Woman Gang Rape
-
దారుణాతి దారుణం.. పోలీసులూ స్పందించలేదు
మరో దారుణాతి దారుణమైన ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఓ వివాహితపై అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులు.. తిరిగొచ్చి దాష్టీకానికి పాల్పడ్డారు. దగ్గరల్లోనే ఓ ఆలయంలోకి ఈడ్చుకెళ్లి మరీ సజీవ దహనం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... సంభల్ జిల్లాలోని రాజాపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భర్త ఘజియాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటుండగా.. సదరు మహిళ(35) ఇద్దరి పిల్లలతో గ్రామంలోనే ఉంటోంది. శనివారం వేకువ ఝామున ఇంట్లోకి దూసుకొచ్చిన ఐదుగురు దుండగులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఆపై నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోగా.. ఆమె 100 హెల్ప్‌లైన్ సెంటర్‌కి ఫోన్ చేసింది. అయితే అవతలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో.. భర్త, సోదరుడిపై ఫోన్ కాల్స్ చేసింది. వాళ్లు పోలీసులను అప్రమత్తం చేసే లోపే.. తిరిగొచ్చిన నిందితులు ఆమెను దగ్గర్లోనే ఓ ఆలయంలోకి లాక్కెల్లారు. అక్కడ యజ్ఞశాలలో ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ఆడియో క్లిప్ కీలకం... కాగా, ఘటన తర్వాత స్థానిక మహిళలను క్లూస్ టీమ్‌ను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఏడీజీ ప్రేమ్ ప్రకాశ్ వారిని సుముదాయించారు. ‘100కు కాల్ చేసిన స్పందించలేదన్న విమర్శలు వచ్చాయి. దర్యాప్తుకు ఆదేశించాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బాధితురాలు ఫోన్‌కాల్‌లో నిందితుల పేర్లు వెల్లడించింది. ఆ ఆడియో క్లిప్ ఈ కేసులో సాక్ష్యంగా కీలకం కానుంది. ఐదుగురు నిందితులను గుర్తించాం. వారి కోసం గాలింపు చేపట్టాం’ అని ప్రేమ్ ప్రకాశ్ వెల్లడించారు. అత్యాచారం నిజంకాదు: ఎస్పీ ... అయితే ఈ ఘటనలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని, నిందితుల ఉద్దేశం వేరే ఉందని సంభల్ ఎస్పీ ఆర్ఎమ్ భరద్వాజ్ వెల్లడించారు. శనివారం ఉదయం ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. నిందితులంతా స్థానికులేనన్న ఆయన.. త్వరలో అరెస్ట్ చేసి, ప్రెస్మీట్లో అసలు వివరాలు వెల్లడిస్తామని భరద్వాజ్ తెలిపారు. -
గ్యాంగ్ రేప్ చేసి.. ఫ్లై ఓవర్‌పై పడేశారు
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. శనివారం రాత్రి ముగ్గురు దుండగులు 21 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి, కదిలేకారులో ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు కిలో మీటర్ దూరంలో ఫ్లై ఓవర్ దగ్గర బాధితురాలిని పడేసి పరారయ్యారు. బాధితురాలు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దక్షిణ ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ బయట కిడ్నాప్ చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. దుండగులు తనకు తెలియదని, వారు వాడిన కారు నెంబర్ గుర్తుందని పోలీసులకు చెప్పింది. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, యజమాని ద్వారా నిందితులను గుర్తించారు. నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సివుందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపి, కేసు విచారణ చేస్తున్నట్టు తెలిపారు. -
బస్సులో మృగాల కంటే దారుణంగా..
బరేలి: ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు దుండగులు మృగాల కంటే దారుణంగా ప్రవర్తించారు. బస్సు డ్రైవర్, కండెక్టర్ ఓ బాలింతపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు దుండగుల బారి నుంచి రక్షించుకునే ప్రయత్నంలో ఆమె ఒడి నుంచి 14 రోజుల పసికందు జారిపడి మరణించాడు. రాయ్‌పూర్‌కు చెందిన 28 ఏళ్ల యువతి తన ఇద్దరు పిల్లలతో కలసి బరేలిలోని సోదరి ఇంటికి వెళ్లింది. మంగళవారం రాత్రి రాయ్‌పూర్‌కు తిరిగి వెళ్లేందుకు ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. బస్సులో ప్రయాణిస్తూ ఆమె నిద్రపోయింది. బస్ స్టాప్‌లో మిగతా ప్రయాణికులందరూ దిగిపోగా నిద్రమత్తులో ఉన్న ఆమె గమనించలేదు. బస్సులో ఒంటరిగా మిగిలిపోయిన బాలింతపై డ్రైవర్, కండెక్టర్ లైంగికదాడికి పాల్పడ్డారు. వారిని ఎదిరించే క్రమంలో బాధితురాలు తన రోజుల బిడ్డను కోల్పోయింది. బస్సు డ్రైవర్, కండెక్టర్ ఆమెను రోడ్డుపై దించివేసి వెళ్లిపోయారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు చేసుకోగా.. ఆమెకు మరచిపోలేని పీడకలను మిగిల్చింది. -
ఆమె రాత్రిపూట అక్కడెందుకు ఉండటం?
కర్ణాటక రాజధాని బెంగళూరు నడిబొడ్డున టెన్నిస్ క్లబ్ వద్ద జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై ఆ రాష్ట్ర హోం మంత్రి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారు. ''ఇది చాలా దురదృష్టకరం. తుముకూరుకు చెందిన ఓ మహిళ రాత్రి 9.30 గంటల సమయంలో టెన్నిస్ క్లబ్ వద్ద ఉంది. ఆమె టెన్నిస్ నేర్చుకోవాలని అక్కడికి వెళ్లిందన్నారు. కానీ, అసలు ఆ సమయంలో ఆమె అక్కడ ఎందుకు వేచి ఉందన్నదే అసలు ప్రశ్న. మేం అన్ని విషయాల మీద దర్యాప్తు చేస్తున్నాం'' అని హోం మంత్రి పరమేశ్వర వ్యాఖ్యానించారు. బెంగళూరు కబ్బన్ పార్కు వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులు 34 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. హోం మంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మండిపడ్డారు. పరమేశ్వర వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదని, దీనివల్ల ప్రజల్లోకి సరైన సందేశం వెళ్లదని ఆమె చెప్పారు. ఆయనకు తన పనిమీద ఆసక్తి లేకపోతే వెంటనే దిగిపోవాలని అన్నారు. గత నెలలో 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అప్పటి హోం మంత్రి కేజే జార్జి కూడా దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరే చేస్తే అది గ్యాంగ్ రేప్ ఎందుకు అవుతుందని, కనీసం ముగ్గరు నలుగురు చేస్తే కదా.. అనాల్సింది అంటూ వ్యాఖ్యానించారు. కొన్నాళ్ల తర్వాతే ఆయన స్థానంలో పీసీసీ చీఫ్ పరమేశ్వరను నియమించారు. -
భర్తను కొట్టి.. భార్యపై గ్యాంగ్‌రేప్
రాంగియా: అసోంలో ఏడుగురు దుండగులు నవదంపతులపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించారు. భర్తను విచక్షణరహితంగా కొట్టి.. భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కంరూప్ జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది. గురువారం సాయంత్రం బక్సా జిల్లాకు చెందిన యువతి, తన భర్తతో కలసి కంరూప్ జిల్లా కెకెనికుచి ప్రాంతంలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు వచ్చింది. దారిలో ఏడుగురు దుండగులు వీరిపై దాడి చేశారు. భర్తను తీవ్రంగా కొట్టి, భార్యను సమీప అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. -
ఢిల్లీ వర్సిటీలో పెరుగుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించడానికి వచ్చే విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం వర్సిటీలో పెరిగిన విదేశీ విద్యార్థుల అడ్మిషన్లే ఇందుకు నిదర్శనం. 2012 డిసెంబర్ 16న నగరంలో జరిగిన మహిళ గ్యాంగ్ రేప్ సంఘటన ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. అంతేకాక ఉన్నతవిద్య చదవడానికి సురక్షిత ప్రాంతంగా ఢిల్లీ ఉంటుందని విదేశీ మహిళలు భావిస్తున్నారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ఫారిన్ స్టూడెంట్ రిజర్వేషన్ ఆఫీస్(ఎఫ్ఎస్ఆర్ఓ) డాటా ప్రకారం 2014-15 సంవత్సరంలో 1,184 మంది విదేశీ విద్యార్థులు వర్సిటీలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మహిళా విద్యార్థుల సంఖ్య 492 నుంచి 546కు పెరిగింది. 2011-12లో విదేశీ విద్యార్థుల సంఖ్య 952గా, 2012-13లో 1,007గా ఉంది. 2011-12లో మహిళా విద్యార్థుల సంఖ్య 434గా ఉంది. దక్షిణాసియా, దక్షిణ తూర్పు ఆసియా నుంచే ఎక్కువ: ముఖ్యంగా దక్షిణ ఆసియా, దక్షిణ తూర్పు ఆసియా, యూరోపియన్, ఆఫ్రికా దేశాల విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్లు ఎఫ్ఎస్ఆర్ఓ అధికారి అమ్రిత్ కుమార్ బస్రా వెల్లడించారు. యూనివర్సిటీలో జరిగిన అంతర్గత సమావేశంలో....రేప్ సంఘటన ప్రభావం విదేశీ విద్యార్థుల అడ్మిషన్లపై పడలేదనే విషయం అర్థమైందని ఆమె చెప్పారు. ‘వారిలో కచ్చితంగా ఆందోళన ఉంటుంది. కానీ భయపడటం లేదు. ప్రస్తుత విద్యాసంవత్సరం దక్షిణాసియా, దక్షిణ తూర్పు ఆసియాలోని నేపాల్ నుంచి 311, ఆఫ్ఘనిస్థాన్ నుంచి 55, మాల్దీవుల నుంచి 36, శ్రీలంక నుంచి 23, వియాత్నం నుంచి 23, భూటాన్ నుంచి 22, బంగ్లాదేశ్ నుంచి 10, ఇండోనేషియా నుంచి 7 మంది విద్యార్థులు ఢిల్లీ వర్సిటీలో అడ్మిషన్లు పొందారు. అలాగే మధ్య ప్రాచ్య, యూరోపియన్, ఆఫ్రికా దేశాల నుంచి కూడా క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇరాన్ నుంచి 11, ఇరాక్ నుంచి 7, నైజీరియా నుంచి 11, కాంగో నుంచి 10, జింబాబ్వే నుంచి 10, సోమాలియా నుంచి ఇద్దరు వర్సిటీలో చేరారు’ అని బస్రా తెలిపారు. నాణ్యమైన విద్య, తక్కువ జీవన వ్యయమే కారణం: నాణ్యమైన విద్య, తక్కువ జీవన వ్యయమే విదేశీ విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమని అమ్రిత్ కుమార్ బస్రా చెప్పారు. అదేవిధంగా వారు వర్సిటీలోనే ఉండేలా కచ్చితమైన నియమాలను పాటిస్తున్నామన్నారు. ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, రీసర్చ్ ప్రోగ్రామ్స్ విభాగాల్లో విదేశీ విద్యార్థులకు 5 శాతం సీట్లు రిజర్వ్ చేసినట్లు ఆమె తెలిపారు. వర్సిటీ నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు తక్కువగా అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే తప్ప, ఆ సీట్లను ఇతర కేటగిరీలకు మార్చడానికి అవకాశం ఉండదు. అదే విధంగా వర్సిటీలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా అంతర్జాతీయ హాస్టల్ సదుపాయాలు, వేర్వేరు బస్ సదుపాయం అందుబాటులో ఉందని ఆమె పేర్కొన్నారు. -
రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని లాలాచెరువు సమీపంలో గురువారం దారుణం జరిగింది. పని కోసం రాజమండ్రి వచ్చిన ఓ యువతిని పలువురు యువకులు మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువకులు అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్ని స్థానికులకు వెల్లడించింది. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ యువతిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. నిందితుల వివరాలు సేకరించి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.