టీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాటు పూర్తిచేశామని వరంగల్ సీపీ సుధీర్ బాబా అన్నారు.
టీఆర్‌ఎస్ సభకు ఏర్పాట్లు పూర్తి: సీపీ
Published Wed, Apr 26 2017 1:08 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM
వరంగల్: నగరంలో టీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. అన్ని ఏర్పాటు పూర్తిచేశామని వరంగల్ సీపీ సుధీర్ బాబా అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ఆరువేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నాం. సుమారు 25 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్కింగ్, ట్రాఫిక్ లాంటి సమస్యలు లేకుండా అన్ని చోట్లా పికెటింగ్ నిర్వహిస్తాం. పోలీస్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలందిస్తాం. సభకు వచ్చే వారి వాహానాల కోసం 1000 ఎకరాలు పార్కింగ్ స్థలాన్ని కేటాయించామని అన్నారు.
Advertisement
Advertisement