Two years completed
-
2 Years YSJagan Ane Nenu: రైతన్న.. నేనున్నా..!
వెబ్‌డెస్క్: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమమే ప్రధానంగా కార్యక్రమాలు అమలు చేస్తోంది ఏపీ సర్కారు. రైతు సంక్షేమం పేరుతో మొక్కుబడిగా పథకాలు ప్రకటించడం కాకుండా విత్తనం నుంచి ధాన్యం అమ్మే వరకు ప్రతీ చోట రైతుకు నేనున్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇస్తున్నారు. రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా రెండేళ్లలో రూ.84,468.83 కోట్లు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. గత పాలకుల వైఖరి వ్యవసాయం దండగ అనేలా పాలన సాగిస్తే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండేళ్లలోనే వ్యవసాయాన్ని పండగలా మార్చారు సీఎం జగన్. వైఎస్సార్ రైతు భరోసా వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా ఐదేళ్లలో ప్రతీ రైతుకు రూ.67,500 సాయం అందించనుంది ప్రభుత్వం. ఎన్నికల మ్యానిఫెస్ట్లో ఐదేళ్లలో రూ. 50,000 అందిస్తామని పేర్కొన్నా... ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు ఆ మొత్తాన్ని రూ. 67, 500లకు పెంచింది జగన్ప్రభుత్వం. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు 52.38 లక్షల మంది రైతులకు దాదాపు రూ.17,030 కోట్లు పెట్టుబడి సాయంగా అందించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, దేవాదాయ, అటవీ, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీనే కావడం గమనార్హం. రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని వేళలా రైతులకు సహాయంగా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా నకిలీలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రభుత్వం చేత ధృవీకరించబడిన కల్తీలేని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందిస్తున్నారు. వీటితో పాటు ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్, పంటల బీమా, వడ్డీలేని రుణాలు, పంట కొనుగోలు కేంద్రాల సేవలు ఇక్కడ లభిస్తున్నాయి. అంతేకాదు భూసార పరీక్షలు, వ్యవసాయ నిపుణుల సూచనలు, గ్రామస్థాయిలోనే వ్యవసాయ ధరలు, మార్కెట్ల వివరాలు, వాతావరణ సూచనలు ఇలా అన్ని రకాల సదుపాయాలు ఆర్బీకేల ద్వారా రైతులకు అందించబడుతున్నాయి. రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో... ఆర్బీకే కేంద్రాల ద్వారా కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే సదుపాయం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఇందు కోసం ఆర్బీకేల పక్కనే జనతా బజార్లు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలలో సేవలందించడానికి 744 ఫిషరీస్ అసిస్టెంట్స్ ను నియమించింది. గేమ్‌ఛేంజ్ ప్లాన్స్ పశువులు, కోళ్లు, మత్స్య సంపదపై ఆధారపడిన వారికి అండగా నిలుస్తున్నారు సీఎం జగన్. ఆర్బీకేల ద్వారా మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ అందిస్తున్నారు. పశువులు, కోళ్లు, మత్స్యరంగానికి అవసరమైన నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్ ఫుట్స్ కూడా సరఫరా చేస్తోంది ఏపీ సర్కార్. రూ.14,000 కోట్ల ఖర్చుతో మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, గ్రేడింగ్ సౌకర్యాలు, డ్రైయింగ్ ఫ్లోర్లు, ప్యాకింగ్ వ్యవస్థ, ప్రైమరీ ప్రాసెసింగ్ వంటి పనులు చేపడుతున్నారు. ఆర్బీకేలకు అనుసంధానంగా అమూల్ భాగస్వామ్యంతో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అమూల్ ద్వారా పాడి రైతులు లీటర్ పాలకు గతంలో కంటే రూ.5 నుండి రూ.15 వరకు అదనంగా ఆదాయం పొందుతున్నారు. గొర్రెలు, మేకలు పెంపకందార్లకు ఆధునిక పోషణ, యాజమాన్య పద్ధతులపై పశు విజ్ఞానబడి వంటి అంశాలపై ఆర్బీకేల ద్వారా శిక్షణ అందిస్తున్నారు. గిట్టుబాటు అవుతోంది రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా 2019–-20, 2020–-21 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ.27,028 కోట్లతో 1,46,58,882 మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించారు. అదే విధంగా 16,46,303 మెట్రిక్ టన్నుల ఇతర పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ. 5,964 కోట్ల వెచ్చింది ఏపీ ప్రభుత్వం. మొత్తంగా 1,63,05,185 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులకు రూ. 32,992 కోట్లతో గిట్టుబాటు ధర కల్పించి రైతులకు నేనున్నాంటూ సీఎం జగన్ భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు అప్పులు చేసి వడ్డీలు కడుతూ తిప్పలు పడుతున్న రైతుల కష్టాలు తొలగించేందుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పంటల సాగు కోసం లక్ష రూపాయలలోపు తీసుకున్న పంట రుణాలపై రైతులకు పూర్తిగా వడ్డీ రాయితీ కల్పించారు. ఈ పథకంపై ఇప్పటివరకు గత ప్రభుత్వ బకాయిలతో కలిపి రూ.1,261 కోట్లు ఖర్చు చేసింది ఏపీ గవర్నమెంటు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 67.50 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా దేశ చరిత్రలోనే రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా పథకం అమలుకు ముఖ్యమంత్రి జగన్ అంకురార్పణ చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 15.67 లక్షల మంది రైతులకు రూ.4,113 కోట్ల మేర లబ్ది చేకూరింది. 2020 ఖరీఫ్ కు సంబంధించిన పంటకోత ప్రయోగాలు మార్చిలో అయిపోయిన వెంటనే ఏప్రిల్ నెలలో ప్రణాళిక శాఖ నుంచి నివేదికలు తీసుకొని బీమా పరిహారం చెల్లించడం చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. 2021 మే 25న 2020 ఖరీఫ్ లో పంట నష్టపోయిన 15.15 లక్షల మంది రైతులకు బీమా పరిహారంగా రూ.1,820.23 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతన్నల కోసం ప్రవేశపెట్టిన మరికొన్ని పథకాలు – పంటలకు గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడానికి రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. – వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా. దీని కోసం రూ.17,430 కోట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ చెల్లింపు. మరోవైపు విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచేందుకు విద్యుత్ ఫీడర్లకు మరో రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది. – రైతు సమస్యలపై ఎప్పటికప్పుడు విధివిధానాల ఖరారుకు రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఏర్పాటు. పంటల సాగుపై సమగ్ర ప్రణాళిక నిమిత్తం రైతు భరోసా కేంద్రాలు, మండల, జిల్లా స్థాయి రైతుల సలహా మండళ్ల ఏర్పాటు. – శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాలుకు రూ. 1500 చొప్పున రూ. 300 కోట్లు బోనస్ గా విడుదల. – గతంలో కనీస గిట్టుబాటు ధరలు లేని మిరప, పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలకు పంట వేసే సమయంలోనే కనీస గిట్టుబాటు ధరల ప్రకటన. – ప్రమాదవశాత్తు మరణించిన/ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.7 లక్షలు పరిహారం. – పశు నష్టపరిహారం పథకం ద్వారా మరణించిన ఆవులు, గేదెలకు రూ. 15,000 నుంచి రూ.30,000 వరకు చెల్లింపు. ఇక గొర్రెలు, మేకలకు రూ. 6,000 నష్ట పరిహారం అందచేత. – వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్ రద్దు – 2020 నవంబర్ నెలలో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ. 656 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందచేత. తుపాను దెబ్బతిన్న పంటల కొనుగోలు -
నోట్ల రద్దు: నెటిజనుల వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దనోట్ల ( 500, 1000 రూపాయల) రద్దు ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తయింది. నల్లధాన్ని రూపుమాపేందుకు, అవినీతిపై అరికట్టేందుకు అంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్ల చట్టబద్ధమైన మారక విలువను రద్దు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ డిమానిటైజేషన్‌ను సమర్ధించుకుంటూ ట్విటర్లో ట్వీట్ల పరంపర సాగించారు. అక్రమంగా నిలవ చేసిన డబ్బును నోట్ల రద్దుతో బ్యాంకులకు వచ్చే విధంగా చేశామని, పన్ను వసూళ్లు బాగా పెరిగాయంటూ తమని తాము ప్రశంసించుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల పరపంపరలో నోట్ల రద్దు కీలకమైందని, ఈ చర్య ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడంలో పెద్ద ప్రభావాన్ని చూపిందని జైట్లీ పేర్కొన్నారు. మే, 2014 లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినపుడు ఆదాయపన్ను రాబడి మొత్తం 3.8 కోట్ల రూపాయలుంటే.. తమ ప్రభుత్వం ఆధీనంలో మొదటి నాలుగేళ్లలో 6.86 కోట్ల రూపాయలకు పెరిగిందని ట్వీట్ చేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారాన్నీ తగ్గించాం..కానీ పన్ను వసూళ్లు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. దేశ పౌరులకు మంచి జీవనవిధానాన్ని అందించాం. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు, ఆదాయాన్ని సమకూర్చామంటూ చెప్పుకొచ్చారు. దీంతోపాటు ఒక వివరణాత్మక వ్యాసాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం విశేషం. మరోవైపు పెద్దనోట్ల రద్దు కష్టాలు ఇంకా తమను పీడిస్తున్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెటిజనులు కూడా డీమానిటైజేషన్పై వ్యంగాస్త్రాలతో విరుచుకు పడుతున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నోట్లరద్దు చేపట్టి రెండేళ్లు గడిచిన సందర్భంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. డిమానిటైజేషన్ చర్యను 'ఆర్థిక దుష్ప్రభావం' గా పేర్కొంది. ఎన్డీఐ ప్రభుత్వం అనాలోచిత చర్య కారణంగా, చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, 120 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడింది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీని దేశం ఎప్పటికీ క్షమించదని దుయ్యబట్టింది. ఆర్థిక రంగంలో అనాలోచిత చర్యలు ఎకానమీపై ఎంతటి దుష్ర్పభావాన్ని పడవేస్తాయో, జాతికి దీర్ఘకాలికంగా ఎంతటి నష్టమో ఈ రోజు (నోట్ల రద్దు రెండేళ్లయిన సందర్భంగా) స్పష్టమవుతోందని మాజీ ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి కూడా అయిన మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆలోచించి, అతి జాగ్రత్తగా ఆర్థిక విధానానాలను చేపట్టాల్సి అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సంప్రదాయక స్వల్పకాలిక విధాన నిర్ణయాలకు స్వస్తి పలికి దేశ ఆర్థికస్థిరత్వానికి మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు. -
జిల్లాల విభజనకు రెండేళ్లు
సాక్షి, ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా విభజన జరిగి నేటితో రెండేళ్లు పూర్తవుతుంది. 2016 అక్టోబర్ 11వ తేదీన దసరా పండగ నాడు ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఒక్కటిగా ఉన్న ఆదిలాబాద్ విభజనతో నాలుగు జిల్లాలుగా విడిపోయింది. దీంతో ఆయా జిల్లాలో పరిపాలనా వ్యవస్థ, పాలనా యంత్రాంగం ప్రజలకు చేరువైంది. విభజనకు ముందు ప్రజలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవారు. జిల్లా విస్తీర్ణం దృష్ట్యా ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలో పర్యటించడానికి ఇబ్బందులు పడేవారు. ఉదయం వెళ్లినవారు రాత్రయ్యే వరకు పర్యటించినా కొన్ని గ్రామాలు మాత్రమే తిరిగివచ్చే పరిస్థితి ఉండేది. ఆదిలాబాద్ నుంచి చెన్నూర్, మంచిర్యాల, కోటపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక రోజు సమయం పట్టేది. జిల్లాల విభజనతో అధికారులు మధ్యాహ్నంలోగానే ఆయా ప్రాంతాలను సందర్శించడంతో పాటు పాలనపరంగా ప్రజలకు చేరువయ్యారు. అయితే ఆయా శాఖల ఉద్యోగులను నాలుగు జిల్లాలకు విభజించడంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పడింది. ఇంకా చాలా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లాల విభజన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలో ఏ కార్యాలయంలో చూసినా ప్రజలతో కిక్కిరిసిపోయి కనిపించేది. ప్రస్తుతం పరిస్థితి దానికి భిన్నంగా మారింది. గతంకంటే కొంత మేలు... ఉమ్మడి జిల్లాగా ఉన్న ఆదిలాబాద్ వెనుకబాటుకు గురైంది. జిల్లాల విభజన తర్వాత ప్రభుత్వ పథకాలు ప్రజలకు కొంత మేరకు చేరువయ్యాయి. దీంతో పాలన ప్రగతిపథం వైపు సాగుతోంది. చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ.. ప్రభుత్వ శాఖల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, ఉద్యోగుల భర్తీ విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. కొత్త పాలనకు రెండేళ్లు గడుస్తున్నా ఆయా శాఖల్లో ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. మరికొన్ని కార్యాలయాల్లో సిబ్బంది కొరతతో పనుల్లో జాప్యం జరుగుతోంది. జిల్లా విభజన తర్వాత ప్రజలకు కొంత మేలు జరిగిందనే చెప్పుకోవచ్చు. పలు కార్యక్రమాల్లో జిల్లా ముందడుగు వేస్తోంది. అనుభవం ఉన్న అధికారులు ఉండడంతో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారుల అనుభవం తోడైంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి పథకం అమలులో జిల్లాకు మొదటిస్థానం రావడంతో కలెక్టర్ అవార్డు అందుకున్న విషయం విదితమే. ఉద్యోగుల కొరతతో ఇబ్బందులు... జిల్లాల విభజన ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కొర త ఎదురైంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ప్రభు త్వ కార్యాలయాలన్ని ఉద్యోగులతో కలకలలాడే వి. కానీ ప్రస్తుతం ఏ కార్యాలయంలో చూసిన వెలవెలబోతున్నాయి. ఇటు పనుల్లో సైతం జాప్యం జరుగుతుండగా.. ఉన్న సిబ్బం దిపై పనిభారం పెరిగిపోతోంది. ప్రజలకు సకాలంలో పని కాకపోవడంతో ఉన్న అధికారులపైనే భారం పడుతోంది. ఇలా పలు ప్రభుత్వ కార్యాయాల్లో ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో వెయ్యి పోస్టుల వర కు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యు విభాగం, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖల్లో పలు ముఖ్యమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా జిల్లా విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన ఐదు మండలాల్లోని ఆయా కార్యాలయాల్లో సౌకర్యాలు కనిపించడం లేదు. సిబ్బంది కొరతతో పాటు కంప్యూటర్ వంటి యంత్రాలు, ఫర్నీచర్, తదితర సదుపాయలు పూర్తిస్థాయిలో కల్పించలేదు. శాంతిభద్రతలు అదుపులో... చిన్న జిల్లా ఏర్పాటు కావడంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లాలో నేరాలు అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇటు నేరాల అదుపుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని ప్రధాన వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసుల విధుల్లో సాంకేతికత వంటి అంశాలపై దృష్టి సారించారు. మహిళలకు రక్షణగా ఉట్నూర్, ఇచ్చోడలో సైతం షీ టీంలు ఏర్పాటు చేశారు. మట్కా నిర్వహణపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో నిఘా వేసి అరెస్టు చేస్తున్నారు. దీంతోపాటు మహారాష్ట్ర నుంచి అక్రమంగా జిల్లాకు రవాణా చేసే దేశీదారును అబ్కారీ శాఖ అధికారులతో కలిసి అడ్డుకట్ట వేసే పనుల్టో నిమగ్నమయ్యారు. గుడుంబా, గుట్కా స్వాధీనం చేసి పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడంతో జరిమానాలు విధిస్తున్నారు. దీంతోపాటు పోలీసు వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందేలా చర్యలు చేపట్టారు. మారిన కలెక్టర్, ఎస్పీ.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కలెక్టర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్, ఎస్పీగా విక్రమ్‌జిత్ దుగ్గల్ వ్యవహరించారు. జిల్లాల విభజన తర్వాత కూడా కలెక్టర్‌గా జ్యోతి బుద్ధప్రకాశ్ కొనసాగగా, విక్రమ్‌జిత్ దుగ్గల్ నూతనంగా ఏర్పడిన రామగుండం పోలీస్ కమిషనర్‌గా నియామకం అయ్యారు. దీంతో ఆదిలాబాద్ ఎస్పీగా ఎం.శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. ఆదివాసీ ఉద్యమం నేపథ్యంలో వీరిద్దరిని బదిలీ చేసిన సర్కారు నూతన కలెక్టర్‌గా దివ్య దేవరాజన్, ఎస్పీగా విష్ణు ఎస్.వారియర్లను నియమించింది. ప్రస్తుతం వీరిద్దరు తమ పనితీరుతో జిల్లా ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు. కొత్త జిల్లాలతో పాలనా సౌలభ్యం కొత్త జిల్లాలు ఏర్పడడం వల్ల పాలన సౌలభ్యంగా మారింది. ఆదిలాబాద్ జిల్లా విశాలంగా ఉండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. జిల్లా అధికారులకు సమస్యలను విన్నవించడానికి అష్టకష్టాలు పడేవారు. ప్రస్తుతం జిల్లాలు చిన్నగా ఏర్పడడంతో ప్రజల వద్దకే అధికారులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఆయా శాఖల్లో ఖాళీలు ఉండడంతో ఉద్యోగులపై కొంత అదనపు భారం పడుతోంది. – వనజారెడ్డి, తహసీల్దార్, భీంపూర్ -
దోషులకు శిక్ష పడేనా.. బాధితులకు న్యాయం జరిగేనా?
న్యూఢిల్లీ: అది డిసెంబర్ 16, 2012 దేశాన్ని కుదిపేసిన దుర్ఘటన. భారత్ కీర్తిప్రతిష్టలు మంటగలిపిన రోజు..దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ప్రపంచ దేశాలు భారత్‌లో మహిళల దుస్థితి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.. ఆ రోజు రాజధాని నగరవీధుల్లో బస్సులోనే 23 ఏళ్ల మహిళా ట్రైనీ ఫిజియోథెరపిస్టుపై ముష్కరులు అత్యంత కిరాతకంగా సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. ఈ దుస్సంఘటన చోటు చేసుకొని రెండేళ్లు పూర్తి అయ్యింది. సంఘటన తీరు ఒక ఎత్తై ఇప్పటికీ దోషులకు మరణశిక్ష విధించినకోర్టు. ఇప్పటికీ అమలు చేయలేదు. ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. ఇంకా తాత్సారం జరుగుతూనే ఉంది. ఇంకా మహిళలపై దురాఘాతాలు కొనసాగుతూనే ఉన్నాయి.. విచారణలో జాప్యమిలా.. మార్చి, 2014 వరకూ ఆపెక్స్ కోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. దీన్ని పూర్తి చేయడానికి ఇంకా కాలయాపన చేస్తోంది. ఇంతలోనే నేరస్తులు తమ మరణశిక్షను రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వారి తరఫున న్యాయవాది ‘తమ కేసు ఇంకా సమగ్రంగా విచారించాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు. బాధిత కుటుంబం ఇంకా ఎదురు చూడక తప్పడం లేదు. సమగ్రంగా విచారణ చేయాలి ‘ఈ కేసు త్వరగా పూర్తికావాల్సిందే. కానీ విచారణ సమగ్రంగా జరగాలని ఆశిస్తున్నా. ఇందులో న్యాయ ఒక వైపే జరగాలని చూడడం లేదు. తాను బాధితులకు, న్యాయానికి వ్యతిరేకం కాదు. అమాయకులకు శిక్ష పడకూడదనే నా వాదన’ అని నేరస్తులు ముఖేష్, పవన్ తరఫు న్యాయవాది అభిప్రాయపడుతున్నారు. అమాయకులైన తమ కక్షిదారులను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు. వాళ్లు అమాయకులని తెలుసు, రుజువు చేయగలను. కోర్టు విచారణ నిష్పక్షతంగా సాగడం లేదు. తొందరపాటు చర్యలకు పాల్పడుతోంది. ఇంకా సమయ కావాలి’ అని అంటున్నారు. ఢిల్లీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సెప్టెంబర్ 13, 2013న నిందితులైన ముకేష్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను నేరస్తులుగా పరిగణిస్తూ మరణ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. సామూహిక లైంగిక దాడి, హత్య, దోపిడీ, అమానవీయ సంఘటనలకు పాల్పడ్డారన్న వివిధ నేరాలపై వీరంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు మార్చి 13, 2013న మరణశిక్షను అమలు చేయాలని నిర్ణయించింది. మార్చి 15, 2014న ముకేష్, పవన్ గుప్తా తరఫు న్యాయవాదులు తమ కక్షిదారులకు క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు పరిశీలనకు స్వీకరించడంతో వారితోపాటు జూలై 14 మరో ఇద్దరి నిందితులు వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ శిక్షలను కూడా వాయిదా వేసింది.కానీ, తమ కక్షదారులు అమాయకులని సుప్రీంకోర్టు ముందు వారి తరఫు న్యాయవాదులు వాదించారు. విచారణ సమగ్రంగా జరుగలేదని, రాజకీయ నాయకులు, ప్రజల ఒత్తిడి కారణంగా జనవరి 21, 2013 లో కేసు విచార ప్రారంభమైందని,ఈ కారణంగా మరణ శిక్షను అంగీకరించేది లేదని, సమగ్ర విచారణ జరుపాలని కోరారు. సంఘటన ఇలా.. నగరంలో కదులుతున్న బస్సులోనే ఆ యువతిపై మొత్తం ఆరుగురు లైంగికదాడికి పాల్పడ్డారు. ఇందులో ఓ మైనర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో దుండగులు బాధితురాలుతోపాటు ఆమె స్నేహితుడిని తీవ్రంగా గాయపర్చారు. బాధితురాలిని బస్సు బయటకు నెట్టివేయడంతో తీవ్ర గాయాలపాలైంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డిసెంబర్ 29న, 2012న మృతి చెందింది. ఈ కేసులో మైనర్ బాలుడిని మూడేళ్లపాటు సంస్కరణ హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు రాంసింగ్ జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ఈ కేసులో మిగతా నలుగురిపై విచారణ సమగ్రంగా జరగకుండానే కేసును తొందరంగా మూసివేయాలనే ఆతృతతో కోర్టు వ్యవహరిస్తోంది. తమ వాదనలు వినిపించడానికి మరింత సమయం కావాలని నేరస్తుల తరఫున న్యాయవాదులు కోరుతున్నారు. అంతేకాదు నలుగురిపై సామూహిక లైంగిక దాడి కేసుతోపాటు, దోపిడీ, దాడి తదితర కేసులపై విచారణ సాగుతోందని చెప్పారు. ఈ కేసులో సాక్షం రికార్డు దశలోనే ఉన్నది. గ్యాంగ్ రేప్ జరిగి బస్సు యజమానిపై చీటింగ్ కేసు ఉంది. కాబట్టి మరికొంత సమయం ఇచ్చి, సమగ్ర దర్యాప్తు జరపాలని, అమాయకులైన తమ కక్షిదారులకు విముక్తికల్పించాలని న్యాయవాది కోరుతున్నారు. బాధిత కుటంబానికి న్యాయం జరగడం లేదు. ఇంకా కాలయాపన సాగుతోంది. నేరస్తుల శిక్షను కళ్లారా చూడాలి: బాధితురాలి తండ్రి ‘తమ కూతురుపై ఇంత దాష్టీకానికి ఒడిగట్టిన నేరస్తుల శిక్షను కళ్లారా చూడాలని తపిస్తున్నారు. అంతేకాదు, శిక్షలో జాప్యం కారణంగా నేరగాళ్లలో ఇంకా భయం పుట్టలేదు. ఇంకా మహిళల పట్ల ఇలాంటి నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టాలంటే తమ కూతురు జీవితాన్నిబుగ్గిపాల్జేసిన నేరగాళ్లకు తక్షణమే శిక్ష అమలు చేయాలని డిసెంబర్ 16 ఘటన బాధితురాలి తండ్రి ఈ వ్యవస్థను నిలదీస్తున్నారు. డిసెంబర్ 5న, ఉబర్ క్యాబ్ డ్రైవర్ దురాఘతం జరిగేది కాదు. రేపిస్టులకు భయం లేకుండా పోయిందనడానికి ఈ ఘటన నిదర్శనం, డిసెంబర్ 16, ఘటనలో నేరస్తులను అప్పుడే ఉరితీస్తే, ఈ దురాఘాతాలు చోటు చేసుకొనేవి కావు. కానీ న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదులే నేరస్తుల కొమ్ముకాస్తున్నారు. శిక్ష పడకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. గ్యాంగ్ రేప్ బాధితురాలికి 16న ఘన నివాళి న్యూఢిల్లీ: న గరంలో డి సెంబర్ 16, 2012, గ్యాంగ్ రేప్ బాధితురాలకి నివాళులు అర్పించేందుకు ఈ నెల 16వ తేదీన ద్వారకా నుంచి మధ్య ఢిల్లీ వరకూ బస్సు ర్యాలీ నిర్వహించాలని కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిర్ణయించాయి. జస్టిస్ సీకర్స్ నాయకత్వంలో సామాజిక పరిశోధన కేంద్రం, ఏన్హెచ్డీ, కొన్ని మితవాద సంఘాల కార్యకర్తలు కలిసి ఈ ర్యాలీని సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తాయి. నగరంలో మహిళకు భద్రత కల్పించాలనేది ఈ బస్సు ర్యాలీ ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు శనవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘రెండేళ్ల క్రితం బస్సులోనే దుండగులు యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అదే రోజు మహిళల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీకి పిటిషన్ అందజేయనున్నట్లు ఎన్జీవోస్ పేర్కొంది. ‘ డిసెంబర్ 16, 2012లో నగరంలో నడుస్తున్న బస్సులోనే యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగిందని తెలిపింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైందని గుర్తు చేసింది. తీవ్రగాయాలపాలైన బాధితురాలిని విమానంలో సింగపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డిసెంబర్ 29న మృతి చెందింది. ఆమె మృతికి సంతాపం ఈ బస్సు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థ సభ్యులు పేర్కొన్నారు.