TRS Public Meeting
-
‘ఆగు తమ్మి నీకు దండం పెడుతా’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సరాదాగా చేసిన వ్యాఖ్యలు సభకు హాజరైన వారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. సభలో ప్రసంగించిన కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగంలో చివర్లో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు వ్యవసాయం చేస్తాం అనుకో.. ఇక్కడున్నారా వ్యవసాయం చేసోటోళ్లు ఎవలైనా.. అయిన గిడేందుకు ఉంటారు సికింద్రాబాద్‌లా. వ్యవసాయం అయితే తెలుసుకదా? నాగలి ఎరికేనా నాగలి? అందరం ఎప్పుడో ఒకప్పుడు రైతు బిడ్డలమే కదా.. అందరం ఆడికెళ్లి వచ్చినోళ్లమేన’ని అన్నారు. ఆ సమయంలో సభలో పాల్గొన్న ఓ వ్యక్తి మాది కరీంనగర్ అని తెలిపాడు. ఇది విన్న కేటీఆర్..‘నీది కరీంనగరేనా.. ఆగు తమ్మి నీకు దండం పెడుతా.. మీకు చైతన్యం ఎక్కువ ముందే’ అని వ్యాఖ్యానించి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు నింపాయి. -
తెలంగాణపై బాబు, లగడపాటి కుట్రలు
సాక్షి, జనగామ/మహబూబాబాద్/కామారెడ్డి/ యాదాద్రి: నాడు ఉద్యమ సమయంలో తెలంగాణ రాకుండా అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, లగడపాటి రాజగోపాల్ మరోసారి కుట్రలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, కామారెడ్డి జిల్లా గాంధారి,యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం, ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారంలో ఆయన ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ కుట్రలు ప్రారంభమయ్యాయని, ఇందుకుగాను ఆంధ్రా శక్తులన్నీ ఒక్కటయ్యాయని పేర్కొన్నారు. ఆంధ్రా నుంచి చంద్రబాబు నోట్ల కట్టలు పంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లగడపాటి రహస్య ఎజెండాతో వస్తున్నారని తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. మోసపోతే గోసపడుతామని, వారి కుట్రలను తిప్పికొ ట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ గెలిస్తే నీటిపారుదల, హోం, పరిశ్రమలు శాఖలు తమకే అని టీడీపీ వారు అంటున్నారని, తెలంగాణ నీళ్లు ఆంధ్రా కు తరలించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. కూటమికి ఓటేస్తే కాళేశ్వరం ఆగినట్లే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే పోలవరానికి నీళ్లు తగ్గు తాయంటూ ఇప్పటికే చంద్రబాబు అడ్డు తగులుతున్నాడని హరీశ్ ఆరోపించారు. కూటమికి ఓటేస్తే బాబు కచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకుంటాడని, దీంతో మనకు నీళ్లు రావన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే కాళేశ్వరం వస్తుందని కూటమికి ఓటేస్తే శనేశ్వరం వస్తుందని అన్నారు. మరో ఏడాదిన్నర రెండేళ్ల లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు కాళేశ్వరం నీళ్లు వస్తాయన్నారు. కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ చీకటి తెలంగాణ అవుతుందన్నారు. చంద్రబాబువి దుర్మార్గపు ఆలోచనలు చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలు చేసే వ్యక్తి అని, అలాంటి కూటమికి ఓటు వేయొద్దని హరీశ్ కోరారు. విద్యుత్ చార్జీలు తగ్గించమని అడిగితే ప్రజల్ని పిట్టల్లా కాల్చి చంపిన నరహంతకుడని ధ్వజమెత్తారు. కాం గ్రెస్, బాబు తోడుదొంగలు, మాట తప్పిన వాళ్లన్నా రు. బాబు ఇచ్చిన పైసలతో రోజూ పేపర్లు, టీవీలలో ప్రకటనలు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మం చోడని తెలంగాణకు మేలు చేస్తాడని కోదండ రాం అనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అన్నారు. తెలంగాణ మేధావి లోకం కోదండరాంను చూసి జాలిపడుతుందన్నారు. డిసెంబర్ 11 తర్వాత వచ్చే ఫలితాలతో కేసీఆర్ ఇరగదీసే పర్సన్ అని రుజువు అవుతుందన్నారు. కూటమి నేతల కల్లబొల్లి మాటలు వినకుండా టీఆర్ఎస్కు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తమ్‌కే నమ్మకం లేదు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న నమ్మకం లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. దేనికోసం కూటమికి ఓటు వేయాలో కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. కూటమిలోని నలుగురికి తోకలే సక్రమంగా లేవని విమర్శించారు. కోదండరాంను కోదండం ఎక్కించారని, ఆయన ఏమి మాట్లాడుతున్నాడో అర్థంకాని పరిస్థితి ఉందన్నారు. కుడితిలో పడిన ఎలుక లెక్క కోదండరాం పరిస్థితి అయిందని విమర్శించారు. పౌరసంఘం హక్కుల నేత అని చెప్పుకునే కోదండరాం, నరహంతకుడు, ఎన్కౌంటర్లు చేయించిన బాబు కడుపులో తలపెట్టి గౌరవం తగ్గించుకున్నారని మండిపడ్డారు. కోదండరాంను చూసి మేధావిలోకం సిగ్గు పడుతుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెవ్వులో పూలు పెట్టుకున్నారు కావచ్చు.. ప్రజల కళ్లకు గంతలు కట్టలేరని పేర్కొన్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్కు మళ్లీ పట్టం కట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. -
అది అధికార ఆరాట ఆవేదన సభ: పొన్నాల
హైదరాబాద్: టీఆర్ఎస్ వరంగల్ సభను 16 ఏళ్ల ప్రగతి నివేదన సభ అనేకంటే అధికార ఆరాట ఆవేదన సభ అనాలి అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. మరోసారి అధికారం కోసం ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఆయనిక్కడ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రసంగం పేలవంగా ఉందని.. ప్రజలలోనూ స్పందన లేదని అన్నారు. ఉస్మానియా శత వసంతాల సంబరాలకు రాష్ట్రపతి రావడం గర్వకారణం అయితే తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే అవకాశం తీసుకోకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. మరోవైపు భూసేకరణ చట్టం 2013 అమలు చేయకుండా కొత్త చట్టం తెస్తే కేంద్రం నుండి తిరిగి పంపారు.. ఇది ఆయన పరిపాలనకు అద్దం పడుతోందన్నారు. 144వ సెక్షన్ విధించి బలవంతంగా భూసేకరణ చేస్తే కోర్టు స్టేలు ఇస్తోందని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కోర్టు అభ్యంతరాలు చెప్పిందన్నారు. వరంగల్ సభ కన్నా 48 గంటల ముందు ఈ సంఘటనలు జరిగాయని, ఆ భయంతో పేలవంగా మాట్లాడారని అన్నారు. మీ వాళ్ళు గంటలు కూలి చేస్తే లక్షలు వస్తాయి కానీ ఉపాధి హామీ కూలీలకు మూడు నెలలు అయినా 150 రూపాయలు ఇవ్వరా అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి తూతూ మంత్రంగా ఇచ్చారు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమైంది..ఎక్కడ మొదలుపెట్టారు.. ఎక్కడ ఇచ్చారు.. మీ బడ్జెట్ కేటాయింపు ఎంత.. ఇవ్వి మోసపూరిత మాటలు కాదా అని నిలదీశారు. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మాట్లాడని కేసీఆర్ వారికి ఎరువుల ఆశ చూపుతున్నారన్నారు. కాంగ్రెస్‌ను నిందించకుండా కేసీఆర్‌కు రోజు గడవదన్నారు. తెలంగాణ ద్రోహుల సంగతి చూస్తానంటారు.. మరి మీ కేబినెట్లో ఎవరున్నారు.. మీరు ఎవరికి టిక్కెట్లు ఇచ్చారో ప్రజలకు తెలియదా అని పొన్నాల ప్రశ్నించారు. -
టీఆర్ఎస్ సభకు ఏర్పాట్లు పూర్తి
-
టీఆర్ఎస్ సభకు ఏర్పాట్లు పూర్తి: సీపీ
వరంగల్: నగరంలో టీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. అన్ని ఏర్పాటు పూర్తిచేశామని వరంగల్ సీపీ సుధీర్ బాబా అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. ఆరువేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నాం. సుమారు 25 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున పార్కింగ్, ట్రాఫిక్ లాంటి సమస్యలు లేకుండా అన్ని చోట్లా పికెటింగ్ నిర్వహిస్తాం. పోలీస్ కంట్రోల్ రూం ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలందిస్తాం. సభకు వచ్చే వారి వాహానాల కోసం 1000 ఎకరాలు పార్కింగ్ స్థలాన్ని కేటాయించామని అన్నారు. -
సెంచరీ కొడతాం
* గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుపై మంత్రుల ధీమా * టీఆర్ఎస్ బహిరంగ సభలో ఉత్సాహభరిత ప్రసంగాలు * 100 స్థానాల్లో విజయం ఖాయమని వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తు వంద సీట్లు గెలవబోతోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం పరేడ్‌గ్రౌండ్స్ మైదానంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ వేదిక మీద నుంచి ఆయన మాట్లాడారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. గ్రేటర్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు అహ ర్నిషలు కృషిచేస్తున్నారని చెప్పారు. గ్రేటర్లో 1.08 లక్షలమంది పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. పట్టుదల, సంకల్పబలం ఉన్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నగరంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. నగరానికి కృష్ణా, గోదావరి జలాల తరలింపు, 24 గంటల కరెంటు సరఫరా ఇచ్చారని గుర్తుచేశారు. ఇవేవీ గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేదన్నారు. టీఆర్ఎస్తోనే నగరాభివృద్ధి: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ బల్దియా పీఠంపై టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరితేనే నగరం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రస్తుతం నిధులు, విధులు, అధికారాలున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదలకు రూపాయికి కిలోబియ్యం, ఆసరా పింఛన్లు అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణా మహాత్మ కేసీఆర్ ఆధ్వర్యంలోనే నగరం దేశంలో నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. విశ్వనగరం ఒక్క టీఆర్ఎస్కే సాధ్యమన్నారు. తప్పకుండా మెజార్టీ స్థానాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గులాబీ జెండా దూసుకుపోతోంది: మంత్రి తలసాని గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా విజయం వైపు దూసుకుపోతోందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ సంకల్పబలంతో చేపట్టిన అనేక కార్యక్రమాలు, పథకాలు నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాయన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నేడు విజన్ ఉన్న సీఎం కేసీఆర్ చేసి చూపుతున్నారని తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి నగరంలో సమస్యల పరిష్కారానికి కృషిచేశారన్నారు. హుస్సేన్‌సాగర్, మూసీ నదులను కాలుష్య కాసారంగా మార్చిన ఘనత విపక్షాలదేనని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి కేంద్రం సహకారం అందిస్తోందని చెప్పిన బీజేపీ నేతలు...బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జైళ్లకు వెళ్లొచ్చిన కొందరు ఛోటా నేతలు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారన్నారు. గత పాలకుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక్కరు చాలన్నారు. ఇతర ప్రాంతాల వారిని కడుపులో పెట్టుకుంటాం: మైనంపల్లి హన్మంతరావు తెలంగాణా రాష్ట్రం సాధించగానే ఇతర ప్రాంతాల వారిని ఇక్కడ నుంచి పంపిస్తారని విపక్షాలు దుష్ర్పచారం చేశాయని గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర ప్రాంతాల వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారంతా హైదరాబాదీయులే. రెండు రాష్ట్రాలు ఏర్పడడంతోనే ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈవిషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని మైనంపల్లి విజ్ఞప్తి చేశారు. సైడ్‌లైట్స్ ⇒ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై సీఎం సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఆశీనులు కాగా, మధ్యలో ఏర్పాటు చేసిన రెండో వేదికపై గ్రేటర్ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు కేటాయించారు. మూడో వేదిక కళాకారులకు కేటాయించారు. ⇒ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన టీఆర్ఎస్ సభ సాయంత్రం 5.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలోని కళాకారుల బృందం సుమారు గంటన్నర పాటు తమ ఆటాపాటలతో సభికులను ఉర్రూతలూగించారు. ⇒ ‘దేఖో హైదరాబాద్... అందమైన సికింద్రాబాద్’ అంటూ హైదరాబాద్ గొప్పతనాన్ని వివరిస్తూ పాడిన పాట అందరినీ ఉత్సాహ పరిచింది. బోనాల జాతర గొప్పతనాన్ని వివరిస్తూ ‘రామా రామా ఎల్లమ్మలో...’ అంటూ పాడిన పాటకు సభకు హాజరైన మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో చిందేశారు. కొంతమంది పూనకంతో శివసత్తులు ఆడారు. ‘వీర తెలంగాణమా.. తిరుగబడ్డ గానమా...,ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా...’వంటి పాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. ⇒ సభా ప్రాంగణానికి నాలుగు వైపులా కారు బెలూన్లను గాల్లో ఎగరేశారు. అవి సభికులను ఆకర్షించాయి. ⇒ ఎంపీ బాల్కా సుమన్ సభకు సమన్వయకర్తగా వ్యవహరించారు. పరేడ్‌గ్రౌండ్ బయట ఉన్న కార్యకర్తలను లోనికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఆయన పదేపదే విజ్ఞప్తి చేయడం కన్పించింది. కార్యకర్తలను అడ్డుకోవద్దని పదేపదే పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ⇒ పాతబస్తీ నుంచి వచ్చిన ఓ అభిమాని టీఆర్ఎస్ పార్టీ, కారు గుర్తు, కేసీఆర్ ఫొటోతో తయారు చేసిన హెల్మెట్‌ను తలకు ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. రాత్రి 7.55 నిమిషాలకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ సీఎం కేసీఆర్ సభా వేదికపైకి వస్తున్న సమయంలో మరో అభిమాని శంఖం పూరించి ఎన్నికల సమరానికి సిద్ధం అంటూ ప్రకటించాడు. ⇒ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర ఏమున్నది? నెత్తున్నదా...? కత్తిన్నదా..? ఆయనకు ఓటేస్తే హైదరాబాద్‌కు ఏమీ చేయలేడు’ అని చెప్పడంతో వేదికపై ఆశీనులైన సభికులతో పాటు అభిమానులు, కార్యకర్తలు ఘొల్లున నవ్వుకున్నారు. -
విశ్వనగరంగా హైదరాబాద్
-
'రెండేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు'
-
’ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము’
-
'ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో నల్లా'
-
'నేపాల్ ప్రజానీకానికి సానుభూతి'
-
27న బహిరంగసభపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి
-
టీఆర్ఎస్ బహిరంగసభ వాయిదా
కరీంనగర్, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6న కరీంనగర్లో నిర్వహించతలపెట్టిన బహిరంగసభ వాయిదాపడింది. సెప్టెంబర్ 7న టీజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున శాంతిర్యాలీని నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ బహిరంగసభను వాయిదా వేయాలని పార్టీ జిల్లా నాయకులకు సూచించినట్లు సమాచారం. జేఏసీ శాంతిర్యాలీ, టీఆర్ఎస్ బహిరంగసభకు ఒకేరోజు తేడా ఉండడంతో రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం తెలంగాణవాదులకు ఇబ్బందవుతుని భావించారు. అలాగే టీజేఏసీతో గతంలో ఉన్న అంతర్గత పొరపొచ్చాలు మళ్లీ పొడచూపి తెలంగాణవాదుల్లో మరోవిధంగా సంకేతాలు వెళ్లే ప్రమాదమున్న దృష్ట్యా సభను వాయిదా వేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో శనివారం కెమిస్ట్రీ భవన్లో జరగనున్న టీఆర్ఎస్ జిల్లా సమావేశాన్ని వాయిదా వేసినట్లు పార్టీ జిల్లా అద్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి తెలిపారు. తిరిగి బహిరంగసభతో పాటు పార్టీ సమావేశం ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామన్నారు.