గ్యాంగ్ రేప్ చేసి.. ఫ్లై ఓవర్పై పడేశారు | Woman gang raped in moving car | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ రేప్ చేసి.. ఫ్లై ఓవర్పై పడేశారు

Published Sun, Jun 12 2016 11:25 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

గ్యాంగ్ రేప్ చేసి.. ఫ్లై ఓవర్పై పడేశారు

గ్యాంగ్ రేప్ చేసి.. ఫ్లై ఓవర్పై పడేశారు

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. శనివారం రాత్రి ముగ్గురు దుండగులు 21 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, కదిలేకారులో ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్కు కిలో మీటర్ దూరంలో ఫ్లై ఓవర్ దగ్గర బాధితురాలిని పడేసి పరారయ్యారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది.

దక్షిణ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ బయట కిడ్నాప్ చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. దుండగులు తనకు తెలియదని, వారు వాడిన కారు నెంబర్ గుర్తుందని పోలీసులకు చెప్పింది. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, యజమాని ద్వారా నిందితులను గుర్తించారు. నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సివుందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపి, కేసు విచారణ చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement