
‘ఎంపీ కవిత డిమాండ్ విడ్డూరంగా ఉంది’
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని తాము అంతర్గతంగా చెబుతుంటే...మరోవైపు టీఆర్‌ఎస్ ఎంపీ కవిత మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందిన బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి చెబుతున్నట్లు ఎవరో ఒక బాహుబలి వస్తాడని...ఆయన శనివారం విలేకర్ల చిట్‌చాట్‌లో అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో రుణమాఫీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ చెపితే తప్పేంటని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఒక ఎర్రవెల్లికే ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ‍్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ చెస్తే ఒప్పు...మోదీ చేస్తే తప్పా అని అన్నారు.