అత్తింటి వేధింపులు భరించలేక
Published Fri, Jan 27 2017 1:02 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా నాందెవాడలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న నాగరాజుకు నాలుగెళ్లి క్రితం లత(22)తో వివాహమైంది. అప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ద్విచక్రవాహనం కొనుక్కోవడానికి డబ్బులు తీసుకు రమ్మని వేధిస్తుండటంతో.. గత ఆదివారం లత ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందింది. కాగా.. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం అత్తింటి వారే ఉరి వేశారని ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement