పోలీసులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి | The Super Specialty Hospital | Sakshi
Sakshi News home page

పోలీసులకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి

Published Sun, Jun 29 2014 2:21 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM

The Super Specialty Hospital

సాక్షి, బెంగళూరు : పోలీసు సిబ్బందికి అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించడానికి వీలుగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నామని హోం మంత్రి కే.జే జార్జ్ వెల్లడించారు. బెంగళూరులో మీడియాతో ఆయన శనివారం మాట్లాడారు. నిత్యం ఒత్తిడితో పనిచేసే పోలీసులకు ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.

దీంతో అత్యాధునిక ఆస్పత్రిని నిర్మించనున్నామన్నారు. అదేవిధంగా వారి పిలలకు వైద్య విద్యను అందించడానికి వీలుగా ప్రత్యేక వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు. రాష్ట్ర పోలీసుశాఖ సిబ్బంది కొరతతో సతమతమవుతున్న మాట వాస్తవమని రెండు మూడేళ్లల్లో సమస్య దాదాపుగా పరిష్కారమవుతుందని జార్జ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement