husband murdered
-
ప్రేమ వివాహం.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. ఆపై
సాక్షి, ఖమ్మం క్రైం: వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంరూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఖమ్మంలో చికెన్ వ్యర్థాలు తరలించే వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొణిజర్ల మండలానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్న ఆయన ఖమ్మం రోటరీనగర్‌లో నివాసముంటున్నాడు. అయితే, కొంతకాలం కిందట ఆమెకు భర్తతో కలిసి పనిచేసే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి మందలించడంలో ఎలాగైనా మట్టుబెట్టాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. దీంతో ఆమె ప్రియుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి యువతి భర్తకు ఈనెల 1న ఫోన్ చేసి పిలిపించి మద్యం తాగించాక శ్రీనివాస్‌నగర్–అగ్రహారం ప్రాంతంలో హత్య చేయడమే కాక చికెన్ వ్యర్థాల వాహనంలో తీసుకెళ్లి కృష్ణా జిల్లా రెడ్డిగూడెం ప్రాంతంలోని చెరువులో పడవేసినట్లు సమాచారం. ఆ తర్వాత సదరు యువతి ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా హత్య విషయడం బయటపడినట్లు తెలిసింది. అయితే, సదరు వ్యక్తి మృతదేహం ఇంకా లభ్యం కాకపోవటంతో కృష్ణా జిల్లా పోలీసుల సాయంతో అక్కడి చేపల చెరువుల్లో గాలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఒకటిరెండు రోజుల్లో కేసు వివరాలను వెల్లడించే అవకాశముందని చెబుతున్నారు. చదవండి: (కూతురు ప్రేమపెళ్లి.. హాజరుకాని భార్య.. తిరిగి ఇంటికి రావడంతో...) -
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
సారంగపూర్(నిర్మల్): నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని మహబూబాఘాట్స్ వద్ద గల శేక్‌సాహెబ్ దర్గా ఎదుట ఈ నెల 13న అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన కేసును ఎట్టకేలకూ పోలీసులు చేధించారు. డీఎస్పీ ఉపేంద్రరెడ్డి శనివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని యాకర్పెల్లి గ్రామానికి చెందిన శంకర్‌కు అనసూయ, లక్ష్మీ ఇద్దరు భార్యలు. మొదటి భార్య అనసూయకు ఇద్దరు, రెండోభార్య లక్ష్మికి ఒక్కరు సంతానం. ప్రియదర్శినీ నగర్లో ఉన్న ఇంటి విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో విసిగిపోయిన అనసూయ పదేళ్లక్రితం పుట్టిళ్లు అయిన మండలంలోని ప్యారమూర్‌కు వెళ్లింది. నాలుగేళ్ల క్రితం తమ ఇంటి పక్కనే మరో ఇంటికి పెయింటింగ్ వేయడానికి వచ్చిన బాగుల వాడకు చెందిన దాసరి శివతో లక్ష్మీకి పరిచయం ఏర్పడింది. అనుమానం వచ్చిన శంకర్‌కు తరచూ ఈవిషయంపై లక్ష్మిని వేధిస్తుండేవాడు. పథకం ప్రకారం శంకర్‌ను చంపాలని నిర్ణయించుకుంది. దీనికి శివ సహాయం కోరింది. ఇందుకు ప్రతిఫలంగా రూ.50వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. అడ్వాన్సుగా రూ.5వేలు ఇచ్చింది. ఈ నెల 12న రాత్రి 9గంటలకు ఆటో నడిపి ఇంటికి వచ్చిన శంకర్‌కు శివతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం ఇంట్లోంచి వెళ్లిపోయిన శివ అర్ధరాత్రి మళ్లీ వచ్చాడు. శంకర్ చాతిపై కూర్చుని రెండు చేతులూ పట్టుకుని కదలకుండా కూర్చున్నాడు. అరవడంతో లక్ష్మీ దిండుతో తలపై నొక్కి పట్టింది. ఆ తర్వాత శివ కత్తితో శంకర్ మెడపై పొడిచి గొంతు నులిమి హత్య చేశాడు. లక్ష్మీ తమ్ముడు ఆదిలాబాద్ రూరల్ మండలం చాందా(టి) గ్రామానికి చెందిన అంగవార్ చింటు అలియాస్ శ్రీనివాస్‌కు జరిగిన విషయం ఫోన్లో చెప్పింది. వెంటనే అక్కడికి చేరుకున్న చింటు సాయంతో మృతదేహాన్ని మహబూబాఘాట్స్ తరలించారు. అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు మృతదేహంపై ఆటోను పడేశారు. అద్దాలు పగుల గొట్టి అక్కడినుంచి వెళ్లిపోయారు. పూర్తి విచారణ చేపట్టిన రూరల్ సీఐ వెంకటేష్, ఎస్సై కృష్ణసాగర్రెడ్డి 48గంటల్లోనే కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. -
వివాహేతర సంబంధం మోజులో... భర్త దారుణ హత్య
సాక్షి, తుమకూరు (కర్ణాటక): ప్రియుని మత్తులో పడి భర్తనే ఓ భార్య చంపించింది. శిరా తాలూకా కరేజవనహళ్లి గ్రామంలో రాజు (34)ను మంగళవారం రాత్రి ప్రియుడు రాకేష్ (19), భార్య మీనాక్షి (25) హత్య చేశారు. ఎనిమిదేళ్ల క్రితం మీనాక్షితో రాజుకు వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కరేజవనహళ్లి గ్రామానికి చెందిన రాకేశ్ తుమకూరులోని ప్రైవేటు కాలేజీలో చదువుకుంటున్నాడు. ఒక పెళ్లిలో మీనాక్షితో పరిచయం అయిన రాకేశ్ ఆ తర్వాత ఫోన్ నంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం ప్రారంభించారు. టైలర్ అయిన మీనాక్షి దగ్గరికి దుస్తులు ఇచ్చే నెపంతో తరచూ వచ్చి అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఏడాదిగా ఇది కొనసాగుతోంది. రెండు నెలల క్రితం బెంగళూరులో కూలీ పనిచేస్తున్న రాజు తిరిగి ఇంటికి వచ్చాడు. తమ ఆనందానికి రాజు అడ్డుగా ఉన్నాడని, మట్టుబెట్టాలని ఇద్దరూ నిర్ణయించారు. సమీపంలోని తోటలో రాజును రాకేష్ మందు పార్టీకి పిలిచి మత్తులోఉండగా బండరాయితో కొట్టి చంపాడు. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. సమాచారం అందుకున్న కళ్లంబెళ్ల పోలీసులు ప్రేయసీ ప్రియున్ని అరెస్టు చేశారు. చదవండి: (వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. ఐదుగురి అరెస్ట్.. నలుగురు పరారీ) -
చిత్తూరు జిల్లాలో దారుణం.. భార్య చేతిలో భర్త దారుణ హత్య
సాక్షి, చిత్తూరు: జిల్లాలో దారుణం జరిగింది. తిరుపతి రేణిగుంట బుగ్గవీధిలో నివాసం ఉంటున్న రవిచంద్ర (55) భార్య వసుంధర చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో విచక్షణ కోల్పోయిన వసుందర కత్తితో అతి దారుణంగా పీక కోసి హత్య చేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. ఆమె మానసిక స్థితిపై ఇరుగుపొరుగు వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (మదనపల్లెలో దారుణం.. పొట్టేలు తల అనుకుని యువకుని తల..) -
మద్యం మత్తులో కత్తితో పొడవడానికి వచ్చిన భర్తను..
తిరువొత్తియూరు: మద్యం మత్తులో కత్తితో పొడవడానికి వచ్చిన భర్తను ఓ భార్య కడతేర్చింది. ఈ ఘటన కాంచీపురంలో చోటుచేసుకుంది. కాంచీపురం మల్లిగశెట్టి వీధికి చెందిన నౌషద్ (37) ఆటోడ్రైవర్. ఇతని భార్య రేవతి అలియాస్ రషియా (30). వీరికి భైరవ కుమార్తె, పైసల్ అనే కుమారుడు వున్నారు. నౌషద్ రోజూ మద్యం తాగి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఈ క్రమంలో నౌషద్ గురు వారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి రావడంతో దంపతుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఆగ్రహం చెందిన నౌషద్ కత్తితో భార్యపై దాడి చేసేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడ్డాడు. వెంటనే రషియా అదే కత్తి తీసుకుని అతనిపై దాడి చేసింది. దాడిలో నౌషద్ అక్కడికక్కడే మృతిచెందాడు. శివకంచి పోలీసులు రషియాను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహేతర సంబంధం: ప్రియుడి సాయంతో ఘాతుకం
సాక్షి, మహబూబాబాద్: తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను ప్రియుడు, ఆయన స్నేహితులతో కలిసి హత్య చేయించింది ఓ భార్య.. అయితే, ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు శాస్త్రీయ పద్ధతిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. ఈ మేరకు భార్య, ఆమె ప్రియుడు, ఇందుకు సహకరించిన మరొకరిని అరెస్టు చేయడంతో పాటు, హత్యకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మంగళి కాలనీకి చెందిన ఇన్నారపు నవీన్ పెయింటర్‌గా పనిచేస్తుండగా ఆయన భార్య శాంతితో కలిసి జీవిస్తున్నాడు. అయితే, మరో పెయింటర్ అయిన దాసరి వెంకటేష్‌తో శాంతికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన నవీన్ తన భార్యను గట్టిగా హెచ్చరించాడు. ఈ విషయంలోనే రెండేళ్ల క్రితం దాసరి వెంకటేష్, పద్దం నవీన్ కలిసి ఇన్నారపు నవీన్‌ను ఊరి బయటకు తీసుకువెళ్లి దేహశుద్ది చేశారు. అనంతరం కూడా దాసరి వెంకటేష్, శాంతి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుండగా ప్రతిసారి ఇన్నారపు నవీన్ తన భార్యను హెచ్చరిస్తున్నాడు. అయితే, తన భర్తను అడ్డు తొలగిస్తేనే మంచిదని శాంతి చెప్పడంతో వెంకటేష్ అంగీకరించాడు. ఇందులో భాగంగా గతనెల 21వ తేదీన శాంతి తన తల్లిగారిల్లయిన రేగడి తండాకు వెళ్లి రాత్రి 9 గంటలకు మటన్ తీసుకురావాలని తన భర్త నవీన్‌కు ఫోన్లో చెప్పింది. దీంతో ఆయన హోండా యాక్టివాపై రేగడి తండాకు బయలుదేరగా.. ఈ విషయాన్ని శాంతి తన ప్రియుడు వెంకటేష్‌తో పాటు ఆయన స్నేహితుడు పద్దం నవీన్‌కు చేరవేసింది. దీంతో మధ్యలో కాపుకాచిన వెంకటేష్ ఆయన స్నేహితుడు నవీన్ కలిసి ఇన్నారపు నవీన్‌ను ఆపి రోడ్డు పక్కకు లాక్కెళ్లి రాడ్‌తో తలపై కొట్టడమే కాకుండా మెడకు టవల్‌తో ఉరి బిగించి హత్య చేశారు. ఆ తర్వాత రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని వేసి, దానిపై బండి పడవేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మద్యం గ్లాసులు.. సీసా మూతే ఆధారం రోడ్డు ప్రమాదంలో ఇన్నారపు నవీన్ మృతి చెందినట్లు తెలియడంతో పోలీసులు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా అక్కడ మద్యం సేవించిన ప్లాస్టిక్ గ్లాసులు, మద్యం బాటిల్ మూత, ప్లాస్టిక్ వాటర్ బాటిల్, నేలపై ఉన్న రక్తపు మరకలు, చిల్లర డబ్బు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న మహబూబాబాద్ రూరల్ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్రావు నేర స్థలంలో లభించిన మద్యం బాటిల్‌పై ఉన్న బార్కోడ్ ఆధారంగా వైన్స్‌ను గుర్తించి వెళ్లి ఆరా తీశారు. మార్గమధ్యలో సీసీ కెమెరాల్లో కనిపించిన వ్యక్తులతో పాటు మృతుడి భార్య శాంతి కాల్‌డేటాను ఆరా తీయగా.. పలుమార్లు వెంకటేశ్‌తో మాట్లాడినట్లు తేలింది. దీంతో శాంతితో పాటు దాసరి వెంకటేష్, పద్దం నవీన్‌ను మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం అదుపులోకి విచారించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. ఈ మేరకు కేసులో పకడ్బందీగా విచారించిన కురవి ఎస్సై జె.శంకర్రావు, వారి సిబ్బందిని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఆంగోతు నరేష్కుమార్, మహబూబాబాబాద్ రూరల్ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్రావు పాల్గొన్నారు. -
భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకుని..
ఇల్లందకుంట(హుజూరాబాద్) : ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాలు, ఆపై అనుమానంతో భార్యను హతమార్చిన భర్త ఆపై తానూ ఉరేసుకుని, పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పుట్ట స్వామిమల్లయ్య (48), పుట్ట రాధ(45) భార్యాభర్తలు. వీరి కి ఇద్దరు కుమారులు శ్రీకాంత్, రాజు , కూతురు స్వప్న సంతానం. వీరికున్న ఎకరంతోపాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకుని.. సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు తరచూ గొడవపడుతున్నారు. ఇద్దరు కొడు కులు చదువుల నిమిత్తం హన్మకొండ వెళ్లారు. స్వప్న కొడుకులు శ్రావణ్, మనోజ్ వీరితో నే ఉంటున్నారు. అనుమానం.. వేధింపులు రాధపై అనుమానం పెంచుకున్న మల్లయ్య భార్యను వేధిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం వరకూ వ్యవసాయ పనులు చేసి.. ఇంటికొచ్చిన దంపతులు మరోసారి గొడవకు దిగారు. కోపోద్రిక్తుడైన మల్లయ్య కర్రతో భార్యపై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన రాధ అక్కడికక్కడే చనిపోయింది. దీంతో భయానికి గురైన మల్లయ్య ముందుగా క్రిమిసంహారక మందుతాగాడు. అనంతరం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం ఎంతకూ లేవకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి తలుపులు తెరిచిచూడగా.. ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. పక్క గదిలో పడుకున్న చిన్నారులు అరుస్తూనే ఉన్నారు. పరిశీలించిన ఏసీపీ సిరిసేడు గ్రామంలో దంపతులిద్దరూ మృత్యువాతపడిన సంఘటన తెలుసుకున్న హుజూరాబాద్ ఏసీపీ తాళ్లపల్లి కృపాకర్, సీఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకుని హత్యకు, ఆత్మహత్యకు గల కారణాలను కుటుంబసభ్యులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఈర్ల నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నరేష్కుమార్ తెలిపారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య
సిద్దిపేట: ప్రియుడి మోజులో పడి అతడి సాయంతో కట్టుకున్న భర్తనే హతమార్చిందో మహిళ. ఈ సంఘటన జిల్లాలోని కట్కూరులో వెలుగుచూసింది. అక్కన్నపేట మండలంలోని కట్కూరులో బిచ్చాల రాజు(28)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే భార్య మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. దీంతో కుటుంబంలో కలతలు చెలరేగాయి. అయితే భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని భావించి ప్రియుడితో కలిసి హత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను దారుణంగా చంపేసింది..!
న్యూఢిల్లీ: భర్తను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన కేసులో భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం చోటుచేసుకుంది. డీసీపీ సురేందర్ కుమార్ కథనం ప్రకారం.. వీరేందర్(50), మిథిలేష్(45) భార్యాభర్తలు. వీరు నైరుతి ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. అయితే వీరేందర్ తరచుగా మద్యం సేవించేవాడు. ఈ అలవాటును మానుకోవాలని భార్య చాలాసార్లు చెప్పి చూసింది. ఈ విషయంలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతుండేవారు. భర్తను అంతమొందించాలని ప్లాన్ చేసింది. అనుకున్న ప్రకారమే తనవెంట కత్తి తెచ్చుకుంది. సాగర్ పూర్ ఏరియాలోని దయాల్ పార్క్ లో భర్తపై కత్తితో దాడి చేసింది. కత్తితో విచక్షణా రహితంగా భర్త కడుపులో పొడవడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వీరేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిథిలేష్ పై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసినట్లు డీసీపీ సురేందర్ కుమార్ వివరించారు. -
కట్టుకున్నోడే కాలయముడు!
ఇచ్ఛాపురం: మండలంలోని ఈదుపురంలో వివాహిత హత్య ఘటన సంచలనం రేపుతోంది. గ్రామానికి చెందిన దువ్వు దమయంతి(50) భర్తతో కలిసి జీడి తోటకు వెళ్లి హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఆమెను భర్త బైరి హత్యచేసి పరారైనట్లు పోలీసులు చెబుతున్నారు. సోమవారంత రాత్రంతా మృతదేహం వద్ద పోలీసులు కాపలా కాశారు. ఇన్చార్జి సీఐ సూరినాయుడు, రూరల్ ఎస్సై బి.రామారావు మంగళవారం ఉదయం సంఘటన స్థలం వద్దకు వెళ్లి మృతదేహాన్ని నిశితంగా పరిశీలించారు. దమయంతి ఎడమ నుదిటి పైన, తల వెనుక భాగంలో కత్తి లాంటి ఆయధంతో నరికిన గుర్తులున్నాయి. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం దమయంతి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించారు. ఉదయమే హత్య? సోమవారం రాత్రి హత్య గురించి తెలిసినప్పటికీ ఉదయమే జరిగినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దమయంతి, ఆమె భర్త జీడి తోట పనులకు వెళ్తున్నారు. రోజూ కారియర్లో భోజనం తీసుకువెళ్లి మధ్యాహ్నం అక్కడే భోంచేసి, సాయంత్రానికి తిరిగి వస్తుంటారు. అయితే మృతదేహానికి సమీపంలో కారియర్ ఉంది.అందులో భోజనం అలానే ఉండటంతో భోజనానికి ముందే అంటే తోటకు వెళ్లిన కొద్ది సేపటికే హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చాలా కాలంగా ఇంటిలో తన తల్లిని తండ్రి వేధిస్తున్నాడని, తరచూ తన తల్లి భయం వ్యక్తం చేసేదని దమయంతి కుమార్తె రాజులు తమకు వివరించారని రూరల్ ఎస్సై రామారావు తెలిపారు. భర్త బైరికి గతంలో నేరచరిత్ర ఉందని చెప్పారు. ప్రస్తుతం బైరి పరారీలో ఉన్నాడని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
భర్తను కత్తిపీటతో నరికి చంపిన భార్య
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నాగార్జున కాలనీలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను... భార్య దారుణంగా కడతేర్చిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భర్తను కత్తిపీటతో నరికి చంపిన ఆమె అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది. భర్త వేధింపులు తాళలేక ఈ ఘటనకు పాల్పడినట్లు నిందితురాలు తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.