పావని (పైల్)
కోటగిరి(బాన్సువాడ) నిజామాబాద్ : కోటగిరి మండల కేంద్రాని కి చెందిన అమ్మ అనాథాశ్రమం వ్యవస్థాపకురాలు పావని(40) అదివారం తెల్లవారుజామున అస్వస్థతతో మృతి చెందారు. పావని కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ వారంరోజులపాటు హైదరాబాద్‌లో చికిత్స పొంది ఇటీవల స్వగ్రామానికి వచ్చింది. అదివారం కోటగిరిలో పావని అంత్యక్రియలు నిర్వహించారు ఎంపీపీ సులోచన, సర్పంచ్ స్వరూప పలువురు నాయకులు, గ్రామస్తులు హాజరయ్యారు.
అనాథ పిల్లలకు అమ్మగా..
తల్లితండ్రులను కోల్పోయి దిక్కులేని అ«నాథలుగా మారిన చిన్నారులను «అక్కున చేర్చుకుని 13 ఏళ్లక్రితం అమ్మ అనాథ ఆశ్రమాన్ని పావని ఏర్పాటు చేశారు. ఇద్దరు పిల్లలతో ఆశ్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇరవై మంది అశ్రమంలో ఉంటున్నారు. సొంత స్థలం లేకున్నా, అధికారుల సహకారంతో ప్రభుత్వ స్థలం సేకరించి, విరాళాలతో అనాథ పిల్లల కోసం శాశ్వత భవనం ఏర్పాటు చేసింది. ఆశ్రమంలో పెరిగిన అనాథ అమ్మాయి భారతికి ఇటీవల వివాహం కూడా చేశారు పావని. పావని మృతి వార్త తెల్సుకున్న పలువురు కంట తడిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment