ముంబై : ఓ మహిళ కిడ్నీ నుంచి దాని కంటే 50 రెట్లు పెద్దగా ఉన్న కణితిని భారత డాక్టర్లు విజయవంతంగా తొలగించారు. మంజూ దేవీ(28) గత మూడేళ్లుగా కిడ్నీ వద్ద కణితితో బాధపడుతున్నారు. భారీ పరిమాణంలో పెరిగిన కణితి మిగిలిన శరీర భాగాల పనితీరుకు అడ్డు వస్తుండటంతో దాన్ని తొలగించాలని లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రి డాక్టర్లు నిర్ణయించారు.
దాదాపు ఎనిమిది గంటల పాటు సర్జరీ నిర్వహించి 5.5 కేజీల కణితిని తొలగించారు. కిడ్నీకి ఏర్పడిన కణితిల్లో ప్రపంచంలో ఇదే అతి పెద్దదని చెప్పారు. ఆపరేషన్ క్లిష్టతరం అవుతుందనే ఉద్దేశంతో ఇప్పటివరకూ మంజూ దేవీ డాక్టర్లు సర్జరీ చేసేందుకు వెనుకాడారని వైద్యులు పేర్కొన్నారు. మేజర్ సర్జరీ కావడంతో అన్ని ప్రికాషన్స్ తీసుకున్న అనంతరమే శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment