పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఆయా పార్టీలు నిమగ్నమయ్యాయి. వీరి భవితవ్యాన్ని నిర్ణయించే ఆయుధం ‘ఓటు’ను పాశుపతాస్త్రంగా మీరు మలుచుకోవాలనుకుంటున్నారా? ఇప్పటికీ మీకు ఓటు లేదా? అయితే 18 ఏళ్ల పైబడిన వారికి ఓటర్‌గా నమోదుచేసుకునేందుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశాన్ని కల్పించింది.
సాక్షి, ముంబై: పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఆయా పార్టీలు నిమగ్నమయ్యాయి. వీరి భవితవ్యాన్ని నిర్ణయించే ఆయుధం ‘ఓటు’ను పాశుపతాస్త్రంగా మీరు మలుచుకోవాలనుకుంటున్నారా? ఇప్పటికీ మీకు ఓటు లేదా? అయితే 18 ఏళ్ల పైబడిన వారికి ఓటర్‌గా నమోదుచేసుకునేందుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశాన్ని కల్పించింది. ఆదివారం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టేందుకు ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. నగరంలో 2,545, శివారు ప్రాంతాల్లో 957 కేంద్రాలను సంసిద్ధం చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్న ఈ కేంద్రాల్లో ఓటర్ కార్డు కోసం నమోదుచేసుకునేందుకు ప్రజలు పాస్‌పోర్ట్ పరిమాణంలో ఉన్న కలర్ ఫొటో, శాశ్వత చిరునామా, వయస్సుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త ఓటర్లు మొదట కేంద్రం వద్ద లభించే ‘ఫామ్ 6’ను భర్తీ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
ఆ తర్వాత ఎన్నికల గుర్తింపు కార్డు ఇంటికే వస్తుందని వివరించారు. కొన్ని కారణాల వల్ల ఆదివారం దరఖాస్తు ఫారం పూర్తి చేయనివారు ఈ నెల 25వ తేదీ వరకు ఈసీ అవకాశాన్ని కల్పించిందన్నారు. హెల్ప్‌లైన్ కేంద్రాలలో ఈ ఫారమ్ పూర్తి చేసి సమర్పించాలని తెలిపారు. కాగా, అప్‌డేట్ చేసిన ఓటర్ల వివరాలను మరోసారి పునఃపరిశీలించుకోవాలని జిలా ఎన్నికల ఉప ప్రధాన అధికారి తరుణ్ కుమార్ ఖత్రి పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామాను మరోసారి తనిఖీ చేసుకోవాలని కోరారు.
అయితే అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోమన్నారు. బ్యాంక్, కిసాన్, పోస్టాఫీస్ ప్రస్తుత పాస్‌బుక్‌ల జిరాక్స్ ప్రతులను సమర్పించాలన్నారు. అవి లేకుంటే దరఖాస్తుదారుడి రేషన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లెసైన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ పత్రాలను ఆధారంగా తీసుకుంటామని వివరించారు. తాజా నీటి బిల్లు, టెలిఫోన్, విద్యుత్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్లులను కూడా అడ్రస్ ప్రూఫ్‌గా తీసుకుంటామన్నారు.