
కాంగ్రెస్ గూటికి ఉమామాధవరెడ్డి?
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఉమా మాధవరెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైంది. టీడీపీ విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. ఆమె కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డితో మంతనాలు జరిపారు. గతంలో భువనగిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమె 2014 ఎన్నికల్లో ఓడిపోయారు.
ఈ నియోజకవర్గంలో సీనియర్ నేత అవసరం ఉండటం.. మరోవైపు తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు ఉండదని భావించిన ఆమె పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే ఆమె చేరికకు ముహూర్తం ఖరారు అవుతుందంటున్నారు.