భివండీ మేయర్‌గా తుషార్ చౌదరి ఎన్నిక
భివండీ న్యూస్‌లైన్: భివండీ నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక (బీఎన్‌ఎంసీ) మేయర్‌గా శివసేన కార్పొరేటర్ తుషార్ చౌదరి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 90 ఓట్లకు గాను ఆయనకు 87 ఓట్లు పడ్డాయి. అదేవిధంగా డిప్యూటి మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన అహ్మద్ సిద్ధికి ఏకగ్రీవమయ్యారు. మొదట 8 మంది నామినేషన్లు వేయగా, తర్వాత ఏడుగురు తమ నామినేషన్లను వెనుక్కి తీసుకోవడంతో అహ్మద్ సిద్ధికి విజయం లాంఛనప్రాయమైంది. బీఎన్‌ఎంసీ ఎన్నికలు గురువారం ముంబై ఉప నగరం కలెక్ట ర్ శేఖర్ చెనై, భివండీ కమిషనర్ జీవన్ సోనావునే సమక్షంలో కార్పొరేషన్ సభా గృహంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమయ్యాయి.
రెండున్నరేళ్లుగా మేయర్‌గా పనిచేస్తూ నేడూ మేయర్ బరిలో దిగిన ప్రతిభా పాటి ల్ చివరి నిమిషంలో శివసేన అభ్యర్థికి మద్దతు పలుకుతూ తన ఓటు కూడా అతడికే వేయడం గమనార్హం. నూతన మేయర్ తుషార్ చౌదరి, డిప్యూటీ మేయర్ అహ్మద్ సిద్ధికిని కాంగ్రెస్, సమాజ్‌వాదీ, శివసేన కార్పొరేటర్లుతో పాటు శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు కార్పొరేషన్ ప్రాంగణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.