భర్తను దారుణంగా చంపేసింది..! | Woman fatally stabs husband in Delhi and held | Sakshi
Sakshi News home page

భర్తను దారుణంగా చంపేసింది..!

Published Thu, May 26 2016 5:45 PM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

భర్తను దారుణంగా చంపేసింది..! - Sakshi

భర్తను దారుణంగా చంపేసింది..!

న్యూఢిల్లీ: భర్తను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన కేసులో భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం చోటుచేసుకుంది. డీసీపీ సురేందర్ కుమార్ కథనం ప్రకారం.. వీరేందర్(50), మిథిలేష్(45) భార్యాభర్తలు. వీరు నైరుతి ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. అయితే వీరేందర్ తరచుగా మద్యం సేవించేవాడు. ఈ అలవాటును మానుకోవాలని భార్య చాలాసార్లు చెప్పి చూసింది. ఈ విషయంలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడుతుండేవారు. భర్తను అంతమొందించాలని ప్లాన్ చేసింది.

అనుకున్న ప్రకారమే తనవెంట కత్తి తెచ్చుకుంది. సాగర్ పూర్ ఏరియాలోని దయాల్ పార్క్ లో భర్తపై కత్తితో దాడి చేసింది. కత్తితో విచక్షణా రహితంగా భర్త కడుపులో పొడవడంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వీరేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిథిలేష్ పై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేసినట్లు డీసీపీ సురేందర్ కుమార్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement