సాక్షి, న్యూఢిల్లీ: జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే.. ఆ జన్మకు సార్థకత కల్పించేది మాత్రం ఉపాధ్యాయులే. అటువంటి గురువులను పూజించడం, సన్మానించడం కోసం జరుపుకునే వేడుకే ఉపాధ్యాయ దినోత్సవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని జరుపుకునే ఈ వేడుక కోసం న గరంలోని అన్ని పాఠశాలలు సిద్ధమయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో గురువులను అలరించేందుకు చిన్నారులు ఇంకారిహార్సల్స్ చేస్తూనే ఉన్నారు.
ప్రధాని ప్రసంగం కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసా రం చేసేందుకు నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఇందుకోసం కొన్ని పాఠశాలలు పని వేళల్లో మార్పులుచేశాయి. విద్యార్థుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. సాధారణంగా యేటా టీచర్స్ డే సందర్భంగా ఏర్పాటుచేసే కార్యక్రమాలను కూడా కొన్ని స్కూళ్లు రద్దుచేసుకున్నాయి. అన్ని తరగతుల విద్యార్థుల కోసం రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయలేని పాఠశాలలు పై తరగతి విద్యార్థులకు మాత్రమే ప్రధానమంత్రి ప్రసంగ ప్రత్యక్ష ప్రసారం చూపించి, కింది తరగతి విద్యార్థులకు మరుసటి రోజు చూపించాలని నిర్ణయించాయి.
పదో తరగతి, ఆపై క్లాసుల విద్యార్థులకు శుక్రవారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ప్రధాని మోడీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని చూపిస్తామని, ప్రసంగాన్ని రికార్డింగ్ చేసి కింది తరగతుల విద్యార్థులకు శనివారం చూపుతామని ధౌలాకువాలోని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతిబోస్ చెప్పారు. అన్ని తరగతుల విద్యార్థులకు శుక్రవారం రవాణా సదుపాయాలను ఏర్పాటు చేయలేకపోయినందువల్ల రెండ్రోజులు ప్రసంగం చూపించే ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు. సాధారణంగా నిర్వహించే టీచర్స్ డే కార్యక్రమాలను కూడా రద్దు చేసినట్లు ఆమె తెలిపారు. పాఠశాల పనివేళలను మధ్యాహ్నం ఒంటి గంటనుంచి సాయంత్రం ఐదున్నర గంటలకు మార్చినట్లు లక్ష్మణ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఐదో తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు ప్రధానమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని చూపుతామని, ఇందుకోసం 12 తరగతి గదుల్లో ఏర్పాట్లు చేశామని ప్రిన్సిపల్ ఉషారామ్ చెప్పారు. టీచర్స్ డే వేడుకలను శనివారం జరుపుకోవాలని పాఠశాల నిర్ణయించిందన్నారు. వసంత్‌కుంజ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లోని ఠాగూర్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పనివేళలను మధ్యాహ్నానికి మార్చాయి.
1000 మంది చిన్నారులతో ప్రధాని ముచ్చట్లుప్రధానమంత్రి శుక్రవారం మధ్యాహ్నం మూడు
గంటల నుంచి 4.45 గంటల వరకు మనేక్‌షా ఆడిటోరియంలో 1000 మంది విద్యార్థులతో మాట్లాడతారు. ఆయన ప్రసంగాన్ని ప్రత్యక్షప్రారం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అన్ని స్కూళ్లకు దూరదర్శన్, ఇతర ఎడ్యుకేషనల్ చానళ్ల ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తారు. ప్రధానమంత్రి విడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దేశంలోని పలు ప్రాంతాల విద్యార్థులతో ముచ్చటిస్తారు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి నగరంలోని మున్సిపల్ పాఠశాలలు కూడా ఏర్పాట్లు చేశాయి. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కింద 750 స్కూళ్లు, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కింద 589 స్కూళ్లు, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కింద 550 స్కూళ్లు ఉన్నాయి.
ఈ స్కూళ్లన్నింటిలో ప్రధాని ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం కోసం ఏర్పాట్లు జరి గాయి. పలు మున్సిపల్ స్కూళ్లు ఒక రోజు కోసం కేబుల్ కనెక్షన్లు తీసుకున్నా యి. టీవీలు, ప్రొజెక్టర్లు అద్దెకు తెచ్చాయి. రెండు షిఫ్టులలో పనిచేసే స్కూళ్లలో ఉదయం షిఫ్టులో హాజరయ్యే విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాల్గొన డం నుంచి మినహా యింపు ఇచ్చారు. మధ్యాహ్నం షిఫ్టులో హాజరయ్యే విద్యార్థులు, సాధారణ వేళలో పనిచేసే స్కూళ్లలో విద్యార్థులు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంటుంది.