ముస్లిం రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా పోరాటం
బీజేపీ శాసనసభాపక్షనేత జి.కిషన్‌రెడ్డి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తే.. దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌లో జరిగిన బీజేపీ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు గతంలో ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను హైకోర్టు రెండుసార్లు కొట్టివేసిందని గుర్తుచేశారు. కులాలు, మతాల పేరుతో విభజించాలని చూస్తే బీజేపీ చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు.
ముస్లింల కోసం రిజర్వే షన్ కల్పించాలంటే పార్లమెంట్‌లో చట్టం చేయాలని వివరించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యంగ వ్యతిరేకమన్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వం చేయాలని చూస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వపాలన ప్రకటనలకే పరి మితమైందన్నారు. రాష్ట్రంలో రూపాయికి కిలోబియ్యం కేంద్రప్రభుత్వం ఇస్తున్నదనీ, రాష్ట్రం ఇస్తున్నదేమీ లేదని ఆయన మండిపడ్డారు.