సౌజన్య(ఫైల్)
జ్యోతినగర్(రామగుండం): కన్న కూతురును వేధింపులకు గురిచేసి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన ఓ తండ్రికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ సీనియర్ సివిల్ జడ్జి కే.పట్టాభిరామారావు శుక్రవారం తీర్పునిచ్చారు. రామగుండం మూడో డివిజన్ ఇందిరమ్మకాలనీకి చెందిన గొల్లపల్లి జనార్దన్ – స్వరూపకు కుమారుడు, కూతురు ఉన్నారు. జనార్దన్ కుటుంబసభ్యులను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో అతడి భార్య స్వరూప కేసు పెట్టింది. జైలుకు వెళ్లి వచ్చిన జనార్దన్ మేడిపల్లిలోని తల్లి వద్ద ఉండేవాడు. 2015 నవంబర్11న భార్య ఉంటున్న ఇంటికి వచ్చి వద్దకు వచ్చి గొడవచేశాడు. మనస్తాపం చెందిన కూతురు సౌజన్య(18) కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వరూప ఫిర్యాదుతో అప్పటి ఎన్టీపీసీ ఎస్సై సాగర్ చార్జీషీట్ దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వరావు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం జడ్జి జనార్దన్‌కు నాలుగేళ్ల కఠినకారాగార శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment