తెరి ఫస్ట్‌లుక్ అదుర్స్ | Vijay, Surya movies First Look posters Release | Sakshi
Sakshi News home page

తెరి ఫస్ట్‌లుక్ అదుర్స్

Published Fri, Nov 27 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

తెరి ఫస్ట్‌లుక్ అదుర్స్

తెరి ఫస్ట్‌లుక్ అదుర్స్

 తమిళసినిమా; విజయ్,సూర్యలు తమ తాజా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లను పోటీ పోటీగా విడుదల చేశారు.24వ తారీకున సూర్య తన 24 చిత్ర పోస్టర్స్ విడుదల చేయగా విజయ్ తన 59 వ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లను 25వ తారీకున విడుదల చేశారు.పనిలో పనిగా చిత్ర టైటిల్ కూడా ప్రకటించేశారు.అట్లీ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న  ఈ భారీ చిత్రాన్ని కలైపులి ఎస్.ధాను తన ఎస్.క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
 
 ముద్దుగుమ్మలు సమంత,ఎమీజాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఆ చిత్రంలో దర్శకుడు కేఎస్.రవికుమార్,రాధిక,దర్శకుడు వెట్ట్రిమారన్,మహేంద్రన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.కాగా ఈ క్రేజీ చిత్రంలో విజయ్ పోలీస్‌అధికారిగా పవర్‌పుల్ పాత్రను పోషస్తున్నారు.అయితే ఇందులో ఆయన మరో పాత్రలో కూడా కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ చిత్రానికి కాక్కీ,తారుమారు,మూండ్రుముగం,క్షత్రీయన్,వెట్ట్రి,తుపాకీ-2 తదితర పేర్లను పరిశీలించి చివరకు తెరి అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
 
 ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్లు ఇళయదళపతి అభిమానుల్ని కిక్‌లో ముంచేస్తున్నాయి.చిత్ర వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఒక విజయ్ మరో విజయ్ నోరు మూస్తుంటే మరో విజయ్ సైడ్ నుంచి చూస్తున్న పోస్టర్ ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాబినం చేస్తున్నారా?అన్న సందేహం కలగక మానది.ఇక మరో పోస్టర్‌లో విజయ్ గన్ పట్టుకుని సీరియస్‌గా చూస్తున్న స్టిల్ అభిమానుల్ని అలరిస్తోంది.మొత్తం మీద పులి చిత్ర రిజల్ట్‌తో నిరుత్సాహంతో ఉన్న విజయ్ అభిమానులకు  ఈ తెరి చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్లు నూతనోత్సాహాన్ని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement