మార్పు రావాలి
బయోఇంధనంతో నడిచే వాహనాలు ఆవశ్యం
1988 రవాణా చట్టం రద్దుకు విపక్షాల మద్దతు
త్వరలో నూతన చట్టం
కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కారీ
కోలారు : బయో ఇంధనంతో నడిచే వాహనాలను ఉత్పత్తి చేయడం ద్వారా భారతదేశాన్ని కాలుష్య రహితంగా మార్చే ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. కోలారు సమీపంలోని నరసాపురం పారిశ్రామిక వాడలో స్కానియా కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సు తయారీ పరిశ్రమను ఆయన మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. ప్రస్తుతం స్కానియా కంపెనీ ప్రారంభించిన బస్ తయారీ కేంద్రం భారత దేశంలోనే నూతన సాంకేతిక పరిజా‘నానికి నాంది పలికి నటై్లందన్నారు.
మిథనాల్, బయో ఫూయల్‌తో నడిచే వాహనాల తయారీ ద్వారా దేశంలో 95 శాతం కాలుష్యాన్ని నివారించడానికి సాధ్యమవుతుందన్నారు. భవిష్యత్తులో భారత దేశం విదేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడం తగ్గించాల్సి ఉందని దీనికి బయోఫూయల్ వాడకమే ఉత్తమ మార్గమని అన్నారు. స్కానియా కంపెనీ ప్రస్తుతం బస్సులు , ట్రక్కులు మాత్రమే తయారు చేస్తోందని, భవిష్యత్తులో కార్లు తదితర వాహనాలను కూడా ఉత్పత్తి చేయాల్సి ఉందన్నారు. కర్ణాటకలో రవాణా వ్యవస్థ చక్కగా ఉందన్నారు. ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పోలిస్తే ఎంతో మెరుగ్గా ఉందన్నారు.
మధ్య ప్రదేశ్‌లోని నాగ్‌పూర్ తదితర ప్రాంతాలలో బయోపూయల్‌తో నడిచే వాహనాలను నడపడానికి ఆ రాష్ట్రం సుముఖత చూపుతుండగా స్కానియా కంపెనీ ఆ రాష్ట్రంలోనూ తమ కంపెనీని నెలకొల్పాలని పిలుపు నిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ద్వారా గ్రామీణ ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యత నిస్తోందన్నారు. దేశంలో ఎంతోమంది రైతులు పరిశ్రమల స్థాపన కోసం తమ భూములను అందించారని, అలాంటి కుటుంబాలకు కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రోడ్లు, రైల్వే, నది మార్గాలకు అత్యంత ప్రాధాన్యత నిస్తుండగా. భవిష్యత్తులో కృష్ణ, కావేరి నదుల అనుసంధానం ద్వారా ఉత్తమ జల రవాణా వ్యవస్థను కల్పిస్తున్నట్లు తెలిపారు. 1988 నాటి బూజు పట్టిని రవాణా చట్టాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాలలో రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి ప్రతి పక్షాలు కూడా మద్దతు తెలుపు తున్నాయని అన్నారు. ప్రస్తుతం రవాణా చట్టం బలహీనంగా ఉందని జపాన్, జర్మనీ తరహాలో నూతన రవాణా చట్టాన్ని తీసుకు వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, కోలారు ఎంపి కే హెచ్ మునియప్ప, స్కానియా కంపెనీ అధ్యక్షుడు మార్టిన్ లండ్‌స్టర్డ్, ఉపాధ్యక్షుడు ఆండర్స్ గ్రండ్ స్ట్రామర్ తదితరులు పాల్గొన్నారు.