న్యూఢిల్లీ: అది డిసెంబర్ 16, 2012 దేశాన్ని కుదిపేసిన దుర్ఘటన. భారత్ కీర్తిప్రతిష్టలు మంటగలిపిన రోజు..దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రపంచ దేశాలు భారత్‌లో మహిళల దుస్థితి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.. ఆ రోజు రాజధాని నగరవీధుల్లో బస్సులోనే 23 ఏళ్ల మహిళా ట్రైనీ ఫిజియోథెరపిస్టుపై ముష్కరులు అత్యంత కిరాతకంగా సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. ఈ దుస్సంఘటన చోటు చేసుకొని రెండేళ్లు పూర్తి అయ్యింది. సంఘటన తీరు ఒక ఎత్తై ఇప్పటికీ దోషులకు మరణశిక్ష విధించినకోర్టు. ఇప్పటికీ అమలు చేయలేదు. ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. ఇంకా తాత్సారం జరుగుతూనే ఉంది. ఇంకా మహిళలపై దురాఘాతాలు కొనసాగుతూనే ఉన్నాయి..
విచారణలో జాప్యమిలా..
మార్చి, 2014 వరకూ ఆపెక్స్ కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. దీన్ని పూర్తి చేయడానికి ఇంకా కాలయాపన చేస్తోంది. ఇంతలోనే నేరస్తులు తమ మరణశిక్షను రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారి తరఫున న్యాయవాది ‘తమ కేసు ఇంకా సమగ్రంగా విచారించాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు. బాధిత కుటుంబం ఇంకా ఎదురు చూడక తప్పడం లేదు.
సమగ్రంగా విచారణ చేయాలి
‘ఈ కేసు త్వరగా పూర్తికావాల్సిందే. కానీ విచారణ సమగ్రంగా జరగాలని ఆశిస్తున్నా. ఇందులో న్యాయ ఒక వైపే జరగాలని చూడడం లేదు. తాను బాధితులకు, న్యాయానికి వ్యతిరేకం కాదు. అమాయకులకు శిక్ష పడకూడదనే నా వాదన’ అని నేరస్తులు ముఖేష్, పవన్ తరఫు న్యాయవాది అభిప్రాయపడుతున్నారు. అమాయకులైన తమ కక్షిదారులను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. వాళ్లు అమాయకులని తెలుసు, రుజువు చేయగలను. కోర్టు విచారణ నిష్పక్షతంగా సాగడం లేదు. తొందరపాటు చర్యలకు పాల్పడుతోంది. ఇంకా సమయ కావాలి’ అని అంటున్నారు.
ఢిల్లీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సెప్టెంబర్ 13, 2013న నిందితులైన ముకేష్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను నేరస్తులుగా పరిగణిస్తూ మరణ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. సామూహిక లైంగిక దాడి, హత్య, దోపిడీ, అమానవీయ సంఘటనలకు పాల్పడ్డారన్న వివిధ నేరాలపై వీరంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు మార్చి 13, 2013న మరణశిక్షను అమలు చేయాలని నిర్ణయించింది. మార్చి 15, 2014న ముకేష్, పవన్ గుప్తా తరఫు న్యాయవాదులు తమ కక్షిదారులకు క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు పరిశీలనకు స్వీకరించడంతో వారితోపాటు జూలై 14 మరో ఇద్దరి నిందితులు వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ శిక్షలను కూడా వాయిదా వేసింది.కానీ, తమ కక్షదారులు అమాయకులని సుప్రీంకోర్టు ముందు వారి తరఫు న్యాయవాదులు వాదించారు. విచారణ సమగ్రంగా జరుగలేదని, రాజకీయ నాయకులు, ప్రజల ఒత్తిడి కారణంగా జనవరి 21, 2013 లో కేసు విచార ప్రారంభమైందని,ఈ కారణంగా మరణ శిక్షను అంగీకరించేది లేదని, సమగ్ర విచారణ జరుపాలని కోరారు.
సంఘటన ఇలా..
నగరంలో కదులుతున్న బస్సులోనే ఆ యువతిపై మొత్తం ఆరుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. ఇందులో ఓ మైనర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో దుండగులు బాధితురాలుతోపాటు ఆమె స్నేహితుడిని తీవ్రంగా గాయపర్చారు. బాధితురాలిని బస్సు బయటకు నెట్టివేయడంతో తీవ్ర గాయాలపాలైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 29న, 2012న మృతి చెందింది.
ఈ కేసులో మైనర్ బాలుడిని మూడేళ్లపాటు సంస్కరణ హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు రాంసింగ్ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా ఈ కేసులో మిగతా నలుగురిపై విచారణ సమగ్రంగా జరగకుండానే కేసును తొందరంగా మూసివేయాలనే ఆతృతతో కోర్టు వ్యవహరిస్తోంది. తమ వాదనలు వినిపించడానికి మరింత సమయం కావాలని నేరస్తుల తరఫున న్యాయవాదులు కోరుతున్నారు. అంతేకాదు నలుగురిపై సామూహిక లైంగిక దాడి కేసుతోపాటు, దోపిడీ, దాడి తదితర కేసులపై విచారణ సాగుతోందని చెప్పారు. ఈ కేసులో సాక్షం రికార్డు దశలోనే ఉన్నది. గ్యాంగ్ రేప్ జరిగి బస్సు యజమానిపై చీటింగ్ కేసు ఉంది. కాబట్టి మరికొంత సమయం ఇచ్చి, సమగ్ర దర్యాప్తు జరపాలని, అమాయకులైన తమ కక్షిదారులకు విముక్తికల్పించాలని న్యాయవాది కోరుతున్నారు. బాధిత కుటంబానికి న్యాయం జరగడం లేదు. ఇంకా కాలయాపన సాగుతోంది.
నేరస్తుల శిక్షను కళ్లారా చూడాలి: బాధితురాలి తండ్రి
‘తమ కూతురుపై ఇంత దాష్టీకానికి ఒడిగట్టిన నేరస్తుల శిక్షను కళ్లారా చూడాలని తపిస్తున్నారు. అంతేకాదు, శిక్షలో జాప్యం కారణంగా నేరగాళ్లలో ఇంకా భయం పుట్టలేదు. ఇంకా మహిళల పట్ల ఇలాంటి నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టాలంటే తమ కూతురు జీవితాన్నిబుగ్గిపాల్జేసిన నేరగాళ్లకు తక్షణమే శిక్ష అమలు చేయాలని డిసెంబర్ 16 ఘటన బాధితురాలి తండ్రి ఈ వ్యవస్థను నిలదీస్తున్నారు. డిసెంబర్ 5న, ఉబర్ క్యాబ్ డ్రైవర్ దురాఘతం జరిగేది కాదు. రేపిస్టులకు భయం లేకుండా పోయిందనడానికి ఈ ఘటన నిదర్శనం, డిసెంబర్ 16, ఘటనలో నేరస్తులను అప్పుడే ఉరితీస్తే, ఈ దురాఘాతాలు చోటు చేసుకొనేవి కావు. కానీ న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే నేరస్తుల కొమ్ముకాస్తున్నారు. శిక్ష పడకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
గ్యాంగ్ రేప్ బాధితురాలికి 16న ఘన నివాళి
న్యూఢిల్లీ: న గరంలో డి సెంబర్ 16, 2012, గ్యాంగ్ రేప్ బాధితురాలకి నివాళులు అర్పించేందుకు ఈ నెల 16వ తేదీన ద్వారకా నుంచి మధ్య ఢిల్లీ వరకూ బస్సు ర్యాలీ నిర్వహించాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్ణయించాయి. జస్టిస్ సీకర్స్ నాయకత్వంలో సామాజిక పరిశోధన కేంద్రం, ఏన్‌హెచ్‌డీ, కొన్ని మితవాద సంఘాల కార్యకర్తలు కలిసి ఈ ర్యాలీని సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తాయి. నగరంలో మహిళకు భద్రత కల్పించాలనేది ఈ బస్సు ర్యాలీ ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు శనవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘రెండేళ్ల క్రితం బస్సులోనే దుండగులు యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అదే రోజు మహిళల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీకి పిటిషన్ అందజేయనున్నట్లు ఎన్జీవోస్ పేర్కొంది. ‘ డిసెంబర్ 16, 2012లో నగరంలో నడుస్తున్న బస్సులోనే యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని తెలిపింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైందని గుర్తు చేసింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని విమానంలో సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. ఆమె మృతికి సంతాపం ఈ బస్సు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పేర్కొన్నారు.
దోషులకు శిక్ష పడేనా.. బాధితులకు న్యాయం జరిగేనా?
Published Sun, Dec 14 2014 10:04 PM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM
Advertisement
Advertisement