ప్రియుడితో కలిసి భర్త హత్య
Published Tue, Apr 11 2017 3:10 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM
సిద్దిపేట: ప్రియుడి మోజులో పడి అతడి సాయంతో కట్టుకున్న భర్తనే హతమార్చిందో మహిళ. ఈ సంఘటన జిల్లాలోని కట్కూరులో వెలుగుచూసింది. అక్కన్నపేట మండలంలోని కట్కూరులో బిచ్చాల రాజు(28)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే భార్య మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. దీంతో కుటుంబంలో కలతలు చెలరేగాయి. అయితే భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని భావించి ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement