ఓనర్‌కు షాక్.. రెండుకిలోల గోల్డ్‌తో జంప్
చెన్నై: బంగారు కడ్డీలను కరిగించుకొని రమ్మని తన షాపులో పనిచేస్తున్న యువకుడికి రెండు కిలోల బంగారు కడ్డీలు ఇవ్వగా అతడు వాటితో ఉడాయించిన సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. అయితే, ఎట్టకేలకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతడితోపాటు ఉన్న మరో యువకుడికోసం గాలిస్తున్నారు. చెన్నైలోని కొడుంగైయూరు ఎరుకంజేరిలో ప్రదీప్ కుమార్ (38) అనే వ్యక్తి నగల వర్కుషాపు నిర్వహిస్తున్నాడు. ఆయన షాపులో బీహార్‌కు చెందిన రాహుల్‌రాయ్(26) అనే బిహార్‌కు చెందిన యువకుడితో సహా 10 మంది పనిచేస్తున్నారు.
ప్రదీప్‌కుమార్, వాషర్‌మెన్‌పేటలోగల నగల దుకాణంలో బంగారు కడ్డీలను మొత్తంగా అర్డర్ తీసుకుని నగలను తయారు చేసి ఇస్తుంటాడు. దీని ప్రకారం గత మే నెల 20న రాహుల్ రాయ్‌కు ప్రదీప్‌కుమార్ రెండు కిలోల బంగారు కడ్డీలను ఇచ్చి వాషర్‌మెన్‌పేట ఎన్‌ఎస్‌సి బోస్ రోడ్‌లోగల పెద్ద వర్కుషాపులో కరగదీసుకుని రమ్మని పంపించాడు. దీంతో రెండు కిలోల బంగారు కడ్డీలతో వెళ్లిన రాహుల్‌రాయ్ తిరిగిరాలేదు. పలు చోట్ల గాలించిన అతడి ఆచూకీ లభించకపోవడంతో ఎలిఫెంట్‌గేట్ పోలీసు స్టేషన్‌లో ప్రదీప్‌కుమార్ ఫిర్యాదు చేశాడు.
విచారణ జరిపిన పోలీసులకు రాహుల్‌రాయ్ అతని స్నేహితుడు సంతోష్‌కుమార్ కలిసి బంగారంతో పరారైనట్టు తేలింది. దీంతో వారిని పట్టుకునేందుకు ఇన్‌స్పెక్టర్ జూలియర్ సీజర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటయింది. ఈ టీం పోలీసులు నేపాల్ వెళ్లి అక్కడ రాహుల్‌రాయ్‌ను అరెస్టు చేశారు. అతని నుంచి ఒక కిలో 400 గ్రాముల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌కుమార్ ముంబైలో ఉన్నట్లు తెలియడంతో పోలీసులు ముంబైకు బయలుదేరారు.