వెబ్‌డెస్క్: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమమే ప్రధానంగా కార్యక్రమాలు అమలు చేస్తోంది ఏపీ సర్కారు. రైతు సంక్షేమం పేరుతో మొక్కుబడిగా పథకాలు ప్రకటించడం కాకుండా విత్తనం నుంచి ధాన్యం అమ్మే వరకు ప్రతీ చోట రైతుకు నేనున్నానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇస్తున్నారు. రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా రెండేళ్లలో రూ.84,468.83 కోట్లు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. గత పాలకుల వైఖరి వ్యవసాయం దండగ అనేలా పాలన సాగిస్తే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండేళ్లలోనే వ్యవసాయాన్ని పండగలా మార్చారు సీఎం జగన్.
వైఎస్సార్ రైతు భరోసా
వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఇలా ఐదేళ్లలో ప్రతీ రైతుకు రూ.67,500 సాయం అందించనుంది ప్రభుత్వం. ఎన్నికల మ్యానిఫెస్ట్లో ఐదేళ్లలో రూ. 50,000 అందిస్తామని పేర్కొన్నా... ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు ఆ మొత్తాన్ని రూ. 67, 500లకు పెంచింది జగన్ప్రభుత్వం. వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు 52.38 లక్షల మంది రైతులకు దాదాపు రూ.17,030 కోట్లు పెట్టుబడి సాయంగా అందించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులు, దేవాదాయ, అటవీ, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏపీనే కావడం గమనార్హం.
రైతు భరోసా కేంద్రాలు
విత్తనం నుంచి పంట అమ్మకం వరకు అన్ని వేళలా రైతులకు సహాయంగా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) సీఎం జగన్ ఏర్పాటు చేశారు. ఆర్బీకేల ద్వారా నకిలీలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రభుత్వం చేత ధృవీకరించబడిన కల్తీలేని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతులకు అందిస్తున్నారు. వీటితో పాటు ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్, పంటల బీమా, వడ్డీలేని రుణాలు, పంట కొనుగోలు కేంద్రాల సేవలు ఇక్కడ లభిస్తున్నాయి. అంతేకాదు భూసార పరీక్షలు, వ్యవసాయ నిపుణుల సూచనలు, గ్రామస్థాయిలోనే వ్యవసాయ ధరలు, మార్కెట్ల వివరాలు, వాతావరణ సూచనలు ఇలా అన్ని రకాల సదుపాయాలు ఆర్బీకేల ద్వారా రైతులకు అందించబడుతున్నాయి. రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో... ఆర్బీకే కేంద్రాల ద్వారా కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే సదుపాయం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఇందు కోసం ఆర్బీకేల పక్కనే జనతా బజార్లు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలలో సేవలందించడానికి 744 ఫిషరీస్ అసిస్టెంట్స్ ను నియమించింది.
గేమ్ఛేంజ్ ప్లాన్స్
పశువులు, కోళ్లు, మత్స్య సంపదపై ఆధారపడిన వారికి అండగా నిలుస్తున్నారు సీఎం జగన్. ఆర్బీకేల ద్వారా మత్స్యకారులు, మత్స్య రైతులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై శిక్షణ అందిస్తున్నారు. పశువులు, కోళ్లు, మత్స్యరంగానికి అవసరమైన నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్ ఫుట్స్ కూడా సరఫరా చేస్తోంది ఏపీ సర్కార్. రూ.14,000 కోట్ల ఖర్చుతో మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులు, గ్రేడింగ్ సౌకర్యాలు, డ్రైయింగ్ ఫ్లోర్లు, ప్యాకింగ్ వ్యవస్థ, ప్రైమరీ ప్రాసెసింగ్ వంటి పనులు చేపడుతున్నారు. ఆర్బీకేలకు అనుసంధానంగా అమూల్ భాగస్వామ్యంతో పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అమూల్ ద్వారా పాడి రైతులు లీటర్ పాలకు గతంలో కంటే రూ.5 నుండి రూ.15 వరకు అదనంగా ఆదాయం పొందుతున్నారు. గొర్రెలు, మేకలు పెంపకందార్లకు ఆధునిక పోషణ, యాజమాన్య పద్ధతులపై పశు విజ్ఞానబడి వంటి అంశాలపై ఆర్బీకేల ద్వారా శిక్షణ అందిస్తున్నారు.
గిట్టుబాటు అవుతోంది
రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంలో భాగంగా 2019–-20, 2020–-21 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ.27,028 కోట్లతో 1,46,58,882 మెట్రిక్ టన్నుల వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించారు. అదే విధంగా 16,46,303 మెట్రిక్ టన్నుల ఇతర పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ. 5,964 కోట్ల వెచ్చింది ఏపీ ప్రభుత్వం. మొత్తంగా 1,63,05,185 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులకు రూ. 32,992 కోట్లతో గిట్టుబాటు ధర కల్పించి రైతులకు నేనున్నాంటూ సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు
అప్పులు చేసి వడ్డీలు కడుతూ తిప్పలు పడుతున్న రైతుల కష్టాలు తొలగించేందుకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పంటల సాగు కోసం లక్ష రూపాయలలోపు తీసుకున్న పంట రుణాలపై రైతులకు పూర్తిగా వడ్డీ రాయితీ కల్పించారు. ఈ పథకంపై ఇప్పటివరకు గత ప్రభుత్వ బకాయిలతో కలిపి రూ.1,261 కోట్లు ఖర్చు చేసింది ఏపీ గవర్నమెంటు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 67.50 లక్షల మంది రైతులకు మేలు జరిగింది.
వైఎస్సార్ ఉచిత పంటల బీమా
దేశ చరిత్రలోనే రైతుల వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ ఉచిత పంటల బీమా పథకం అమలుకు ముఖ్యమంత్రి జగన్ అంకురార్పణ చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 15.67 లక్షల మంది రైతులకు రూ.4,113 కోట్ల మేర లబ్ది చేకూరింది. 2020 ఖరీఫ్ కు సంబంధించిన పంటకోత ప్రయోగాలు మార్చిలో అయిపోయిన వెంటనే ఏప్రిల్ నెలలో ప్రణాళిక శాఖ నుంచి నివేదికలు తీసుకొని బీమా పరిహారం చెల్లించడం చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం. 2021 మే 25న 2020 ఖరీఫ్ లో పంట నష్టపోయిన 15.15 లక్షల మంది రైతులకు బీమా పరిహారంగా రూ.1,820.23 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతన్నల కోసం ప్రవేశపెట్టిన మరికొన్ని పథకాలు
– పంటలకు గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడానికి రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
– వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా. దీని కోసం రూ.17,430 కోట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ చెల్లింపు. మరోవైపు విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచేందుకు విద్యుత్ ఫీడర్లకు మరో రూ.1,700 కోట్లు ఖర్చు చేసింది.
– రైతు సమస్యలపై ఎప్పటికప్పుడు విధివిధానాల ఖరారుకు రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఏర్పాటు. పంటల సాగుపై సమగ్ర ప్రణాళిక నిమిత్తం రైతు భరోసా కేంద్రాలు, మండల, జిల్లా స్థాయి రైతుల సలహా మండళ్ల ఏర్పాటు.
– శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాలుకు రూ. 1500 చొప్పున రూ. 300 కోట్లు బోనస్ గా విడుదల.
– గతంలో కనీస గిట్టుబాటు ధరలు లేని మిరప, పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలకు పంట వేసే సమయంలోనే కనీస గిట్టుబాటు ధరల ప్రకటన.
– ప్రమాదవశాత్తు మరణించిన/ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.7 లక్షలు పరిహారం.
– పశు నష్టపరిహారం పథకం ద్వారా మరణించిన ఆవులు, గేదెలకు రూ. 15,000 నుంచి రూ.30,000 వరకు చెల్లింపు. ఇక గొర్రెలు, మేకలకు రూ. 6,000 నష్ట పరిహారం అందచేత.
– వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్ రద్దు
– 2020 నవంబర్ నెలలో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ. 656 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందచేత. తుపాను దెబ్బతిన్న పంటల కొనుగోలు
Comments
Please login to add a commentAdd a comment