
ఆమెపై ఆరోపణలు నిరాధారం: మోత్కుపల్లి
నయీం ఎన్‌కౌంటర్ అనంతరం మాజీ మంత్రి ఉమామాధవరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆరోపణలు కేవలం ప్రభుత్వ పరమైన లీకులేనని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మహిళపై ఆరోపణలు చేయడం సరికాదని, రాజకీయ జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.