బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో ప్రభుత్వరంగ సంస్థలలో దాదాపు 10 లక్షల మంది కొలువు తీరారని ప్రభుత్వరంగ తెలుగు ఉద్యోగుల సమన్వయ సమితి (పీఆర్‌టీయుఎస్‌ఎస్) అధ్యక్షుడు ఎల్. నాగేశ్వరావు అన్నారు.
బెంగళూరు, న్యూస్‌లైన్ : బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలో ప్రభుత్వరంగ సంస్థలలో దాదాపు 10 లక్షల మంది కొలువు తీరారని ప్రభుత్వరంగ తెలుగు ఉద్యోగుల సమన్వయ సమితి (పీఆర్‌టీయుఎస్‌ఎస్) అధ్యక్షుడు ఎల్. నాగేశ్వరావు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వరంగాలకు చెందిన హెచ్‌ఏఎల్, బీఈఎల్, ఐటీఐ, బీఈఎంఎల్, హెచ్‌ఎంటీ, బీహెచ్‌ఈఎల్, ప్రభుత్వ రంగాల జాతీయ బ్యాంకులు, బీఎస్‌ఎన్‌ఎల్, రైల్వే, తపాల, ఇస్రో, డిఫెన్స్, ఎన్‌ఏఎల్, డీఆర్‌డీఓ, ఎల్‌ఐసీ, బీజీఎమ్‌ఎల్‌తో సహ పలు శాఖలలో పని చేస్తున్న తెలుగు వారి ఐక్యత కోసం ఈ సమితి ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
పైన తెలిసిన పలు సంస్థలలో పని చేస్తున్న వారితో కమిటీ వేసి పీఆర్‌టీయుఎస్‌ఎస్ ఏర్పాటు చేశామని అన్నారు. తెలుగువారు, తెలుగు భాష మాట్లాడేవారి కోసం ఈ సమితి ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటికే ఈ సమితిలో 600 మంది సభ్యులు చేరారని గుర్తు చేశారు. వేల సంఖ్యలో సభ్యత్వం న మోదు చేసి తెలుగు భాష, తెలుగు జాతిని కాపాడటానికి కృషి చేస్తామని వివరించారు. ఒక విద్యా సంస్థను స్థాపించి తక్కువ ఖర్చుతో చదువులు చెప్పిస్తామని అన్నారు.
సీఈటీ పరీక్షలతో సహ వివిధ ఉద్యోగాలు సంపాదించడానికి బెంగళూరు వచ్చే ఆంధ్రులకు సహాయం చెయ్యడానికి 247 హెల్పెలైన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. నగరంలోని వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల వివరాలు సేకరించి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి చికిత్స చేయించుకోవడానికి వచ్చే వారికి పూర్తి వివరాలు అందిస్తామని చెప్పారు. ఉపాధికోసం బెంగళూరు వచ్చే తెలుగువారి కోసం ఉచిత భోజనం, వసతి కల్పించడానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు నాగేశ్వరరావు తెలిపారు.
ఫిబ్రవరి 9న ఆది వారం ఇక్కడి జ్ఞానజ్యోతి ఆడిటోరియంలో పీ ఆర్‌టీయుఎస్‌ఎస్ మొదటి సమావేశం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రు లు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన మంత్రులు, నా యకులు, వివిధ రంగాలలో ఉన్న అధికారులు పాల్గొంటారని వివ రించారు. 9వ తేది ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గం టల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
ఈ సమితి అభివృద్ధి చెందడానికి కర్ణాటకలోని తెలుగు వారు సహకరించాలని ఎల్. నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. పీఆర్‌టీయుఎస్‌ఎస్ మహిళ కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ... ప్రభుత్వరంగ సంస్థలలో పని చేస్తున్న మహిళ ఉద్యోగులు ఈ సమితిలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్‌బీఐ సిద్దం నారయ్య, హెచ్‌ఏఎల్ బుజ్జిబాబు మాట్లాడారు.