ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: ఎంపీ కవిత
విజయవాడ: అమరావతిలో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనడానికి నిజామాబాద్ ఎంపీ కవిత విజయవాడకు చేరకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై మీ వైఖరేంటని విలేకరులు ప్రశ్నించగా.. ’ప్రజలు కోరుకుంటున్న వాటిని అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఏపీకి ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోవాలి. ఆంధ్ర ప్రజలకు మేము అండగా ఉంటాము. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగువారిగా కలిసి ఉండాలి’ అన్నారు. మహిళ పార్లమెంటేరియన్ల సదస్సుకు హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.