రామానికి తీసుకెళ్లారు. కాగా మృతుడి సోదరి సునీత మాట్లాడుతూ ‘అన్న శంకరయ్య అర్ధరాత్రి చనిపోతే పండుగ ఉందని గ్రామానికి తీసుకురావద్దని చెప్పారు. అనారోగ్యంగా ఉన్న అమ్మ ముత్తమ్మను ఆస్పత్రికి వెళ్లొద్దన్నారు. మానసికంగా నలిగిపోయిన ఆమెకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత ’ అని ప్రశ్నించారు. -
మైల్వార్‌లో మాయరోగం..!
నిల్చున్న చోటే కిందపడిపోతున్న గ్రామస్తులు బషీరాబాద్: ఓ గ్రామంలో ఒక్కరోజు వ్యవధిలోనే పదిమందికి పైగా అకస్మాత్తుగా కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దానం బస్వరాజ్, కుర్వ నరేశ్, కుమ్మరి రాములు, కందనెల్లి అంజిలమ్మ, యాదప్ప, గర్దన్ భీమప్పలతోపాటు మరో ఏడుగురు శనివారం నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బస్వరాజ్ సోమవారం బాగానే ఉన్నాడు. స్థానికులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కిందపడి పోయాడు. దీంతో ఆయన నోట్లో నుంచి మూడు పళ్లు రాలిపోయాయి. ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు అస్వస్థతకు గురై మంచంపట్టారు. సోమవారం గ్రామానికి వచ్చిన ఏఎన్ఎంకు స్థానికులు ఈ విషయం తెలిపారు. వైద్యులకు సమాచారం ఇస్తేనే వైద్యం చేస్తామని ఆమె చెప్పారు. కల్తీ కల్లేనా..? కాగా, ఈ గ్రామంలో విక్రయిస్తున్న కల్లు తాగి కొందరు మూర్ఛ వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దయ్యం పడుతోందని కొందరు, చేతబడి అని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10 గంటలు దాటితే జనం ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామని సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. -
ఆ.. మహిళ గుర్తింపు!
భవానీపురంలో ఉన్నట్లు నిర్ధారణ అనారోగ్యంతో ఉండటంతో నేడు విచారించే అవకాశం విజయవాడ : కడుపునొప్పి అని చెప్పి ప్రభుత్వాస్పత్రికి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా ప్రసవించి శిశువును కమోడ్‌లో కుక్కిన మహిళ ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఈ విషయమై ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ మాచవరం పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా, వారు 108లో ఎక్కిన సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆ మహిళ భవానీపురంలోని తమ ఇంట్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు పోలీసులు చెపుతున్నారు. గర్భిణిగా ఉండి పురిటినొప్పులు వస్తుంటే కడుపు నొప్పి అని చెప్పటం.. గుట్టుచప్పుడు కాకుండా టాయిలెట్స్‌లో ప్రసవించటం.. తర్వాత శిశువును కమోడ్‌లో కుక్కడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతేగాక 108కి వారు ఫోన్ చేసిన నంబరుకు ఆస్పత్రి అధికారులు చేయగా, తొలుత ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి తాను గ ర్భిణి సోదరుడినని, అసలు ఆమె గర్భిణి అన్న సంగతే తెలియదని చెప్పడం పలు సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఉండటంతో శుక్రవారం పోలీసులు పూర్తి వివరాలు సేకరించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. శిశువుకు 32 వారాలు! మృత శిశువు వయస్సు సుమారు 32 నుంచి 34 వారాలు ఉండవచ్చని వైద్యులు అంచనాకు వచ్చారు. అంటే గర్భిణి ఎనిమిది నెలలు నిండి తొమ్మిదో నెలలో ప్రవేశించిందని, అంటే ప్రసవించే సమయమేనని నిపుణులు చెపుతున్నారు. పురిటి నొప్పులు వస్తుంటే, మరి కడుపు నొప్పి అని ఎందుకు చెప్పారో అర్థం కాని పరిస్థితి. వారిని ఆస్పత్రికి తీసుకువచ్చిన 108 వాహనం టెక్నీషియన్ ఇదే విషయం చెపుతున్నారు. రక్తస్రావం అని చెప్పినా, గర్భిణి అని చెప్పినా పాత ఆస్పత్రికే తీసుకెళ్లేవారమని, కడుపునొప్పి అనడంతోనే క్యాజువాలిటీకి తీసుకువచ్చినట్లు పేర్కొంటున్నారు. అన్నీ అనుమానాలే... గుట్టు చప్పుడు కాకుండా ప్రసవించడంతో పాటు, శిశువును కమోట్లో కుక్కేసిన ఘటనపై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అవాంఛిత గర్భం దాల్చిన వారైతేనే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటారని నిపుణులు అంటున్నారు. ఆడపిల్ల అని అలా చేశారనుకోవడానికి అసలు పురిటి నొప్పులని వారు చెప్పకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే పోలీసులు కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. అయితే శుక్రవారం అన్ని విషయాలు చెపుతామని వారు పేర్కొన్నారు. -
ఎం.ఎస్.విశ్వనాథన్‌కు తీవ్ర అస్వస్థత
చెన్నై: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్(88) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా శ్వాస సంబంధ వ్యాధి, వృద్ధాప్యం వల్ల ఆరోగ్యం క్షీణించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 750 సినిమాలకు సంగీతం అందించిన ఎం.ఎస్. దక్షిణాది సినీరంగంలో గొప్ప సంగీత దర్శకుడుగా ఓ వెలుగు వెలిగారు. ‘ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఎం.ఎస్. త్వరగానే కోలుకున్నారు. ఇంటికి తిరిగి వెళతారని అనుకున్నాం. కానీ మంగళవారం ఆరోగ్యం క్షీణించింది. వెంటనే ఐసీయూకి తరలించి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు’ అని ఎం.ఎస్. బంధువులు బుధవారం మీడియాకు తెలిపారు. 1952లో సినీ రంగంలోకి ప్రవేశించిన ఎం.ఎస్. విశ్వనాథన్ తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనేక హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. -
కోమాలో జశ్వంత్
కోమాలో జశ్వంత్ కాలుజారి పడటంతో తలకు తీవ్రగాయం న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, కృత్రిమ శ్వాసను అందిస్తున్నారని రక్ష ణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సమాచారం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ జస్వంత్ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు