కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం | Ghaziabad Woman Molestation In Moving Car And 2 Arrested In Delhi | Sakshi
Sakshi News home page

కదులుతున్న కారులో మహిళపై అత్యాచారం

Published Thu, Aug 19 2021 2:32 PM | Last Updated on Thu, Aug 19 2021 6:23 PM

Ghaziabad Woman Molestation In Moving Car And 2 Arrested In Delhi - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన మహిళపై కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు వివరాల ప్రకారం.. నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడి బాధిత మహిళను  ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి గురువారం నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

కారు వెనక సీటులో కూర్చున్న వ్యక్తి మొదట ఆమెపై దాడి చేసి, ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఈ ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా నిందితులు బెదిరించినట్లు పేర్కొన్నారు.  కాగా పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో కారును గుర్తించినట్లు వెల్లడించారు. దాని సహాయంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా ఆగస్టు 16న జరిగిన ఈ ఘటన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

చదవండి: వైరల్‌: బుజ్జగించడానికి మీ పిల్లలకు ఇవి ఇస్తున్నారా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement