చెన్నై, సాక్షి ప్రతినిధి : సేలంలో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిపి ఆపై హత్య చేసిన సంఘటనలు సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నారుు. కేరళకు చెందిన దేవదాస్ (53) సేలం బస్టాప్ వద్ద మలబార్ హోటల్ పేరుతో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం హోటల్‌ను మూసివేసి సొంతూరుకు సోమవారం చేరుకున్నాడు. మంగళవారం నుంచి హోటల్‌ను తెరవాలి శుభ్రం చేసిపెట్టమని పరోటా మాస్టర్ రవిచంద్రన్‌కు చెప్పాడు. ఉదయాన్నే హోటల్ వద్దకు వెళ్లగా తెరిచి ఉంది.
లోపల 50 ఏళ్ల మహిళ వివస్త్రగా శవమై పడి ఉంది. ఆమెపై అత్యాచారం జరిపి మద్యం బాటిల్‌తో ముఖంపై తలవెనుకభాగంలో కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. వీధుల్లో తిరిగే ఆ మహిళపై పరోటా మాస్టర్ రవిచంద్రన్ సహా మరికొందరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సేలం అళగాపురంలో రోడ్డుపక్కన ఉన్న చింతచెట్టుకు మరో 50 ఏళ్ల మహిళ అర్ధనగ్నంగా చీరతో ఉరివేసుకున్న స్థితిలో కనుగొన్నారు. ఆమె ముఖంపై సైతం తీవ్రమైన రక్తగాయాలు, పరిసరాల్లో పగిలిపోయిన బీరు బాటిళ్లు దొరికాయి. ఈ మహిళపై కూడా కొం దరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, ఆమె చీరతోనే ఉరి తగిలించి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మహిళ సైతం రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించారు. ఒకే రోజు ఇద్దరు మహిళలపై అత్యాచారం, హత్యకు గురికావడం సేలంలో కలకలం రేపింది.
ఇద్దరు మహిళలపై అత్యాచారం, హత్య
Published Wed, Nov 26 2014 1:59 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement