అజిత్‌తో హ్యాట్రిక్‌కు నయనతార
వరుసగా ఒకే కాంబినేషన్లో వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించడం సాధ్యమా? అన్నది ప్రశ్నార్థకమే. అయితే ఆ దిశగా ఒక యూనిట్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు విజయాలను సొంతం చేసుకున్నా ఆ క్రేజీ కాంబినేషన్ నటుడు అజిత్, నటి నయనతార దర్శకుడు విష్ణువర్ధన్లదే. వీరి కలయికలో తొలుత భిల్లా వంటి సంచలన చిత్రం వచ్చింది. ఆ తరువాత ఆరంభం అలరించింది.
దీంతో హ్యాట్రిక్‌కు ప్రయత్నం మొదలైందన్నది తాజా సమాచారం. అజిత్ ఎన్నై అరిందాల్ చిత్రం తరువాత వీరం ఫేమ్ శివ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో క్రేజీ నటి శ్రుతిహాసన్ నాయకి అనే ప్రచారం జరుగుతోంది. దీన్ని ఆరంభం, ఎన్నై అరిందాల్ చిత్రాల నిర్మాత ఏఎం రత్నంనే నిర్మించనున్నారని సమాచారం. తదుపరి చిత్రానికి కూడా అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అందాల తార నయనతార నాయికగా నటించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల మాట. అదే విధంగా ఈ భారీ చిత్రాన్ని ఐయంగరన్ సంస్థ గానీ విజయ ప్రొడక్షన్ సంస్థగాని నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం.